e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, June 16, 2021
Home జిల్లాలు డి.నాగారం బహు సింగారం

డి.నాగారం బహు సింగారం

డి.నాగారం బహు సింగారం

అభివృద్ధిలో ఆదర్శం ‘దేవలమ్మనాగారం’
పూర్తయిన రైతువేదిక, వైకుంఠధామం, చెత్త డంపింగ్‌ యార్డ్‌, అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ, పల్లె ప్రకృతి వనం
వంద శాతం పరిశుభ్రతను పాటిస్తున్న గ్రామస్తులు
రోడ్డుకు ఇరువైపులా పరుచుకున్న పచ్చదనం
అన్ని వీధుల్లో సీసీ రోడ్ల నిర్మాణం
మొట్టమొదటగా చెత్త సేకరణకు దాతల సహకారంతో ట్రాక్టర్‌ ప్రారంభించింది ఇక్కడే
ఈ ఏడాది జిల్లాలో ఉత్తమ సర్పంచ్‌గా అవార్డుకు ఎంపిక

చౌటుప్పల్‌ రూరల్‌, ఏప్రిల్‌ 3 : ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన పల్లెప్రగతితో గ్రామాల రూపు రేఖలే మారుతున్నాయి. ప్రభుత్వ ప్రోత్సా హాన్ని వినియోగించుకుంటూ చౌటుప్పల్‌ మండల పరిధిలోని దేవలమ్మనాగారం అభివృద్ధిలో పరుగులు పెడుతున్నది. గ్రా మంలో వందశాతం పరిశుభ్రతను పాటిస్తూ ఇంటింటికీ మరుగుదొడ్డి, అన్ని వీధు ల్లో అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ, సీసీ రోడ్లు నిర్మిస్తున్నారు. ఈ ఏడాది జిల్లాలో ఉత్తమ సర్పంచ్‌గా అవార్డు కూడా దక్కడం విశేషం.

చౌటుప్పల్‌ మండల పరిధిలోని దేవలమ్మనాగారం గ్రామపంచాయతీ అభివృద్ధిలో ఆదర్శంగా నిలుస్తున్నది. సీఎం కేసీఆర్‌ ప్రవేశపెట్టిన పల్లెప్రగతి ద్వారా గ్రామం అభివృద్ధిపథంలో పరుగులు పెడుతున్నది. గ్రామంలో వందశాతం పరిశుభ్రతను పాటిస్తున్నారు. ఇంటింటికీ మరుగుదొడ్డి, అన్ని వీధుల్లో అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ, సీసీ రోడ్లు నిర్మిస్తున్నారు. అంతేకాకుండా రోడ్డుకు ఇరువైవులా ట్రీగార్డ్స్‌తో అమర్చిన హరితహారం మొక్కలు, రహదారి వెంబడి విద్యుత్‌ లైట్లు, రైతువేదిక, వైకుంఠధామం నిర్మాణం, పల్లె ప్రకృతి వనం, డంపింగ్‌ యార్డ్‌, అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ నిర్మాణం పూర్తి కాగా, కూరగాయల మార్కెట్‌ నిర్మాణంలో ఉన్నది. ఇంటింటికీ మిషన్‌ భగీరథ నల్లా నీళ్లు అందుతున్నాయి.

వీటికితోడు మొట్టమొదటగా చెత్త సేకరణకు దాతల సహకారంతో ట్రాక్టర్‌ ప్రారంభించింది ఇక్కడే. అంతేకాకుండా మరో ట్రాక్టర్‌ను ప్రభుత్వ నిధులతో కొనుగోలు చేసి నిత్యం హరితహారం మొక్కలకు నీళ్లు సైతం పోస్తున్నారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పసిగట్టడానికి 32 సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేశారు. ఈ ఏడాది జిల్లాలో ఉత్తమ సర్పంచ్‌గా అవార్డు కూడా దక్కింది.రాష్ట్ర ప్రభుత్వ నిధులను సద్వినియోగం చేసుకోవడంలో ఈ గ్రామం ముందంజలో ఉన్నది. రెండేండ్ల నుంచి ప్రభుత్వం నుంచి విడుదలైన సుమారు రూ.72లక్షలతో గ్రామంలో పలు అభివృద్ధి పనులను పక్కా ప్రణాళిక తయారు చేసుకొని చేపట్టారు. పల్లె ప్రగతి కూడా ఈ గ్రామానికి వరంలా మారింది. హరితహారం అమలు పర్చడంలో అగ్రభాగన నిలిచింది. హరితహారంలో భాగంగా 12 వేల మొక్కలను నాటి గ్రామంలో పచ్చదనం వెల్లివిరిసేలా చేసింది. దీంతో గ్రామం రూపురేఖలే మారిపోయాయి.

పచ్చదనం కోసం నర్సరీ సైతం ఏర్పాటు చేశారు.
దేవలమ్మనాగారంలో రూ.22లక్షలతో రైతువేదిక, రూ.10లక్షలతో వైకుంఠధామం, రూ.లక్ష తో పల్లెప్రకృతివనం నిర్మించారు. రూ.2.40లక్షలతో చెత్త డంపింగ్‌ యార్డ్‌, రూ.2లక్షలతో మినీ ట్యాంకులు, రూ.20లక్షలతో మిషన్‌భగీరథ ట్యాంకులు, రూ.25లక్షలతో సీసీరోడ్లు, మరో రూ.20లక్షలతో అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ కూడా ఏర్పాటు చేశారు. ఇప్పటికే పాడుపడిన బావులు, ఇండ్లను, పనికిరాని చెట్లను తొలగించారు. డ్రైనేజీలను పరిశుభ్రంగా ఉంచి బ్లీచింగ్‌ పౌడర్‌ చల్లిస్తుండటంతో వ్యాధులు దూరమవుతున్నాయి.

గ్రామాభివృద్ధికి పాటుపడుతున్నాం
గ్రామాభివృద్ధికి ప్రతినిత్యం పాటుపడుతు న్నాం. అందుకు గాను ఉత్తమ సర్పంచ్‌ అవార్డు వచ్చింది. సీఎం కేసీఆర్‌ చెప్పినట్లు పచ్చదనం, పరిశ్రుభతకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నం. అందరికంటే ముందే దాతల సహకారంతో చెత్త సేకరణకు ట్రాక్టర్‌ కొనుగోలు చేశాం. ప్రతినిత్యం చెత్త సేకరించి డంపింగ్‌ యార్డ్‌కు తరలిస్తున్నాం. సీసీరోడ్లు, అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీలు, పల్లె ప్రకృతివనం, డంపింగ్‌ యార్డ్‌, వైకుంఠధామం, రైతువేదిక భవనాలు ఏర్పాటు చేశాం.ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను అమలు చేస్తున్నాం.

  • కళ్లెం శ్రీనివాస్‌రెడ్డి, సర్పంచ్‌ మా ఊర్లో ఎలాంటి ఇబ్బందులు లేవు
    పల్లెప్రగతిలో చేసిన పనులతో మా ఊర్లో ఎలాంటి ఇబ్బందులు లేవు. ఇప్పటికే రెండు విడుతలుగా చేపట్టిన పల్లెప్రగతిలో అనేక పనులు చేపట్టారు. గ్రామంలో దాదాపుగా సీసీ రోడ్లు, అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీలు పూర్తి చేశారు. వరిధాన్యం కొనుగోలు కేంద్రం కూడా నడుస్తున్నది. పశువైద్యశాల కూడా అందుబాటులో ఉన్నది.
    -ఏనుగు నర్సిరెడ్డి, గ్రామస్తుడు

ఇవికూడా చదవండి..

హైదరాబాద్‌లో ఐపీఎల్‌ మ్యాచ్‌లు!?

టీకా తీసుకున్న త‌ర్వాత శృంగారంలో పాల్గొన‌వ‌చ్చా?

సీసీ కెమెరా నిఘాలోకి రంగనాయక సాగర్‌ ప్రాజెక్టు

రెడ్డిగారింట్లో రౌడీయిజం’ చిత్రంలో సాంగ్ రిలీజ్ చేసిన రామ్ చరణ్

కాంగ్రెస్‌ ఖేల్‌ ఖతం

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
డి.నాగారం బహు సింగారం

ట్రెండింగ్‌

Advertisement