కోయిలకొండ, సెప్టెంబర్ 17 : మం డలంలోని దమాయపల్లి, కోయిలకొండ తదితర గ్రామాల్లో విశ్వకర్మ భగవాన్ పూజా మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విశ్వకర్మ భ గవాన్కు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో తిరుపతయ్యచారి, మల్లికార్జున్చారి, ప్రవీణ్, సత్తయ్యచారి, వీరాచారి, రాజుచారి తదితరులు పాల్గొన్నారు.
బాలానగర్ మండలంలో..
బాలానగర్, సెప్టెంబర్ 17 : విశ్వకర్మ జయంతిని పురస్కరించుకొని మండల కేంద్రంలోని వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో వైస్‌ఎంపీపీ వెంకటాచారి, విశ్వబ్రాహ్మణ ఐక్యవేదిక మండల అధ్యక్షుడు మనోహరాచా రి, చక్రంచారి, శ్రీనివాసాచారి ఉన్నారు.
జడ్చర్ల పట్టణంలో..
జడ్చర్లటౌన్, సెప్టెంబర్ 17 : విశ్వబ్రాహ్మణ, స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో విశ్వకర్మ భగవాన్‌కు ప్రత్యేక పూజలు ని ర్వహించారు. మున్సిపల్ చైర్పర్సన్ దోరేపల్లి లక్ష్మి, మార్కెట్ కమిటీ చైర్మన్ కాట్రపల్లి లక్ష్మయ్య విశ్వకర్మ భగవాన్ను ద ర్శించుకొని పూజలు చేశారు. ఈ సందర్భంగా బులియన్ మర్చంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమా న్ని నిర్వహించారు. కార్యక్రమంలో కౌ న్సిలర్ పుష్పలత, మర్చంట్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు రాజేశ్ పాల్గొన్నారు.