e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, June 22, 2021
Home జిల్లాలు సీఎం చిత్ర పటానికి క్షీరాభిషేకం

సీఎం చిత్ర పటానికి క్షీరాభిషేకం

సీఎం చిత్ర పటానికి క్షీరాభిషేకం

నాగల్‌గిద్దా, మార్చి 15: పంచాయతీ కార్యదర్శుల శిక్షణ కాలాన్ని మూడు నుంచి రెండు సంవత్సరాలకు తగ్గించడంతో పాటు ఉద్యోగాలను రెగ్యులరైజ్‌ చేస్తామని ప్రభుత్వం నిర్ణయించడంతో సోమవారం మండల కేంద్రంలోని జూనియర్‌ పంచాయతీ కార్యదర్శుల సంఘం ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం చేసి సంబురాలు చేసుకున్నారు.
కల్హేర్‌, మార్చి 15 : పీఆర్‌సీ 29 శాతం, ప్రొబేషన్‌ పిరియడ్‌ను ఏడాది తగ్గించినందుకు మండల పంచాయతీ కార్యదర్శులు సోమవారం సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా మండల సీనియర్‌, జూనియర్‌ కార్యదర్శులు, అధ్యక్షులు మాట్లాడుతూ జూనియర్‌ పంచాయతీ కార్యదర్శులకు ప్రొబేషన్‌ పిరియడ్‌ మూడేండ్లు ఉండగా, రెండేండ్లకు తగ్గించడంతో కార్యదర్శులు హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సీనియర్‌ కార్యదర్శులు తిరుపతి, రాందాస్‌, రమేశ్‌, వేణుగోపాల్‌, రాధాకృష్ణ, జూనియర్‌ కార్యదర్శులు బాల్‌రాజ్‌, నాందేవ్‌, పవన్‌, రజితరెడ్డి, సుమ, సుష్మ పాల్గొన్నారు.
జహీరాబాద్‌, మార్చి 15 : జూనియర్‌ పంచాయతీ కార్యదర్శులకు శిక్షణ కాలాన్ని మూ డు సంవత్సరాల నుంచి రెండు సంవత్సరాలకు చేయడం సంతోషంగా ఉందని జహీరా బాద్‌ డివిజన్‌ జూనియర్‌ పంచాయతీ కార్యదర్శుల సంఘం అధ్యక్షుడు ఆధిత్య తెలిపారు. సోమవారం జహీరాబాద్‌ మండల పరిషత్‌ కార్యాలయం ఎదుట జూనియర్‌ పంచాయతీ కార్యదర్శుల ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ జూనియర్‌ పంచాయతీ కార్యదర్శులకు ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు శిక్షణ కాలం తగ్గించడం హర్షణీయమని, రాష్ట్ర ప్రభుత్వానికి ఎల్లప్పడూ రుణపడి ఉంటామన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు పేదలకు అందించేందుకు నిరంతరం కృషి చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో జహీరాబాద్‌ డివిజన్‌ జూనియర్‌ పంచాయతీ కార్యదర్శుల సంఘం ప్రధాన కార్యదర్శి సంపత్‌, కోశోర్‌, వికాస్‌, దత్తురెడ్డితో పాటు పలువురు ఉన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
సీఎం చిత్ర పటానికి క్షీరాభిషేకం

ట్రెండింగ్‌

Advertisement