e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, September 19, 2021
Home జిల్లాలు గొల్ల కురుమలు ఆర్థికంగా ఎదగాలి

గొల్ల కురుమలు ఆర్థికంగా ఎదగాలి

గొర్రెల కాపరుల సంఘం వనపర్తి జిల్లా అధ్యక్షుడు కురుమూర్తి యాదవ్‌
గోపాల్‌పేట, ఆగస్టు 2 : ప్రభుత్వ సంక్షేమ పథకాల ను సద్వినియోగం చేసుకొని గొల్ల కురుమలు ఆర్థికంగా ఎదగాలని గొర్రెల కాపరుల సంఘం వనపర్తి జిల్లా అధ్యక్షుడు కురుమూర్తి యాదవ్‌ కోరారు. మండల కేంద్రంలోని ఏదుట్ల రోడ్డు పక్కన పశుసంవర్ధకశాఖ నిర్మించిన గొర్రెల షెడ్‌ను సోమవారం ఉపాధ్యక్షుడు చంద్రయ్య యాదవ్‌తో కలిసి సందర్శించారు. అనంతరం తాడిపర్తి గ్రామంలో గొర్రెల కాపరుల సంఘం సభ్యులతో సమావేశమై మాట్లాడారు. కొంత కాలంగా షెడ్డు నిరూపయోగంగా ఉండడంతో.. కొందరు అక్రమార్కులు ప్రహరీ కోసం ఏర్పాటు చేసిన సిమెంటు స్తంభాలు తొలగించి, బోర్డును తూడ్చివేశారన్నారు. ఈ విషయంపై తాసిల్దార్‌ నరేందర్‌కు ఫిర్యాదు చేయగా.. సర్వే చేయించి హద్దులు ఏర్పాటు చేశారన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన షెడ్‌ ఆక్రమణకు గురికాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ప్రతి గ్రామంలో గొర్రెలు, మేకలకు సామూహిక వసతి గృహాలు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలిపారు. గ్రామాల్లో ప్రభు త్వ స్థలాలను సేకరిస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వ భూమి లో జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం ద్వారా ఒక్కొక్కరికీ ఒక్కో గొర్రెల పాకను రూ.96 వేలు, ఎస్‌డీఎఫ్‌, సీఆర్‌ఎఫ్‌ ద్వారా మిగతా మొత్తంతో కాపరులకు అనువైన స్థలంలో నిర్మించనున్నట్లు తెలిపారు. ఈ వసతి గృహాల్లో గొర్రెలు, మేకలను పోషించడంతో అధిక మాం స ఉత్పత్తులు వస్తాయని, 50 గొర్రెలు ఉన్న ప్రతి వ్యక్తికి ఏడాదికి రూ. 50 వేలు అదనపు లాభం చేకూరుతుందన్నారు. ఈనెల 4వ తేదీన గొర్రెల కాపరుల సంఘం గ్రా మ అధ్యక్ష, కార్యదర్శులకు జిల్లా కేంద్రంలోని దాచలక్షమ్మ ఫంక్షన్‌హాల్‌లో నిర్వహించనున్న సర్వసభ్య సమావేశానికి వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి హాజరుకానున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో గొర్రెల కాపరుల సంఘం జిల్లా డైరెక్టర్‌ పరశురాం యాదవ్‌, నాయకులు పుల్లయ్య యాదవ్‌, తిరుమల్‌ యాదవ్‌, మల్లయ్య యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana