e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, June 14, 2021
Home జిల్లాలు టీఆర్‌ఎస్‌తోనే సంక్షేమం

టీఆర్‌ఎస్‌తోనే సంక్షేమం

టీఆర్‌ఎస్‌తోనే  సంక్షేమం

హాలియా, ఏప్రిల్‌ 12 : టీఆర్‌ఎస్‌ సర్కారు పాలనలోనే సంక్షేమ పథకాలు అందుతున్నాయని, గతాన్ని బేరీజు వేసుకొని ఎవరికి ఓటేస్తే మంచి జరుగుతుందో ఆలోచించుకోవాలని ఎక్సైజ్‌ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా టీఆర్‌ఎస్‌ అభ్యర్థి నోముల భగత్‌, మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌తో కలిసి సోమవారం హాలియా మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించారు. చింతగూడెం, రామడుగు, యాచారం, మారేపల్లి, పులిమామిడి, శ్రీనాథపురం గ్రామాల్లో మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ మాట్లాడుతూ మీరేసే ఓటు మీ తలరాతలను మారుస్తుందని, ఓటు అనే ఆయుధంతో టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి నోముల భగత్‌ను గెలిపించి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవాలని అన్నారు. తెలంగాణ రాష్ట్రం రాక ముందు మన బతుకులు ఎట్లా ఉన్నాయో ఇప్పుడెలా ఉన్నాయో ప్రజలు ఆలోచించుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.కాంగ్రెస్‌ పాలనలో రూ.200పింఛన్‌ ఇస్తే ఇపుడు 2016రూపాయలు అందుతున్నాయని తెలిపారు. కల్యాణ లక్ష్మి, రైతుబంధు పథకం ద్వారా ఎంతో మందికి మేలు జరుగుతుందన్నారు.

విద్య, వైద్య రంగాల్లో పెనుమార్పులు వచ్చాయని, కార్పొరేట్‌కు దీటుగా దవాఖానలు, గురుకులాలు ఏర్పాటు చేశారని తెలిపారు. నోముల భగత్‌ గెలిస్తే మరింత అభివృద్ధి చేసుకోవచ్చని తెలిపారు.
రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్‌ మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రైతు సంక్షేమానికి రైతుబంధు, రైతు బీమా, నిరంతర విద్యుత్‌ అందిస్తున్నదని, ఆడబిడ్డల కష్టాలు తీర్చేందుకు మిషన్‌ భగీరథ ద్వారా ఇంటింటికీ తాగునీరు అందిస్తున్నని చెప్పారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి భగత్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి మాట్లాడుతూ గత ఏడేండ్ల టీఆర్‌ఎస్‌ పాలనలో నియోజకవర్గానికి 12విద్యుత్‌ సబ్‌స్టేషన్లు మంజూరు చేయడంతో పాటు హాలియాలో డిగ్రీ కళాశాలకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. హాలియా, నందికొండను మున్సిపాలిటీగా అభివృద్ధి చేస్తున్న టీఆర్‌ఎస్‌ను గెలిపించాలని పిలుపునిచ్చారు. మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి కుమారుడు అమిత్‌రెడ్డి మాట్లాడుతూ సంక్షేమ పథకాల లబ్ధిదారులంతా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి అండగా ఉండాలని కోరారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
టీఆర్‌ఎస్‌తోనే  సంక్షేమం

ట్రెండింగ్‌

Advertisement