TUESDAY,    December 11, 2018
Call for Subscription
23291167 / 1168 / 1169
జిల్లా వార్తలు
Hyderabad News
9/12/2015 12:34:24 AM

అక్కినేని నాటికల పోటీలు షురూ

రవీంద్రభారతి, సెప్టెంబర్11: అక్కినేని నాగేశ్వరరావు నాటక కళాపరిషత్ 21వ ఉభయ రాష్ట్ర స్థాయి నాటికల పోటీలు రవీంద్రభారతిలో శుక్రవారం ప్రారంభమయ్యాయి. యువ కళావాహిని ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మూడు రోజుల నాటికల పోటీల్లో ముందుగా మురశీకృష్ణ కళానిలయం నిజామాబాద్ వారి పొద్దు పొడిచింది నాటికను ప్రదర్శించారు. అనంతరం ఉషోదయ కళానికేతన్ హైదరాబాద్ వారు మరో దేవాలయం నాటికలో సమాజంలో స్వార్థంతో మానవీయ విలువలు తరిగిపోతున్న తీరును చూపించగా శ్రీకళానికేతన్ హైదరాబాద్ వారు తెలుగు భాషా ఔన్యత్యాన్ని చాటిచెప్పే చెంగల్వ పూదండ నాటికను ప్రదర్శించారు. ఈ సందర్భంగా పరుచూరి బ్రదర్స్( పరుచూరి వేంకటేశ్వరరావు, డా.పరుచూరి గోపాల కృష్ణ)లను ఘనంగా సత్కరించారు. ప్రముఖ సినీ నటులు డా.కైకాల సత్యనారాయణ ముఖ్య అతిథిగా పాల్గొని అభినందనలు తెలియజేశారు. సారిపల్లి కొండలకావు అధ్యక్షతన జరిగిన సభలో సినీ దర్శకులు ఎ.కోదండరామిరెడ్డి, నాటక రంగప్రముఖులు డా.చాట్ల శ్రీరాములు, సాంస్కృతిక ప్రముఖులు పొట్లూరి హరికృష్ణ, గజల్ గాయకులు డా.గజల్ శ్రీనివాస్ అతిథులుగా పాల్గొని అభినందనలు తెలియజేశారు. యువకళావాహిని అధ్యక్షులు వై.కె.నాగేశ్వరరావు స్వాగతం పలుకుతూ నాటిక పోటీల నేపథ్యాన్ని వివరించారు. శనివారం సైకత శిల్పం, సౌందర్య భారతం, పెళ్లిచేసి చూడు?, అనగనగా... నాటికలు ప్రదర్శించనున్నారు.
184
Advertisement
E-Paper
Advertisement


© 2011 Telangana Publications Pvt.Ltd