e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, June 21, 2021
Home జిల్లాలు ఉద్యమధీరుడు కేసీఆర్‌

ఉద్యమధీరుడు కేసీఆర్‌

ఉద్యమధీరుడు కేసీఆర్‌

త్వరలో రామగుండంలో ఇండస్ట్రియల్‌, ఐటీ పార్కు
ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌

గోదావరిఖని, జూన్‌ 2: ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో ప్రజలందరినీ ఒక్కతాటిపైకి తీసుకువచ్చి ముందుకు నడిపిన ఉద్యమధీరుడు కేసీఆర్‌ అని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ కొనియాడారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా క్యాంపు కార్యాలయంలో బుధవారం జాతీయ జెండాను ఆయన ఆవిష్కరించారు. రాష్ట్రం కోసం అమరులైన వారికి నివాళులర్పించారు. రాష్ట్రం కోసం ప్రజల కోసం జన్మించిన కారణ జన్ముడు కేసీఆర్‌ అని, మహాత్ముడి మరో జన్మే కేసీఆర్‌ అని పేర్కొన్నారు. తనను ఎమ్మెల్యేగా ఆశీర్వదించి గెలిపించారని, వారి రుణం తీర్చుకునేందుకు నిత్యం అందుబాటులో ఉంటూ సేవ చేస్తున్నామని వివరించారు. రెండోదఫా మెడికల్‌ కళాశాల ఏర్పాట్లలో ఇక్కడ నిర్మించేలా కృషి చేస్తున్నామని చెప్పారు. నిరుద్యోగ యువతకు ఉపాధి మార్గాల కల్పన కోసం ఇండస్ట్రియల్‌, ఐటీ పార్కులు త్వరలో ఈ ప్రాంతంలో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మేయర్‌ అనిల్‌కుమార్‌, డిప్యూటీ మేయర్‌ అభిషేక్‌ రావు, కార్పొరేటర్లు శ్రీనివాస్‌, సతీశ్‌కుమార్‌ రమణారెడ్డి, అడ్డాల స్వరూప, కృష్ణవేణి, రాజ్‌కుమార్‌, కో-ఆప్షన్‌ సభ్యుడు రఫి, నాయకులు తానిపర్తి గోపాల్‌రావు, పాతపెల్లి ఎల్లయ్య, రాకం వేణు, రామస్వామి, సలీం బేగ్‌, మొగిలి, సిరాజొద్దీన్‌, శ్రీనివాస్‌, శ్యాం, ఇందు, సునీల్‌ ఉన్నారు.
భాగస్వాములవ్వాలి ..
పెద్దపల్లి రూరల్‌, జూన్‌ 2: బంగారు తెలంగాణ నిర్మాణంలో అందరూ భాగస్వాములవ్వాలని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను పెద్దపల్లి మండల పరిషత్‌ కార్యాలయంలో చేపట్టగా, ఆయన హాజరయ్యారు. జాతీయ జెండాను ఎంపీపీ బండారి స్రవంతి శ్రీనివాస్‌గౌడ్‌ ఎగురవేసిన అనంతరం ఎమ్మెల్యే జెండా వందనం చేశారు. అనంతరం అమరులకు నివాళులర్పించారు. కార్యక్రమంలో వైస్‌ ఎంపీపీ ముత్యాల రాజయ్య, ఎంపీడీవో రాజు, ఎంపీవో సుదర్శన్‌, ఏఈ పటేల్‌ మదన్‌మోహన్‌ రెడ్డి, పర్యవేక్షకుడు సేనారెడ్డి, ఏపీవో మల్లేశ్వరి, టీఏలు వెంకటేశ్‌, దివ్య, హసన్‌ తదితరులు పాల్గొన్నారు.
త్యాగాల ఫలితమే..
ఫర్టిలైజర్‌సిటీ, జూన్‌ 2: ఎంతోమంది ఉద్యమకారుల పోరాటాలు, అమరవీరుల త్యాగాల ఫలితమే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావమని సీపీ సత్యనారాయణ పేర్కొన్నారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని బుధవారం పోలీస్‌ కమిషనరేట్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన జాతీయ జెండాను ఆయన ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడారు. ఇక్కడ ఓఎస్డీ శరత్‌ చంద్ర పవార్‌, అడిషనల్‌ ఏఆర్‌ డీసీపీ సంజీవ్‌, ఏసీపీ ఉమేందర్‌, ఎస్‌బీ ఏసీపీ నారాయణ, సీసీఎస్‌ ఇన్‌స్పెక్టర్‌ వెంకటేశ్వర్లు, ట్రాఫిక్‌ సీఐ ప్రవీణ్‌కుమార్‌, సీఐ రమేశ్‌బాబు, లక్ష్మీనారాయణ, ఆర్‌ఐ మధుకర్‌, ఎస్‌ఐలు నాగరాజు, సూర్యనారాయణ, ఆర్‌ఎస్‌ఐలు సంతోష్‌, రాజేశ్‌, ప్రవీణ్‌ పాల్గొన్నారు.
అలాగే జిల్లా ఆరో అదనపు న్యాయస్థానంలో న్యాయమూర్తి భారతి లక్ష్మి, మున్సిఫ్‌ కోర్టులో మెజిస్ట్రేట్‌ పర్వతపు రవి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఇక్కడ గోదావరిఖని మొదటి, రెండవ మున్సిఫ్‌ మెజిస్ట్రేట్‌లు భార్గవి, ప్రియాంక, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు అమరేందర్‌ రావు, జవ్వాజి శ్రీనివాస్‌, కోర్టు సిబ్బంది ఉన్నారు. అలాగే రామగుండం ఎరువుల కర్మాగారంలో ఈడీ బంగార్‌ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఇక్కడ అధికారులు అజయ్‌కుమార్‌, మయాంక్‌, పీఆర్వో ఐశ్వర్య ఉన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ఉద్యమధీరుడు కేసీఆర్‌

ట్రెండింగ్‌

Advertisement