e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, June 22, 2021
Home కరీంనగర్ తెలంగాణ సంస్కృతి పరిరక్షణకు కృషి

తెలంగాణ సంస్కృతి పరిరక్షణకు కృషి

తెలంగాణ సంస్కృతి పరిరక్షణకు కృషి

జాగృతి జిల్లా అధ్యక్షుడు జాడి శ్రీనివాస్‌
జిల్లా వ్యాప్తంగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పుట్టిన రోజు వేడుకలు

తెలంగాణచౌక్‌/కమాన్‌చౌరస్తా, మార్చి 13: తెలంగాణ సంస్కృతీసంప్రదాయాల పరిరక్షణకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నాయకత్వంలో జాగృతి సంస్థ కృషి చేస్తున్నదని జాగృతి జిల్లా అధ్యక్షుడు జాడి శ్రీనివాస్‌ పేర్కొన్నారు. తెలంగాణచౌక్‌లో శనివారం తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, నిజామాబాద్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పుట్టిన రోజు వేడుకలను జాగృతి యూత్‌ నాయకులు ఘనంగా నిర్వహించారు. కేక్‌ కట్‌ చేసి, స్వీట్లు పంచిపెట్టారు. ముఖ్యఅతిథిగా హాజరైన జాడి శ్రీనివాస్‌ మాట్లాడుతూ, తెలంగాణ సంస్కృతిని ప్రపంచానికి తెలియజేసిన ఘనత ఎమ్మెల్సీ కవితకే దక్కుతుందని కొనియాడారు.

వృద్ధాశ్రమంలో అన్నదానం
నగరంలోని కార్ఖానగడ్డ వృద్ధాశ్రమంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పుట్టిన రోజు సందర్భంగా తెలంగాణ జాగృతి నాయకులు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అంతకు ముందు జాగృతి జిల్లా అధ్యక్షుడు జాడి శ్రీనివాస్‌ కేక్‌ కట్‌ చేసి మాట్లాడారు. జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పుట్టిన రోజు వేడుకలను వృద్ధుల మధ్య నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. జాగృతి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు చేపడుతామని పేర్కొన్నారు. జాగృతి రాష్ట్ర కార్యదర్శి బాలసంకుల అనంతరావు, కో-కన్వీనర్‌ గందె కల్పన మాట్లాడుతూ, ఎమ్మెల్సీ కవిత మార్గదర్శకత్వంలో హరితహారం, సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. కార్యక్రమాల్లో తెలంగాణ జాగృతి యూత్‌ జిల్లా కన్వీనర్‌ ఉయ్యాల విష్ణువర్ధన్‌, ఆరోగ్యవిభాగం జిల్లా కన్వీనర్‌ తిరుపతి, నాయకులు శ్రీరాముల రమేశ్‌, అత్తె రాజారాం, ఎంఏ రజీ, అంకం శివరాణి, ఉయ్యాల విష్ణువర్ధన్‌, మ్యాకల తిరుపతి, గాలిపెల్లి రత్నాకర చారి, అనువోజు రవికాంత్‌, పోలు రాము, గుండేటి తిరుపతి, సంగీత, స్వరూపారాణి, సత్తు సంతోష్‌, అమీర్‌, పసుల పవన్‌, శ్రావన్‌, రమేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

భవన నిర్మాణ కార్మికుల ఆధ్వర్యంలో..
నగరంలోని తెలంగాణ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ సంఘ భవనంలో ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు బొంకురి రాములు కేక్‌ కట్‌ చేసి, స్వీట్లు పంచిపెట్టారు. కార్యక్రమంలో సంఘం సభ్యులు రాజయ్య, నాగభూషన్‌గౌడ్‌, లక్ష్మణ్‌, చంద్రయ్య పాల్గొన్నారు.

ఎమ్మెల్సీని కలిసిన సమ్మిరెడ్డి
హుజూరాబాద్‌టౌన్‌, మార్చి13: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను హైదరాబాద్‌లోని ఆమె నివాసంలో టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు తుమ్మేటి సమ్మిరెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్ఛం అందజేసి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
తెలంగాణ సంస్కృతి పరిరక్షణకు కృషి

ట్రెండింగ్‌

Advertisement