ప్రత్యేక పూజలు సర్పంచ్ వీర్ల సరోజన- ప్రభాకర్‌రావు దంపతులు
రామడుగు, జనవరి 25: మండలంలోని వెలిచాలలో సర్పంచ్ వీర్ల సరోజన-ప్రభాకర్‌రావు దంపతుల ఆధ్వర్యంలో ప్రత్యేక యాగశాల నిర్మించి ఐదు రోజు చేపట్టిన శతచండీ యాగం మంగళవారం వైభవంగా కొనసాగింది. యాగశాలను తీరొక్క పూలతో అందంగా అలంకరించగా, అమ్మవారు దుర్గాదేవీ అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. శృంగేరి పండితులు గోపీకృష్ణశర్మ, ఫణిశశాంక్ శర్మ, మంగళంపల్లి వేణుగోపాలశర్మతో పాటు 25 మంది ప్రత్యేక పూజారులతో యాగ క్రతువు పూర్తి చేశారు. సర్పంచ్ వీర్ల సరోజన-ప్రభాకర్‌రావు, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు వీర్ల వెంకటేశ్వరరావు-కవిత దంపతులతో కలిసి పదివేల నవాక్షరీ హోమం, శతచండీ హోమం, మహాపూర్ణాహుతి, తదితర పూజలు చేశారు. పూజల్లో జిల్లా న్యాయమూర్తి లక్ష్మి, రామడుగు, గంగాధర, కొడిమ్యాల, బోయినపల్లి జడ్పీటీసీలు మార్కొండ లక్ష్మి-కిష్టారెడ్డి, పుల్కం అనురాధ-నర్సయ్య, పునుగోటి ప్రశాంతి-కృష్ణారావు, కత్తెరపాక ఉమాకొండయ్య, చొప్పదండి ఎంపీపీ చిలుక రవీందర్, కొక్కెరకుంట, గంగాధర సింగిల్‌విండో చైర్మన్లు ఒంటెల మురళీకృష్ణారెడ్డి, దూలం బాలగౌడ్, గోపాల్రావుపేట ఏఎంసీ మాజీ చైర్మన్ గంట్ల వెంకటరెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గంట్ల జితేందర్‌రెడ్డి, కొండగట్టు ఆలయ బోర్డు డైరెక్టర్ బండపెల్లి యాదగిరి, చొప్పదండి మున్సిపల్ కౌన్సిలర్ నలమాచు రామకృష్ణ, నాయకులు మాజీ సర్పంచ్ వీర్ల రవీందర్రావు, సంజీవరావు, సర్పంచులు అమరేందర్‌రెడ్డి, జవ్వాజి శేఖర్, నాయకులు గడ్డం చుక్కారెడ్డి, బందారపు అజయ్‌కుమార్‌గౌడ్, నలమాచు రామకృష్ణ, లంక మల్లేశం, ఆరపెల్లి ప్రశాంత్, వివేక్, ఎడవెల్లి మల్లేశం, గుండి ప్రవీణ్, జంగిలి రాజమౌళి, గంట్ల రవీందర్‌రెడ్డి, కొమురారెడ్డి, మామిడి తిరుపతి, చంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.