e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, April 16, 2021
Advertisement
Home జిల్లాలు సరిగ్గా ఏడేండ్లు

సరిగ్గా ఏడేండ్లు

సరిగ్గా ఏడేండ్లు

ఆలేరు ఎన్‌కౌంటర్‌కు ఆరు సంవత్సరాలు పూర్తి
ఆ ఘటనతో ఉలిక్కిపడ్డ ప్రజలు
కరుడుగట్టిన ఉగ్రవాది వికారుద్దీన్‌తో పాటు అనుచరగణం హతం

ఆలేరు టౌన్‌, ఏప్రిల్‌ 6 : ఆలేరు శివారులో జరిగిన ఉగ్రవాది వికారుద్దీన్‌ ఎన్‌కౌంటర్‌కు బుధవారంతో ఆరేండ్లు పూర్తయ్యాయి. 2015 ఏప్రిల్‌ 7న జరిగిన ఘటనతో ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. ఒకప్పుడు ఆలేరు అంటే మావోయిస్టుల ప్రాబల్యం ఉన్న ప్రాంతంగా గుర్తింపు ఉండేది. ఉగ్రవాదుల ముఠాను కోర్టులో హాజరు పర్చేందుకు వరంగల్‌ జైలు నుంచి తీసుకువెళ్తుండగా మూత్ర విసర్జన కోసం ఆలేరు శివారులో దిగారు. పోలీసుల చేతుల్లోని ఆయుధాలను వికారుద్దీన్‌తో పాటు అతని అనుచరులు లాక్కునేందుకు ప్రయత్నించారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఎదురుకాల్పులు జరిపారు. ఈ దాడిలో ఉగ్రవాదుల ముఠా అంతమైంది.

ఆలేరు శివారులో జరిగిన ఉగ్రవాది వికారుద్దీన్‌ ఎన్‌కౌంటర్‌కు నేటితో ఏడేండ్లు పూర్తయ్యాయి. 2015 ఏప్రిల్‌ 7న జరిగిన ఘటనతో ప్రజలు ఒక్కసారిగా ఉలి క్కి పడ్డారు. ఉగ్రవాదుల ముఠాను కోర్టులో హాజరు పరిచేం దుకు వరంగల్‌ జైలు నుంచి తీసుకెళుతుండగా మూత్ర విసర్జన కోసం ఆలేరు శివారులో దిగారు. పోలీసుల చేతుల్లో ఉన్న ఆ యుధాలను వికారుద్దీన్‌తో పాటు అతని అనుచరులు లాక్కు నేందుకు ప్రయత్నించారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఎదురుకాల్పులు జరిపగా దాడిలో ఉగ్రవాదుల ముఠా అంత మైంది. ఘటన అనంతరం వికారుద్దీన్‌ తండ్రి తన కొడుకును కావాలనే పోలీసులు కాల్చి చంపారని ఆరోపించారు.

కోర్టులో హాజరు పరిచేందుకు తీసుకెళుతుండగా
వరంగల్‌ జిల్లా కేంద్ర కారాగారంలో జైలు శిక్ష అనుభవిస్తున్న వికారుద్దీన్‌ అహ్మద్‌, గుజరాత్‌ నుంచి వచ్చి ముషీరాబాద్‌లో స్థిరపడిన యునానీ వైద్యుడు మహ్మద్‌ అనీఫ్‌, మహ్మద్‌ జాకీ ర్‌, సయ్యద్‌ అమ్జల్‌, హిజాంఖాన్‌లను హైదరాబాద్‌ నాంపల్లి కోర్టులో హాజరు పరిచేందుకు ప్రత్యేక వాహనంలో తీసుకెళు తున్నారు. వరంగల్‌ జిల్లా పెంబర్తి దాటిన తరువాత ఆలేరు మండలం టంగుటూరు గ్రామ శివారులోకి ప్రవేశిస్తున్న క్ర మంలో మూత్ర విసర్జన చేస్తామని చెప్పిన ఉగ్రవాదులు పోలీ సుల చేతిలో నుంచి తుపాకులు లాక్కునేందుకు ప్రయత్నిం చారు. దీంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఎదురు కా ల్పులు జరుపగా కాల్పుల్లో వికారుద్దీన్‌ సహా అతడి నలుగురు అనుచరులు చనిపోయారు.

