e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, September 21, 2021
Home జిల్లాలు కాంతులీనుతున్న గ్రామాల గల్లీలు

కాంతులీనుతున్న గ్రామాల గల్లీలు

కుభీర్‌, ఆగస్టు 4 : పట్టణాలకు దీటుగా రాత్రి పూట పండు వెన్నెలను తలపించేలా పల్లెల్లోని గల్లీ లు సైతం కాంతులీనుతున్నాయని ముథోల్‌ ఎమ్మె ల్యే గడ్డిగారి విఠల్‌రెడ్డి పేర్కొన్నారు. మండలంలో ని పల్సి గ్రామంలో బుధవారం రూ.4.50 లక్షల జీపీ నిధులతో ఏర్పాటు చేసిన హైమాస్ట్‌ లైట్లను సర్పంచ్‌ శ్రీరాముల కవిత, రాజేశ్‌చారితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ నూతన పంచాయతీరాజ్‌ చట్టం అమలు చేసి పల్లెల అభివృద్ధికి క్లీన్‌ అండ్‌ గ్రీన్‌కు పెద్దపీట వేయడంతో పాటు జీపీలకు సమృద్ధిగా నిధులు అందిస్తున్నారన్నారు. అ నంతరం మండలంలోని డోడర్న, తదితర గ్రామాల్లో సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులు అందజేశారు.
హన్మాండ్లు మృతి పార్టీకి తీరని లోటు
గంట హన్మాండ్లు మృతి తననెంతో బాధించిందని, ఆయన లేని లోటు తీర్చలేనిదని ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని సిర్పెల్లి(హెచ్‌) గ్రామంలో టీఆర్‌ఎస్‌ మండల నాయకుడు గంట హన్మాండ్లు శుక్రవారం మృతి చెందగా.. ఆయన ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. హన్మాండ్లు పార్టీకి చేసిన సేవలను గుర్తు చేశారు. ఎమ్మెల్యే వెంట టీఆర్‌ఎస్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి తూం రాజేశ్వర్‌, వైస్‌ ఎంపీపీ మొహియొద్దీన్‌, ఏఎంసీ చైర్మన్‌ కందుర్‌ సంతోష్‌, సింగిల్‌ విండో చైర్మన్‌ గంగాచరణ్‌, పీరాజీ, జడ్పీటీసీ శంకర్‌ చౌహాన్‌, కో ఆప్షన్‌ సభ్యుడు దత్తహరి పటేల్‌, పుప్పాల పీరాజీ, దత్తుగౌడ్‌, డాక్టర్‌ కే రాజన్న, నిగ్వ ఎంపీటీసీ దొంతుల దేవిదాస్‌, దాసరి మల్లారెడ్డి, కళ్యాణ్‌ ఉన్నారు.

పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
భైంసా, ఆగస్టు 4 : పేదల సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తున్నదని ఎమ్మెల్యే విఠల్‌ రెడ్డి అన్నారు. భైంసా పట్టణంలోని విశ్రాం తి భవనంలో కిసాన్‌గల్లీకి చెందిన కాండ్లి పోసాని బాయికి మంజూరైన రూ.54 వేల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిరుపేదలు ఆకలితో అలమటించకూడదన్న ఆలోచనతో సీఎం కేసీఆర్‌ అర్హులకు ఆహార భద్రత కార్డులు అందజేస్తున్నారన్నారు. పేదలకు సీఎంఆర్‌ఎఫ్‌ అండగా నిలుస్తున్నదని తెలిపారు. టీఆర్‌ఎస్‌ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
గుండేగాం సమస్యను త్వరలో పరిష్కరిస్తాం..
గుండేగాం సమస్యను త్వరలో పరిష్కరిస్తామని ఎమ్మెల్యే విఠల్‌ రెడ్డి అన్నారు. పట్టణంలోని వి శ్రాంతి భవనంలో గుండేగాం గ్రామస్తులు ఎమ్మె ల్యే విఠల్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇప్పటికే గుండేగాం సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లామని, సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. అప్పటి వరకు పట్టణం లో ఉన్న డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లలో ఉండాలని సూచించారు. ఈయన వెంట భైంసా మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ కృష్ణ, వైస్‌ చైర్మన్‌ ఆసిఫ్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు నివర్తి సాంగే, సోమాజీ జాదవ్‌, ప్రసంజిత్‌ ఆగ్రే, తోట రాము, మంత్రి, భోజరాం, కుబిరే సాయినాథ్‌, తదితరులు ఉన్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana