e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, July 24, 2021
Home జిల్లాలు ఆన్‌లైన్‌లో విద్యుత్‌ సేవలు

ఆన్‌లైన్‌లో విద్యుత్‌ సేవలు

ఆన్‌లైన్‌లో విద్యుత్‌ సేవలు

సిటీబ్యూరో, మార్చి 15 (నమ స్తే తెలంగాణ) : నూతన విద్యుత్‌ కనెక్షన్‌ కావాలన్నా.. పేరు మార్పు చేసుకోవాలన్నా.. లోడ్‌ చేంజ్‌ చేసుకోవాలన్నా.. ఆన్‌లైన్‌లో విద్యుత్‌ సేవలను పొందేలా దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ శ్రీకారం చుట్టింది. విద్యుత్‌ వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటున్నది. ఇప్పటి వరకు విద్యుత్‌ సంస్థలో ఎలాంటి సేవకైనా ఆయా సెక్షన్‌ల పరిధిలోని వినియోగదారుల సేవా కేంద్రానికి ప్రత్యక్షంగా వెళ్లి దరఖాస్తు చేయాల్సి ఉండేది. సమయాన్ని కేటాయించి.. అక్కడికి వెళ్లినా పనులు వెంటనే పూర్తయ్యేవి కావు. మళ్లీమళ్లీ వినియోగదారుల సేవా కేంద్రాలకు వెళ్లాల్సి వచ్చేది. వీటన్నింటినీ గుర్తించిన దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ ఆన్‌లైన్‌లోనే సేవలందించేందుకు అప్లికేషన్‌ను రూపొందించింది. ఇప్పటికే ఈ సేవలను ప్రయోగాత్మకంగా అందిస్తున్నారు. ఏప్రిల్‌ నుంచి పూర్తి స్థాయిలో ఆన్‌లైన్‌ విధానం అమలు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసే సమయంలో వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా సులభంగా సేవలను పొందేలా వెబ్‌సైట్‌లో అప్లికేషన్‌ను అందుబాటులో ఉంచారు.
ఆన్‌లైన్‌ సేవలకు కొత్త లింక్‌..
గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధికి సంబంధించి విద్యుత్‌ సేవలను పొందేందుకు దక్షిణ తెలంగాణ విద్యుత్‌పంపిణీ సంస్థకు చెందిన www.tssouthernpower.comలో అందుబాటులో ఉంచారు. ఇందులో రకరకాల సమాచారంతో పాటు పే యువర్‌ బిల్‌, ఎలక్ట్రిసిటీ బిల్లింగ్‌, ఆన్‌లైన్‌ న్యూకనెక్షన్‌ అండ్‌ కంప్లెయింట్‌ రిజిస్ట్రేషన్‌ పేరుతో ప్రత్యేక లింకులను ఏర్పాటు చేశారు. ఇందులో ఆన్‌లైన్‌ న్యూ కనెక్షన్‌ అండ్‌ కంప్లెయింట్‌ రిజిస్ట్రేషన్‌ లింక్‌పై క్లిక్‌ చేయగానే కస్టమర్‌ సర్వీస్‌ సెంటర్‌ (సీఎస్‌సీ) పేరుతో ప్రత్యేకంగా పేజీ వస్తుంది. ఇందులో న్యూ సర్వీస్‌ కనెక్షన్‌, అపార్ట్‌మెంట్‌ కనెక్షన్‌, లేఅవుట్‌, కంప్లెయింట్‌ రిజిస్ట్రేషన్‌, అడిషనల్‌ లోడ్‌ వంటి సేవలను ఆన్‌లైన్‌లో పొందేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. అవసరమైన సర్వీసును ఎంపిక చేసుకొని మొబైల్‌ నంబర్‌, ఈ మెయిల్‌ ఐడీ ఎంటర్‌ చేయగానే మొబైల్‌ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. అది ఎంటర్‌ చేయగానే సేవలకు సంబంధించిన సమాచారాన్ని అందించేందుకు దరఖాస్తు ఫారం డిజిటల్‌ ఫార్మాట్‌లో ఓపెన్‌ అవుతుంది. అందులో అడిగిన సమాచారాన్ని నింపాలి. సమాచారం ఎంట్రీ చేయడం పూర్తయిన తర్వాత ఫీజుల చెల్లింపునకు సంబంధించిన పేజీ వస్తుంది. ఫీజులను సైతం ఆన్‌లైన్‌లోనే చెల్లిస్తే సరి.
మొబైల్‌ యాప్‌ ద్వారా సేవలు..
దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థకు చెందిన మొబైల్‌ యాప్‌ గూగుల్‌ ప్లే స్టోర్‌, యాప్‌ స్టోర్‌లో టీఎస్‌ఎస్‌పీడీసీఎల్‌ పేరుతో ఉంటుంది. ఇప్పటికే వాడుకలో ఉన్న సంస్థకు చెందిన మొబైల్‌ యాప్‌ ద్వారా ఆన్‌లైన్‌ సేవలను పొందొచ్చని విద్యుత్‌ శాఖ అధికారులు తెలిపారు. మున్ముందు వినియోగదారులకు అవసరమైన మరిన్ని సేవలను ఆన్‌లైన్‌లోకి తీసుకువస్తామని, ఎలాంటి ఇబ్బందులు లేకుండా సులభంగా, వేగంగా సేవలు పొందేలా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ఆన్‌లైన్‌లో విద్యుత్‌ సేవలు
ఆన్‌లైన్‌లో విద్యుత్‌ సేవలు
ఆన్‌లైన్‌లో విద్యుత్‌ సేవలు

ట్రెండింగ్‌

Advertisement