e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, June 20, 2021
Home జిల్లాలు అవుతాపురం ఆహ్లదకరం

అవుతాపురం ఆహ్లదకరం

అవుతాపురం ఆహ్లదకరం

పెద్దవంగర, మార్చి 15 : రాష్ట్ర ప్రభుత్వ సహకారం.. గ్రామ పాలకవర్గం, అధికారయంత్రాంగం సమన్వ యం, సమృషి కృషితో మహబూబాబాద్‌ జిల్లా పెద్దవంగర మండలంలోని అవుతాపురం ప్రగతిలో పరుగులు పెడుతున్నది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక పల్లెల సమగ్రాభివృద్ధి కోసం ప్రభుత్వం ఇబ్బడిముబ్బడిగా నిధులు ఇస్తుండడంతో గ్రామం సరికొత్త రూపు సంతరించుకుంది. ముఖ్యంగా పల్లె ప్రగతిలో రూ.1.42కోట్లతో చేపట్టిన అనేక కార్యక్రమాలు సత్ఫలితాలనిస్తున్నాయి. సీసీరోడ్లు, అంతర్గత మట్టిరోడ్లు, డ్రైనేజీ పైపులైన్లు, పాత బావులు, శిథిలమైన ఇండ్ల కూల్చివేతతో పాటు తీరొక్క మొక్కలతో ప్రకృతి వనం, కోతుల ఆహారం కోసం మంకీఫుడ్‌ కోర్టు, నర్సరీ, చెత్త వేసేందుకు డంపింగ్‌ యార్డు, ఎరువు కోసం కంపోస్ట్‌ షెడ్‌, చెత్త సేకరణ కోసం కొత్తగా ట్రాక్టర్‌, ట్రాలీ, నీళ్లు పట్టేందుకు ట్యాంకర్‌, చివరి మజిలీ చింత తీర్చే వైకుంఠధామం ఇలా సకల సదుపాయాలు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి.

మార్పు తెచ్చిన పల్లె ప్రగతి
గ్రామంలో పల్లె ప్రగతి పక్కాగా అమలుకావడంతో అనేక మార్పులు వచ్చాయి. పాలనలో చిత్తశుద్ధి, ఓర్పు, సక్రమంగా నిధులను వినియోగించడంతో ప్రజల అవసరాలు తీరేలా సదుపాయాలు సమకూరాయి. ఊరిలో సీసీ రోడ్ల నిర్మాణానికి రూ.55లక్షలు, అంతర్గత మట్టి రోడ్ల కోసం రూ.5లక్షలు, పారిశుధ్యం పైపులైన్లకు రూ.5లక్షలు, శ్మశానవాటికకు రూ.9.60లక్షలు, నర్సరీకి రూ.3లక్షలు, కంపోస్ట్ట్‌ షెడ్‌ కోసం రూ.2.55లక్షలు, డంపింగ్‌యార్డుకు రూ.60వేలు, రూ.6.50లక్షలతో పల్లె ప్రకృతి వనం, కోతుల ఆహారశాల నిర్మాణానికి రూ.2 లక్షలు, గ్రామ పంచాయతీ కొత్త భవన నిర్మాణానికి రూ.20లక్షలు, రైతు వేదికకు రూ.22 లక్షలు, 17బావుల పూడ్చివేతకు రూ.2లక్షలు పంచాయతీకి ట్రాక్టర్‌, ట్రాలీ, వాటర్‌ ట్యాంకర్‌కు రూ.9.20లక్షలు వెచ్చించారు. గ్రామ సమీపంలో ఎకరం స్థలంలో పల్లె ప్రకృతి వనాన్ని తీర్చిదిద్ది వాకింగ్‌ ట్రాక్‌ నిర్మించారు. మంకీ ఫుడ్‌ కోర్టు కోసం ఎకరం పది గుంటల స్థలంలో పండ్ల మొక్కలు పెంచుతున్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
అవుతాపురం ఆహ్లదకరం

ట్రెండింగ్‌

Advertisement