e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, June 22, 2021
Home జిల్లాలు నేతన్నల హర్షాతిరేకం

నేతన్నల హర్షాతిరేకం

నేతన్నల హర్షాతిరేకం

సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ ఫ్లెక్సీకి పాలాభిషేకం చేస్తున్న పవర్‌లూం మ్యాక్‌ సంఘాల సంక్షేమ సంఘం ప్రతినిధులు, నేతన్నలు
సిరిసిల్ల టౌన్‌, జూన్‌ 3: సిరిసిల్లలో నేత బజార్‌ ఏర్పాటుకు మంత్రి కేటీఆర్‌ హామీ ఇవ్వడంతోపాటు ఏఎంసీ స్థలం కేటాయించాలని ఆదేశాలు జారీ చేయడంపై నేతన్నలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని నేతన్న చౌరస్తాలో సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ ఫ్లెక్సీకి పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు.
నేత బజార్‌కు ఏఎంసీ స్థలం కేటాయించాలని మంత్రి కేటీఆర్‌ ఆదేశాలు జారీ చేయడంపై మ్యాక్స్‌ సంఘాల ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. గురువారం జిల్లా కేంద్రంలోని నేతన్న చౌరస్తాలో సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ చిత్రపటానికి పాలాభిషేకం చేసి సంబు రాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్న మంత్రి కేటీఆర్‌ను కలిసి ఏఎంసీ గోదాం స్థలాన్ని తమకు కేటాయించాలని కోరగా సానుకూలంగా స్పందించారని, వెంటనే కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. స్థానిక ఇందిరానగర్‌లోని సుమారు రెండెకరాల విస్తీర్ణంలో గోదాం స్థలం మ్యాక్‌ సంఘాలకు కేటాయించడం ద్వారా బతుకమ్మ చీరలతో పాటు స్కూల్‌ యూనిఫాంలు, తదితర ప్రభుత్వ ఆర్డర్లకు సంబంధించిన దుస్తులు నిల్వ చేసుకునేందుకు వీలు ఏర్పడిందన్నారు. స్వరాష్ట్రంలో మంత్రి కేటీఆర్‌ నేతన్నల సంక్షేమానికి తొలి ప్రాధాన్యం ఇస్తున్నారని కొనియాడారు.

గత పాలకుల హయాంలో ఉరిసిల్లగా మారిన సిరిసిల్ల.. స్వరాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ ఏడేండ్ల పాలనలో మంత్రి కేటీఆర్‌ తీసుకుంటున్న చర్యలతో సిరుల ‘ఖిల్లా’గా వర్ధిల్లుతున్నదని చెప్పారు. ఒకప్పుడు సిరిసిల్ల కార్మికులు ఉపాధి కరువై బొంబాయి, భీవండి, గల్ఫ్‌ వంటి ప్రాంతాలకు వలస వెళ్లేవారని గుర్తుచేశారు. కానీ ప్రస్తుతం బతుకమ్మ చీరెల తయారీపై ఒక్కో కార్మికుడు నెలకు 20వేల – 30వేల వరకు సంపాదిస్తూ సంతోషకరమైన జీవనం సాగిస్తున్నారన్నారు. నేతన్నల సంక్షేమా న్ని కాంక్షిస్తూ వ్యవసాయ మార్కెట్‌ కమిటీ గోదాం స్థలాన్ని నేత బజార్‌కు మంజూరు చేసిన మంత్రి కేటీఆర్‌తో పాటు ఇందుకు సహకరించిన టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నేత చీటి నర్సింగరావు, రాష్ట్ర సహాయ కార్యదర్శి గూడూరి ప్రవీణ్‌, పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇక్కడ జిల్లా పవర్‌లూం మ్యాక్‌ సంఘాల సంక్షేమ సంఘం అధ్యక్షుడు చిమ్మని ప్రకాశ్‌, కార్యదర్శి భీమని రాంచంద్రం, అర్బన్‌ బ్యాంకు చైర్మన్‌ గాజుల నారాయణ, దూస భూమయ్య, దూడం శంకర్‌, గోవిందు రవి, మండల సత్యం, ఆడెపు భాస్కర్‌, ఆంకారపు రవి, మంచె మల్ల య్య, దూడం రమేశ్‌, అలువాల ఉదయ్‌, యెల్దం డి శంకర్‌, గుండ్లపల్లి గౌతం, పెంట శ్రీధర్‌, కోడం శ్రీనివాస్‌ తదితరులు ఉన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
నేతన్నల హర్షాతిరేకం

ట్రెండింగ్‌

Advertisement