e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, July 30, 2021
Home జిల్లాలు ఖనిజ గని నల్లమల

ఖనిజ గని నల్లమల

ఖనిజ గని నల్లమల

కొల్లాపూర్‌, మార్చి 18 : నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌, అచ్చంపేట సరిహద్దులో ఉన్న నల్లమల అటవీ ప్రాంతంలో అపారమైన ఖనిజ నిక్షేపాలున్న ట్లు గనుల శాఖ నిర్ధారించింది. ప్రభుత్వమే గ్రానైట్‌ నిక్షేపాల తవ్వకాలు జరిపి ఎగుమతులు చేస్తే స ర్కార్‌ ఖజానాకు రూ.వేలల్లో ఆదాయం సమకూరనున్నుట్లు విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నా రు. ఇక్కడ లభించే ఖనిజ నిక్షేపాల ఆధారంగా వివి ధ రకాల పరిశ్రమలను నెలకొల్పితే ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని నిరుద్యోగులు పేర్కొంటున్నారు. కొల్లాపూర్‌ ప్రాంతంలో పలు బడా కంపెనీల ప్రతినిధులు తవ్వకాలు జరిపి.. వివిధ కారణాలతో అర్థాంతరంగా నిలిపేశారు. కాగా, ఆయా తవ్వకాల్లో లభించిన నాణ్యమైన క్వార్జ్‌ను గ్రేడింగ్‌ చేసి అదే ప్రదేశాల్లో భారీ ఎత్తున నిల్వచేసి ఉంచారు.
[ 2012లో కొల్లాపూర్‌ ఫారెస్ట్‌ రేంజ్‌ పరిధిలోని సోమశిల కొండల మధ్య సుమారు 11 ఎకరాల మసీదు ఇనాం భూములను మెదక్‌ జిల్లాకు చెందిన సురభి గ్రానైట్‌ కంపెనీ అప్పటి ప్రభుత్వం తో తక్కువ ధరకు 25 ఏండ్ల లీజుకు తీసుకున్నది. అయితే నిర్దేశించిన ప్రదేశం అటవీ ప్రాంతంలో కొండల మధ్య ఉండడంతో సంబంధిత అధికారు లు హైకోర్టును ఆశ్రయించి తవ్వకాలను నిలిపేశారు. అప్పటికే ఐదు నెలలపాటు జరిపిన తవ్వకాల్లో ల భించిన వేల టన్నుల నల్లరాతి నిక్షేపాలను అక్కడే వదిలేశారు. ప్రపంచంలోనే ఎంతో డిమాండ్‌ ఉన్న బ్లాక్‌ గ్రానైట్‌ ప్రస్తుతం అదే క్వారీ ఒడ్డున నిరుపయోగంగా పడి ఉన్నది.
[ 2012లో కొల్లాపూర్‌ మండలం రామాపూ ర్‌ శివారులో (సోమశిలకు వెళ్లే రోడ్డుకు కుడివైపున) ఓ రైతు నుంచి ఎకరాకు రూ.8 వేల చొప్పున మూ డెకరాలను హైదరాబాద్‌కు చెందిన ఓ బడా గ్రానైట్‌ వ్యాపారి కొనుగోలు చేసి తవ్వకాలు చేపట్టారు. వం దల టన్నుల మేర వెలికితీసిన వైట్‌ క్వార్జ్‌ నిక్షేపాల ను గ్రేడింగ్‌ చేసి అక్కడే ఉంచారు. అప్పట్లో డిమాం డ్‌ లేని కారణంగా ఎగుమతులు జరగలేదు.
