e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, September 28, 2021
Home జిల్లాలు గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం

గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం

  • ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి

బీబీనగర్‌, సెప్టెంబర్‌ 15 : గ్రామాల్లో అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం అనేక నిధులు విడుదల చేసి అభివృద్ధి చేస్తున్నదని యాదాద్రి భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి అన్నారు. బుధవారం బీబీనగర్‌ మండలంలోని మగ్దుంపల్లి, గొల్లగూడెం గ్రామాల మధ్య రూ.65 లక్షల ఆర్‌అండ్‌బీ నిధులతో చేపట్టిన 300 మీటర్ల సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేసి మాట్లాడారు. ప్రజలకు మౌలిక వసతులు కల్పించేందుకు సర్కారు అన్ని విధాలా సహకరిస్తుందన్నారు. రెండు గ్రామాల మధ్య రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించినందుకు ఎమ్మెల్యేకు స్థానిక ప్రజలు కృతజ్ఙతలు తెలిపారు. అనంతరం ఇటీవల మగ్దుంపల్లిలో అనారోగ్యంతో మృతిచెందిన ఆరుగురి కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే శేఖర్‌రెడ్డి పైళ్ల ఫౌండేషన్‌ ద్వారా ఒక్కో కుటుంబానికి రూ.5000 చొప్పున ఆర్థిక సాయం అందించారు. అలాగే బీబీనగర్‌ మండల కేంద్రంలోని వివిధ వార్డుల్లో టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు గోలి పింగళ్‌రెడ్డితో కలిసి హెచ్‌ఎండీఏ నిధులతో నిర్మించిన సీసీ రోడ్డు, అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ పనులను పరిశీలించారు. కార్యక్రమంలో ఎంపీపీ సుధాకర్‌, రైతు బంధు సమితి మండల కోఆర్డినేటర్‌ బొక్క జైపాల్‌రెడ్డి, పీఏసీఎస్‌ చైర్మన్‌ మెట్టు శ్రీనివాస్‌రెడ్డి, భువనగిరి మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ ఆల్వ మోహన్‌రెడ్డి, వైస్‌ ఎంపీపీ వాకిటి గణేశ్‌రెడ్డి, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు మంచాల రవి కుమార్‌, సర్పంచులు మల్లగారి భాగ్యలక్ష్మీశ్రీనివాస్‌, గుండబోయిన రమేశ్‌యాదవ్‌, పిష్క లక్ష్మి, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు రాచమల్ల శ్రీనివాస్‌, కార్యదర్శి చింతల సుదర్శన్‌ రెడ్డి, ఎంపీటీసీ గోరుకంటి బాలచందర్‌, నాయకులు ఎండీ అక్బర్‌, గోలి సంతోష్‌రెడ్డి, ఎర్ర శేఖర్‌రెడ్డి, ఎలుగల నరేందర్‌, జనార్దన్‌ పాల్గొన్నారు.

వర్కట్‌పల్లి గ్రామాభివృద్ధికి కృషి

- Advertisement -

వలిగొండ, సెప్టెంబర్‌15: మండలంలోని వర్కట్‌పల్లి గ్రామాభివృద్ధికి కృషి చేస్తానన్ని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి హామీనిచ్చారని గ్రామ సర్పంచ్‌ మీసాల శేఖర్‌ తెలిపారు. ఇటీవల ఎన్నికైన టీఆర్‌ఎస్‌ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో హైదారాబాద్‌లోని క్యాంపు కార్యాలయంలో బుధవారం ఎమ్మెల్యేను మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో ఎమ్మెల్యే మాట్లాడారు. జిల్లాలోని అన్ని గ్రామాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అందించే రూ.25 లక్షలతోపాటు తన ఎమ్మెల్యే కోటా నుంచి 25 లక్షలు ఇచ్చి సీసీ రోడ్లు, మౌలిక సౌకర్యాల కల్పిస్తానని అన్నారు. త్వరలో వర్కట్‌పల్లి -నేలపట్ల రోడ్డు పునర్నిర్మాణ పనులు పూర్తి చేసి ప్రారంభిస్తానని తెలిపారు. గ్రామ ఉప సర్పంచ్‌ సోలిపురం అరవింద్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ గ్రామశాఖ అధ్యక్షుడు గుండు స్వామి, మాజీ సర్పంచ్‌ నాగేలి నర్సింహస్వామి, యూత్‌ అధ్యక్షులు మీసాల స్వామి, మీసాల యాదయ్య పాల్గొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana