e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, June 13, 2021
Home జిల్లాలు ఉగాది బోనాలు

ఉగాది బోనాలు

ఉగాది బోనాలు

మోత్కూరులో వినూత్నంగా పండుగ
మశూచి నిర్మూలనతో ముత్యాలమ్మకు మొక్కులు
ఆనవాయితీగా వస్తున్న ఫలహారబండ్ల ప్రదర్శన
పండుగ రోజే కోళ్లు, మేకల బలి
బెల్లం, పులుపు, పాలు, పెరుగు, నిమ్మ పానకాలతో కావడి స్వాగతం

మోత్కూరు, ఏప్రిల్‌ 12: ఆషాఢం, శ్రావణ మాసాల్లో అమ్మవార్లకు బోనాలు సమర్పించడం అందరికీ తెలిసిందే. వీటితో పాటు వినూత్నంగా చైత్ర శుద్ధ పాడ్యమి రోజున… అంటే ఉగాది రోజున మోత్కూరులో ముత్యాలమ్మకు బోనాలు సమర్పిస్తారు. అంతేకాకుండా కల్లు సాక పెట్టి కోళ్లు, మేకలు బలి ఇస్తారు. ఆలయం చుట్టూ ఫలహారబండ్లను ఊరేగిస్తారు. ఇక్కడి ప్రజలకు మశూచి సోకడంతో గ్రామ దేవతకు మొక్కుకున్నట్లు పెద్దలు చెబుతారు. ఈ సారి కూడా కరోనా తొలగాలని ముత్యాలమ్మకు బోనాలు చేస్తామని మోత్కూరు వాసులు చెబుతున్నారు. ఈ మేరకు మంగళవారం ముత్యాలమ్మ బోనాల పండుగకు సన్నద్ధమవుతున్నారు.

తెలుగు సంవత్సరాది ఉగాది పం డుగను మోత్కూరు ప్రజలు తెలుగు రాష్ర్టాల్లో ఎక్కడా జరుపుకోలేని విధంగా మంగళవారం నిర్వహించుకోనున్నా రు. ఇక్కడి ప్రజలకు మశూచి(అమ్మవారు) సోకడంతో ముత్యాలమ్మలకు మొక్కుకున్నారు. దీంతో అమ్మవార్లు కరుణించి ప్రజల ప్రాణాలను కాపాడారన్న నమ్మకంతో గ్రామస్తులు ప్రతి ఏడాది అమ్మవార్లకు బోనాలు తీసి, కల్లు సాకలు పోసి ఫలహార బండ్లు కట్టి మొక్కులు చెల్లించుకుం టున్నారు. అదే విశ్వాసాన్ని గ్రామస్తులు ఇప్పటికీ అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకొంటున్నారు. మోత్కూరువాసులు శ్రావణ, ఆషాఢమాసాల్లో అమ్మవార్లకు నిర్వహించే బోనాలతోపాటు, ప్రతిఏటా చైత్రశుద్ధ పాడ్యమి ఉగాది రోజున కూడా ముత్యాలమ్మ అమ్మవార్లకు బోనాలు సమర్పించడం విశేషం. అన్ని ప్రాంతాల్లో ప్రజలు షడ్రుచులతో కూడిన ఉగాది పచ్చడిని తీసుకుంటారు.

కానీ మోత్కూరువాసులు ముత్యాలమ్మలకు బోనాలు తీసి నైవేద్యం సమర్పించడం, రైతులు పశువులు, ఫలహార బండ్లను శుభ్రంగా చేసుకొని జాజు, సున్నం, వివిధ రంగులతో అలంకరించి పసుపు, కుంకుమలతో పూజిస్తారు. అనంతరం గ్రామ దేవతల కరుణకోసం పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల, చెరువుకట్ట వద్ద ఉన్న ముత్యాలమ్మ, సుందరయ్యకాలనీలోని ఇందిరపల్లి ముత్యాలమ్మ, కొండాపురంలోని ముత్యాలమ్మ ఆలయాల చుట్టూ ఫలహారబండ్ల తిప్పి, బోనాలు సమర్పించి తమ మొక్కులు చెల్లించుకుంటారు. పూర్వకా లం నుంచి ఇక్కడి ప్రజలు బోనం, బెల్లం, కల్లు సాకలు సమర్పించి, కోళ్లు, మేకలను బలి ఇచ్చి జరుపుకోవడం ఆనవాయితీ. పూర్వం రోజుల్లో గ్రామస్తులకు మశూచి(అమ్మవారు) సోకి అస్వస్థత పాలై మృత్యువాతపడ్డారని, అం దుకు గ్రామ దేవతలైన ముత్యాలమ్మలను మొక్కడంతో మశూచి మాయమైందన్న నమ్మకంతో గ్రామస్తులు ప్రతి యేటా ఉగాది పండుగ రోజున ముత్యాలమ్మలకు బెల్లం, పెరుగు, పాలతో నైవేద్యం వండి బోనం సమర్పిస్తారు. పట్టణ ప్రజలు కుల, మతాలకతీతంగా ప్రతిఏటా నిర్వహిస్తున్నారు. మంగళవా రం ఈ వేడుకను ప్రజలు ఆనందంగా జరుపుకోనున్నారు. సాయంకాల సమయంలో గ్రామ ప్రముఖలతో స్థానిక రా మలింగేశ్వరస్వామి ఆలయంలో పురోహితులు పంచాంగ పఠనం చేస్తారు.

భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలి
భువనగిరిటౌన్‌, ఏప్రిల్‌ 12: పండుగలను భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని కలెక్టర్‌ అనితారామచంద్రన్‌ సోమవారం ఒక ప్రకటనలో కోరారు. నూతన సంవత్సరంలో యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులతో కొవిడ్‌ మహమ్మారి బారి నుంచి బయటపడతామని ఆకాంక్షించారు. ప్లవనామ సం వత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపిన ఆమె పండుగ రోజు ప్రజలందరూ కొ విడ్‌ నిబంధనలు పాటించాలన్నారు. పవిత్ర రంజాన్‌ మాసం ప్రారంభం కా నున్న నేపథ్యంలో ముస్లింలు ప్రార్థనా సమయంలో కరోనా నిబంధనలు పాటించాలన్నారు.

గ్రామస్తులు ఐక్యంగా జరుపుకొంటారు
ఉగాది పండుగ రోజున ముత్యాలమ్మలకు బోనాలు తీసి, ఫలహార బం డ్లు తిప్పడం సంతోషంగా ఉంటుం ది. పూర్వకాలం నుంచి ఇదే విధానా న్ని గ్రామస్తులందరం అనుసరిస్తు న్నాం. అమ్మవార్లు గ్రామస్తుల ప్రా ణాలను కాపాడారు. అందుకోసం ప్రతి ఏడాది ఈ వేడుకను ఉగాది పండుగ రోజున ఘనంగా నిర్వహిస్తున్నాం
-కల్వల ప్రకాశ్‌రాయుడు, గ్రామ పెద్ద మోత్కూరు

ఇవి కూడా చదవండి

యాక్షన్‌ ‘ఖిలాడి’

ఎన్టీఆర్‌ [email protected] కొరటాల శివ

జెమిని రికార్డ్స్‌ ఆరంభం

డబ్బు కోసం చేసిన సినిమా కాదు

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ఉగాది బోనాలు

ట్రెండింగ్‌

Advertisement