కాల్చి చంపారని ఫిర్యాదు
తన కుమారుడిని పోలీసులే కాల్చి చంపారని, వికారుద్దీన్‌ తం డ్రి ఆలేరు పోలీసు స్టేషన్‌లో 2015 ఏప్రిల్‌ 11న ఫిర్యాదు చే శారు. 13వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం ఐజీ సందీప్‌ శాండిల్యా నేతృత్వంలో సిట్‌ను నియమించింది. మే 7,8 తేదీల్లో ఆలేరు తహసీల్దార్‌ కార్యాలయంలో నల్గొండ ఆర్‌డీవో వెంకటచారి నేతృత్వంలో విచారణ చేపట్టారు. విచారణకు 19 మంది హా జరయ్యారు. జూలై 14,30 తేదీల్లో మరోమారు విచారణ చే పట్టారు. 2015 ఆగస్టు 12న నల్లగొండలో విచారణ జరిపా రు. 20 17 మార్చి 28న అధికారులు సందీప్‌ శాండిల్యా, షానవా జ్‌ హుస్సేన్‌లు ఎన్‌కౌంటర్‌ స్థలాన్ని సందర్శించారు.

6 పేర్లతో వికారుద్దీన్‌ చలామణి
వికారుద్దీన్‌ ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 6 మారు పేర్లతో చలామణి అయ్యేవాడు. పోలీసులు గుర్తించకుండా ఎప్పటిక ప్పుడు వేషధారణ మార్చేవాడు. పూర్తి పేరు వికారుద్దీన్‌ అహ్మ ద్‌ కాగా అమీర్‌రాజా, అలీఖాన్‌, ఫరీద్‌, బాబార్‌, రిజ్వాన్‌, యాసీన్‌ అనే మారు పేర్లతో సంచరించేవాడని పోలీసుల వి చారణలో తేలింది. వికారుద్దీన్‌కు పోలీసులు అంటే ద్వేషం. ఓ పోలీస్‌ కానిస్టేబుల్‌ను, హోంగార్డును హతమార్చాడు. 2009 మే 18న ఫలక్‌నుమా పీఎస్‌ పరిధిలో నాగులబండ వద్ద కాని స్టేబుల్‌ రాజేంద్రప్రసాద్‌, హోంగార్డు బాలస్వామిని కాల్చివే శాడు. ఈ కాల్పుల్లో బాలస్వామి చనిపోగా రాజేంద్ర ప్రసాద్‌ కంటి చూపు దెబ్బతిన్నది. 2010 మే 14న శాలిబండ లో ఏపీ ఎస్పీ కానిస్టేబుల్‌ రమేశ్‌ ఛాతీపై వికారుద్దీన్‌ పిస్టల్‌తో కాల్చాడు. ప్రాణాలను రక్షించుకునేందుకు రమేశ్‌ పరిగెత్తు తుండగా వికారుద్దీన్‌ అనుచరుడు అమ్జద్‌ కాల్చిచంపాడు.

టీజీఐ ఏర్పాటు
తీవ్రవాది వికారుద్దీన్‌ అవివాహితుడు. బీకాం మధ్యలోనే చదువుకు స్వస్తి చెప్పి ఉగ్రవాదం పట్ల ఆకర్షితుడై 2009లో కనిపించకుండా పోయాడు. తెహరిక్‌ గల్బా-ఏ-ఇస్లాం (టీజీ ఐ) అనే సంస్థను స్థాపించాడు. హర్కతుల్‌, సిమీ, లష్కరే తోయిబా సంస్థలతో సంబంధం నెరిపాడు.

చేసిన దోపిడీలు..
వికారుద్దీన్‌ దోపిడీలకు కూడా పాల్పడేవాడు. 2003లో మల క్‌పేటలో ఈ-సేవా కేంద్రం సిబ్బందిని బెదిరించి రూ. 2.68 లక్షలు, అదే సంవత్సరం డిసెంబర్‌ 6న సంతోష్‌నగర్‌ ఈ సేవ లో రూ.1.62 లక్షలు, 2007లో సయ్యద్‌ అమ్జత్‌అలీతో కలిసి బంజారాహిల్స్‌ ఈ-సేవా కేంద్రంలో రూ. 2.4లక్షలు, అదే ఏడాది నవంబర్‌ 21న అమ్జత్‌అలీతో కలిసి సరూర్‌నగర్‌లోని ఈ-సేవా కేంద్రంలో రూ. 3.25లక్షలను దోచుకెళ్లాడు. కాగా ఈ దోపిడీల కోసం ద్విచక్ర వాహనాలను ఎత్తుకెళ్లేవాడు.

Advertisement
సరిగ్గా ఏడేండ్లు

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement