e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, June 15, 2021
Home జిల్లాలు దశకంఠుడిపై ఊరేగిన నీలకంఠుడు

దశకంఠుడిపై ఊరేగిన నీలకంఠుడు

దశకంఠుడిపై ఊరేగిన నీలకంఠుడు

అలంపూర్‌, మార్చి 13 : జోగుళాంబ గ ద్వాల జిల్లా అలంపూర్‌ క్షేత్రంలో మహాశివరా త్రి బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో నాలుగో రోజైన శనివారం ఉదయం ఆది దంపతులు జోగుళాంబ, బాలబ్రహ్మేశ్వర స్వామిని రావణ వాహనంపై ఊరేగించారు. భ క్తులు భారీగా తరలొచ్చి వేడుకను తిలకించి పరశించిపోయారు. సాయంత్రం అశ్వవాహన సేవ నిర్వహించారు. (పారువేట) పురవీధుల మీదు గా స్వామివారిని తీసుకెళ్తుండగా భక్తులు ముడుపులు చెల్లిస్తూ పూజలు చేశారు. ఈ కార్యక్రమం కనుల పండువగా కొనసాగింది. రావణ వాహనాన్ని చూడముచ్చటగా అలంకరించారు. బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయం నుంచి బయలుదేరిన ఊరేగింపును ఆలయ ఈవో ప్రేమ్‌కుమార్‌ రావు, చైర్మన్‌ రవి ప్రకాశ్‌గౌడ్‌, ధర్మకర్తలు ప్రా రంభించారు. ఆలయంలో ఉదయం, సాయం త్రం నిత్యపూజలు నిర్వహించారు. కార్యక్రమంలో పుర ప్రముఖులు, అర్చకులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
దశకంఠుడిపై ఊరేగిన నీలకంఠుడు

ట్రెండింగ్‌

Advertisement