e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, June 20, 2021
Home జిల్లాలు ప్రజల ఆరోగ్యంపైనే ధ్యాస

ప్రజల ఆరోగ్యంపైనే ధ్యాస

ప్రజల ఆరోగ్యంపైనే ధ్యాస

మంథని టౌన్‌, జూన్‌ 6: మంథని ప్రాంత ప్రజల ఆరోగ్యంపైనే మా ధ్యాసంతా ఉంటుందని పెద్దపల్లి జడ్పీ చైర్మన్‌ పుట్ట మధూకర్‌ అన్నారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో సైతం సేవలందిస్తున్న మున్సిపల్‌ పారిశుధ్య కార్మికులకు పుట్ట లింగమ్మ చారిటబుల్‌ ట్రస్టు ఆధ్వర్యంలో జడ్పీ చైర్మన్‌ బ్రీతింగ్‌ స్ప్రేలను మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ పుట్ట శైలజ తో కలిసి ఆదివారం మున్సిపల్‌ కార్యాలయ ఆవరణలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మధూకర్‌ మాట్లాడుతూ, కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో సైతం ఉత్తమ సేవలందిస్తున్న పారిశుధ్య కార్మికులకు మాస్కు ద్వారా శ్వాస తీసుకోవడంలో ఇబ్బం ది లేకుండా ఉండేందుకు ఆయుర్వేదిక వన మూలికలతో తయారు చేసిన ఈ బ్రీతింగ్‌ స్ప్రేలను పంపిణీ చేశామని వివరించారు. మేజర్‌ గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా, చైర్‌ పర్సన్‌ పుట్ట శైలజ మున్సిపల్‌ సిబ్బందికి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్నారని తెలిపారు. మున్సిపల్‌ కార్మికులకు బట్టలు, నిత్యావసరాలను పంపిణీ చేయడంతో పాటు జీతాలు పెంచడం, సరిగా అందేలా ఏడేండ్లుంగా ఆమె ప్రత్యేకంగా కృషి చేస్తున్నారని వివరించారు. తమకు ఏ అవకాశం వచ్చినా నియోజకవర్గంలోని పేదల కోసమే పనులు చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ శ్రీనివాస్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు తగరం శంకర్‌లాల్‌, కౌన్సిలర్లు వీకే రవి, గర్రెపల్లి సత్యనారాయణ, కుర్రు లింగయ్య, నక్క నాగేంద్ర శంకర్‌, కో-ఆప్షన్‌ సభ్యులు రాధాకృష్ణ, సముద్రాల స్వాతి శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ప్రజల ఆరోగ్యంపైనే ధ్యాస

ట్రెండింగ్‌

Advertisement