ముస్తాబైన ఆడబిడ్డలు.. ఉయ్యాల పాటలు, చప్పట్ల నృత్యాలు.. వెరసి సద్దుల సంబురం అంబరాన్నంటింది. గురువారం పెద్ద బతుకమ్మ వేడుకల సందర్భంగా ఆడబిడ్డలంతా ఒక్కచోట చేరి ఆట, పాటలతో సందడి చేశారు. అనంతరం సమీప చెరువుల వద్దకు వెళ్లి ‘పోయిరా గౌరమ్మా.. పోయిరావమ్మా.. బంగారు బతుకమ్మా వెళ్లి రావమ్మా’ అంటూ నిమజ్జనం చేసి వాయినాలు ఇచ్చిపుచ్చుకున్నారు. తారాజువ్వల వెలుగులు, పటాకుల చప్పుళ్లతో సద్దుల బతుకమ్మ శోభాయాత్ర ఆద్యంతం
సంబురంగా సాగింది.