[ 2015లో కొల్లాపూర్‌ మండలం చింతలప ల్లి గ్రామంలో విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ వద్ద రాళ్లు, రప్పల తో ఉన్న ఏడెకరాలను అదే గ్రామానికి చెందిన ఆరుగురు దళితుల కు ప్రభుత్వం అసైన్డ్‌ పట్టాలిచ్చింది. అదే గ్రామానికి చెందిన రాజకీయ నాయకుడి జోక్యంతో హైదరాబాద్‌కు చెందిన ఓ గ్రానై ట్‌ వ్యాపారికి ఎకరాకు రూ.5 వేల చొప్పున కొ నుగోలు చేశారు. ఇందులో ఐదు అడుగుల లోతున తవ్వకాలు జరిపి టన్నుల కొద్ది వైట్‌క్వార్జ్‌ను గుట్టలు గుట్టలుగా పోశారు. మార్కెట్‌లో డిమాండ్‌ లేనందున ఎగుమతి చేయకుండా వదిలేశారు.
[ కొల్లాపూర్‌-పెద్దకొత్తపల్లి మండలాల సరిహద్దులో సింగవట్నం లక్ష్మీదేవమ్మగుట్ట (బొల్లిగట్టు కొండ శిఖరం) సర్వేనంబర్‌ 127లో సుమారు 200 ఎకరాల విస్తీర్ణంలో వైట్‌ క్వార్జ్‌ నిక్షేపాలు ఉన్న ట్లు గనులశాఖ గుర్తించింది. దీనిని బళ్లారిలో గనుల తవ్వకాల్లో కొంత భాగాన్ని సబ్‌ కాంట్రాక్ట్‌ తీసుకు న్న ఓ రాజకీయ నాయకుడు ఇక్కడ కూడా లీజుకు తీసుకుని రెండేండ్ల పాటు (2018, 2019) తవ్వకాలు జరిపారు. తవ్వకాలపై సింగవట్నం గ్రామస్తులు హైకోర్టును ఆశ్రయించడంతో నిలిపేశారు. ఎగుమతికి అవకాశం లేకపోవడంతో టన్నుల కొద్ది నాణ్యమైన వైట్‌ క్వార్జ్‌ నిల్వలు ఉన్నాయి.
[ పాన్‌గల్‌ మండలం తెల్లరాళ్లపల్లి, రేమొద్దుల గ్రామాల శివారులో రైతుల వద్ద నుంచి తక్కువ ధర కు భూములను కొనుగోలు చేసి ప్రభుత్వ నిబంధనల మేరకు నల్లరాతి నిక్షేపాలు వెలికితీశారు. మూ డేండ్ల కిందట రాజస్థాన్‌, ముంబయి వంటి పట్టణాలకు లారీల్లో నిక్షేపాలను తరలించి సొమ్ము చేసుకున్నారు. ఈ రెండు చోట్ల ఎలాంటి స మస్యలు తలెత్తకుండా ఉండడంతో రూ. కోట్లలో లబ్ధి పొందారు.
[ పెంట్లవెల్లి, చిన్నంబా వి,
వీపనగండ్ల మండలాల్లోని నల్లరేగడి భూమి అంతర్భాగంలో అగ్గిపుల్లలు, అగర్‌బత్తుల తయారీకి వా డే పొలికే, వెదురు కలప, సిమెంట్‌ పరిశ్రమకు కావల్సిన సున్నపురాయి, నాపరాయి నిక్షిప్తమై ఉన్నా యి. ఇండ్ల గోడల నిర్మాణానికి వినియోగించే నాపరాయి (మొరటు రాయి), నేలపై వేసుకునే పరుపుబండల గనులు అనేకంగా ఉన్నాయి. నాపరాయి, నేల బండలు కావల్సిన ఆకారంలో మలిచి లారీల్లో హైదరాబాద్‌కు తరలిస్తుంటారు. తాండూర్‌ బండలకు దీటుగా కొల్లాపూర్‌ నాపరాయి పెట్టింది పేరు.
[ యాసంగి సాగు ముగిశాక నాపరాయి బం డల తవ్వకాల పనులు మొదలై తొలకరి వర్షాలతో ముగింపు పలుకుతారు. అయితే రాయలసీమ-తెలంగాణ (కొల్లాపూర్‌ నియోజకవర్గం కృష్ణానది తీ రం వెంట) సరిహద్దు మీదుగా అత్యంత విలువైన ఖనిజాలు నిక్షిప్తమై ఉన్నట్లు గతంలో రహస్యంగా డీబీర్స్‌ సంస్థ నిర్ధారించినట్లుగా ప్రచారం జరిగింది.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ఖనిజ గని నల్లమల
ఖనిజ గని నల్లమల
ఖనిజ గని నల్లమల

ట్రెండింగ్‌

Advertisement