e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, April 14, 2021
Advertisement
Home జిల్లాలు కొనుగోలు కేంద్రాలను వినియోగించుకోవాలి

కొనుగోలు కేంద్రాలను వినియోగించుకోవాలి

కొనుగోలు కేంద్రాలను వినియోగించుకోవాలి

ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్‌
ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

మద్దిరాల/నూతనకల్‌, ఏప్రిల్‌ 6 : రైతులు పండించిన ధాన్యాన్ని విక్రయించుకునేందుకు ఇబ్బందులు పడకూడదనే సీఎం కేసీఆర్‌ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారని, వాటిని వినియోగించుకోవాలని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్‌ అన్నారు. మంగళవారం మద్దిరాల మండలం రెడ్డిగూడెం, నూతనకల్‌ మండల కేంద్రంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి మాట్లాడారు. రైతులు ధాన్యాన్ని తెచ్చే ముందు ఆరబెట్టి తేమ 17 శాతం ఉండేలా చూసుకోవాలని సూచించారు. కొనుగోలు కేంద్రాలకు వచ్చే రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని నిర్వాహకులకు ఆదేశించారు.

కార్యక్రమంలో రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్‌ ఎస్‌ఏ రజాక్‌, జడ్పీటీసీ కన్న సురాంబావీరన్న, వైస్‌ ఎంపీపీ బెజ్జెంకి శ్రీరాంరెడ్డి, సర్పంచ్‌ బర్పటి ఉపేందర్‌, ఎంపీటీసీ నాగెల్లి శ్రీలతాశ్రవణ్‌కుమార్‌, నాయకులు దుగ్యాల రవీందర్‌రావు, గుడ్ల వెంకన్న, ఏడీఏ జగ్గునాయక్‌, ఏఓ వెంకటేశ్వర్లు, ఆకుల ఉప్పలయ్యగౌడ్‌, పాతూరి లింగారెడ్డి పాల్గొన్నారు. నూతనకల్‌లో ఎంపీపీ భూరెడ్డి కళావతీసంజీవరెడ్డి, జడ్పీటీసీ కందాల దామోదర్‌రెడ్డి, పీఏసీఎస్‌ చైర్మన్‌ కనకటి వెంకన్న, వైస్‌ ఎంపీపీ జక్కి పరమేశ్‌, సర్పంచ్‌ తీగల కరుణశ్రీ, రైతు కోఆర్డినేటర్‌ మోహన్‌రావు, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు మున్న మల్లయ్య, మార్కెట్‌ కమిటీ డైరెక్టర్‌ బిక్కి బుచ్చయ్య తదితరులు పాల్గొన్నారు.

చివ్వెంల: మండల కేంద్రంలో పీఏసీఎస్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం పీఏసీఎస్‌ చైర్మన్‌ మారినేని సుధీర్‌రావు, జడ్పీటీసీ భూక్య సంజీవ్‌నాయక్‌ ప్రారంభించారు. రైతులు ధాన్యాన్ని ఆరబెట్టుకొని కొనుగోలు కేంద్రానికి తీసుకు రావాలని కోరారు. కార్యక్రమంలో తాసీల్దార్‌ రంగారావు, పీఏసీఎస్‌ సీఈఓ శ్యామ్‌సుందర్‌రెడ్డి, రైతుబంధు సమితి మండల కన్వీనర్‌ భూక్య వెంకటేశ్వర్లు, జిల్లా డైరెక్టర్‌ చందుపట్ల పద్మయ్య, మాజీ ఎంపీపీ రౌతు నర్సింహారావు, మండల కోఆప్షన్‌ సభ్యుడు ఎస్‌కే. దస్త్తగిరి పాల్గొన్నారు.


అర్వపల్లి : మండలంలోని కోడూరు గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎంపీపీ మన్నె రేణుక, జడ్పీటీసీ దావుల వీరప్రసాద్‌ యాదవ్‌ ప్రారంభించారు. కార్యక్రమంలో తాసీల్దార్‌ చంద్రశేఖర్‌రెడ్డి, పీఏసీఎస్‌ చైర్మన్‌ కుంట్ల సురేందర్‌రెడ్డి, సర్పంచ్‌ గుయ్యని బాబు, ఎంపీటీసీ గంట సుమలత, ఏఎంసీ డైరెక్టర్లు బందెల అర్వపల్లి, గోసుల విజయ్‌, ఏఈఓ నేరెళ్ల సత్యం, నాయకులు చెంచల శ్రీనివాస్‌, పేర్ల వెంకన్న పాల్గొన్నారు.


తిరుమలగిరి : మండలంలోని బండ్లపల్లి, గుండెపురి గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎంపీపీ స్నేహలత, జడ్పీటీసీ అంజలి ప్రారంభించి మాట్లాడారు. కార్యక్రమంలో ఏపీఎం నర్సయ్య, ఎంపీటీసీ జుమ్మిలాల్‌, దాచపల్లి వెంకన్న, రైతులు పాల్గొన్నారు.
నాగారం : మండలంలోని నాగారం, పస్తాల గ్రామాల్లో ఏర్పాటు చేసిన ఐకేపీ కేంద్రాలను మంగళవారం ఎంపీపీ కూరం మణీవెంకన్న, తిరుమలగిరి మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ గుండగాని అంబయ్యగౌడ్‌తో కలిసి ప్రారంభించారు. కార్యక్రమంలో తాసీల్దార్‌ మోర కమలాద్రి, ఎంపీడీఓ గాలి శోభారాణి, ఏఓ గణేశ్‌, ఏపీఎం నగేశ్‌, యాదగిరి, సాయిరాజ్‌, సర్పంచ్‌ చిప్పలపల్లి స్వప్న, మల్యాల ఈశ్వరమ్మ, ఉప సర్పంచ్‌ చిత్తలూరి రమేశ్‌, కన్నెబోయిన బద్రి, పీఏసీఎస్‌ డైరెక్టర్‌ కోట సోమలింగం, నాయకులు మల్లేశ్‌, సోమయ్య, వెంకటమ్మ, సైదులు, ఉమారాణి, పద్మ పాల్గొన్నారు.

Advertisement
కొనుగోలు కేంద్రాలను వినియోగించుకోవాలి

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement