e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, June 23, 2021
Home జిల్లాలు జనజీవన స్రవంతిలో కలవండి

జనజీవన స్రవంతిలో కలవండి

జనజీవన స్రవంతిలో కలవండి

మావోయిస్టులపై పోలీసుల వాల్‌పోస్టర్‌
శ్రీరాంపూర్‌లో అంటించిన సిబ్బంది

శ్రీరాంపూర్‌, మే 1 : ‘మావోయిస్టులు సాధించింది శూన్యం.. సాధించబోయేది శూ న్యం.., లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలవండి-అభివృద్ధికి తోడ్పడండి..’ అని కోరుతూ వాల్‌పోస్టర్లను శనివారం పోలీసు లు అంటించారు. రామగుండం సీపీ సత్యనారాయణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ వాల్‌పోస్టర్లను సీఐ కోటేశ్వర్‌ ఆదేశాలతో శ్రీరాంపూర్‌ ఎస్‌ఐ మంగీలాల్‌, ఏఎస్‌ఐ అంజయ్య విడుదల చేశారు. ఈ సందర్భం గా శ్రీరాంపూర్‌ ఏరియాలోని బస్టాండ్‌, కాలనీల్లో గోడలకు అంటించి, ప్రచారం చేశారు. ఈ పోస్టర్లలో మావోయిస్టులు కట్కం సుదర్శన్‌ అలియాస్‌ ఆనంద్‌, బండి ప్రకాశ్‌ అలియాస్‌ ప్రభాకర్‌, బండి రాధ, కాసరబోయి న రవి అలియాస్‌ విజయ్‌, సళకల సరోజ అలియాస్‌ లత, అత్రం లచ్చన్న అలియాస్‌ గోపన్న, జాడి వెంకటేశ్‌ అలియాస్‌ సురేశ్‌, బబ్బెర రవిబాబు అలియాస్‌ రవి, ఆరెపెల్లి కృష్ణ అలియాస్‌ కిట్టు, జాడి పష్ప అలియాస్‌ బాలమ్మ చిత్ర పటాలున్నాయి. ఈ సందర్భంగా ఎస్‌ఐ మంగీలాల్‌ మాట్లాడుతూ అడవుల బాట పట్టి మావోయిస్టులు ఇప్పటివరకు సాధించిందేమీ లేదన్నారు. వెంటనే లొంగిపోయి ప్రభుత్వం ఇస్తున్న రివార్డులను అందుకోవాలని సూచించారు. ప్రభు త్వం కల్పిస్తున్న పునరావాస సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఎవరికైనా మావోయిస్టుల సమాచారం తెలిస్తే రామగుండం సీపీ 08728-271333, రామగుండం ఓఎస్డీ 94906 17655, మంచిర్యాల డీసీపీ 94407 95003 నంబర్లకు సమాచారం ఇవ్వాలని కోరారు. హెడ్‌ కానిస్టేబుళ్లు ఆకుల సత్తయ్య, రమేశ్‌, సంగ సత్తయ్య సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
జనజీవన స్రవంతిలో కలవండి

ట్రెండింగ్‌

Advertisement