e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, September 19, 2021
Home జిల్లాలు జోరుగా వరినాట్లు

జోరుగా వరినాట్లు

పాన్‌గల్‌, ఆగస్టు 2 : ఎంజీకేఎల్‌ఐ, భీమా కెనాల్స్‌, వ్యవసాయ బావుల ఆయకట్టు కింద అన్నదాతలంతా బీజీగా ఉన్నారు. పంటసీజన్‌లో అన్నదాతలు ప్రధానంగా వరి సాగుకే ప్రాధాన్యతనిస్తున్నారు. ఒకప్పుడు సాగునీరులేక బీడువారిన భూములకు తెలంగాణ రాష్ట్రం పుణ్యమా అ ని జలసిరి సంతరించుకోవడంతో పంటలసాగుకు కళ వచ్చింది. ఇప్పటికే మండలంలోని అన్ని కుంటలు, చెరువులు దాదాపు నిండాయి. దీనికితోడు ప్రభుత్వం వ్యవసాయానికి 24 గంటల విద్యుత్‌, రైతుబీమా, రైతుబం ధు, పుష్కలంగా సాగునీరు, సబ్సీడి విత్తనాలు, ఎరువు లు అందజేస్తూ రైతులను వ్యవసాయం చేసుకునేందుకు ప్రోత్సాహిస్తున్నది. దీంతో అన్నదాతలు ప్రతి సెంటు, గుం టను సాగులోకి తీసుకొచ్చారు. మండలకేంద్రంతోపాటు కేతేపల్లి, వెంగళాయిపల్లి, రేమద్దుల, తెల్లరాళ్లపల్లి, బుసిరెడ్డిపల్లి, మాందాపూర్‌, రాయినిపల్లి తదితర అనేక గ్రా మాల్లో రైతులు వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. రైతులు పొలాల్లో మడులను ట్రాక్టర్ల ద్వారా చదును చేసి కరిగెట్లు కడుతున్నారు. పలుగ్రామాల్లో వరినాట్లు వేస్తున్నారు. రోజురోజుకూ సాగువిస్తీర్ణం పెరుగనుంది. కూలీలకు చేతినిండా పనులు దొరకడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
వీపనగండ్లలో..
వీపనగండ్ల, ఆగస్టు 2 : గత నెల రోజుల నుంచి ఆశించిన స్థాయిలో వర్షాలు కురువడంతో మండలంలోని వీపనగండ్ల, గోవర్ధనగిరి, సంగినేనిపల్లి, తూంకుంట తదితర గ్రామాల్లో వరి నాట్ల పనిలో అన్నదాతలు, కూలీలు నిమగ్నమయ్యారు. గోపల్‌దిన్నె రిజర్వాయర్‌తోపాటు కాలువలు, కుంటలు, చెరువులు ద్వారా ఆధారపడే రైతన్నలతోపాటు వర్షాధార పంటలపై ఆధారపడిన అన్నదాతలు వరి సాగు పనిలో నిమగ్నమయ్యారు. ప్రధానంగా 0.36 టీఎంసీ కెపాసీటీ గల గోపల్‌దిన్నె రిజర్వాయర్‌ నిండడంతో ఉమ్మడి మండలంలోని గోవర్ధనగిరి, వెలగొండ, లక్ష్మిపల్లి, పెద్దదగడ, గూడెం, బెక్కెం, గోప్లాపూర్‌ తదితర గ్రామాల్లో దాదాపుగా 30వేల ఎకరాల్లో పంటలు సాగు చేసే అవకాశమున్నట్లు అధికారులు తెలిపారు. వరినాట్లు వేయడం వంటి పనుల్లో రైతు కూలీలు నిమగ్నమయ్యా రు. కూలీ డబ్బుల కంటే మించి అవసరమైతే గుత్తకు ఎక్కువ డబ్బులు మాట్లాడుకొని వడి వడిగా వేగంగా పని చేస్తూ చీకటి పడే వరకు నాట్లు వేసే పనిలో నిమగ్నమవుతున్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana