e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, June 23, 2021
Home జిల్లాలు అలుపెరుగని రామన్న

అలుపెరుగని రామన్న

అలుపెరుగని రామన్న

వరంగల్‌లో సుడిగాలిలా మంత్రి కేటీఆర్‌ పర్యటన
ఉదయం 9 నుంచి రాత్రి 9గంటల వరకు బిజీ
12గంటల్లో సుమారు 40కి పైగా కార్యక్రమాలు
క్షణం తీరిక లేకుండా రిబ్బన్‌ కటింగ్‌లు
టూర్‌ సక్సెస్‌తో శ్రేణుల్లో జోష్‌..
వరంగల్‌/హన్మకొండ, ఏప్రిల్‌ 12 : ఓరుగల్లు నగరంలో మంత్రి కేటీఆర్‌ సోమవారం సుడిగాలి పర్యటన చేశారు. అలుపెరుగకుండా సుమారు 40కి పైనే కార్యక్రమాల్లో పాల్గొని క్షణం తీరిక లేకుండా గడిపారు. ఉదయం 9గంటల నుంచి రాత్రి 9గంటల వరకు క్షణం తీరిక లేకుండా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఖిలా వరంగల్‌, న్యూశాయంపేటల్లో నిర్వహించిన బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి ప్రసంగించి..టీఆర్‌ఎస్‌ శ్రేణుల్లో జోష్‌ నింపారు. ముందుగా ఖరారైన దాని కంటే గంట ముందే వరంగల్‌ చేరుకున్న కేటీఆర్‌, నగర ప్రజలకు ఉగాది నుంచి ప్రతిరోజూ నీటి సరఫరా చేస్తామని గతంలో ఇచ్చిన హామీని గడువుకు ఒక రోజు ముందుగానే నెరవేర్చారు. ప్రతిరోజూ నీటిసరఫరా ప్రక్రియను రాంపూర్‌, న్యూ శాయంపేట జంక్షన్లలో నల్లా తిప్పి ప్రారంభించారు. రూ.36 కోట్లతో రాంపూర్‌లో బయోమైనింగ్‌ వ్యవస్థ ఏర్పాటు పనులకు శంకుస్థాపన చేశారు. రూ.35 కోట్లతో పూర్తయిన భద్రకాళి జియో, బయో డైవర్సిటీ పార్కును ప్రారంభించారు.రూ.65 కోట్లతో చేపట్టిన భద్రకాళి ఫోర్‌షోర్‌ బండ్‌ పనులకు శంకుస్థాపన చేశారు.

పద్మాక్షి ఆలయ సమీపంలోని జైన క్షేత్రాలను, సరిగమప పార్కును ప్రారంభించారు. అక్కడే సాంస్కృతిక కేంద్రం (కల్చరల్‌ హబ్‌) పనులకు శంకుస్థాపన చేశారు. ఫాతిమా జంక్ష న్‌ నుంచి పోలీసు హెడ్‌క్వార్టర్స్‌ వరకు పబ్లిక్‌ స్పేస్‌ డెకరేటివ్‌ లై టింగ్‌ వ్యవస్థను ప్రారంభించారు. రెండు చోట్ల ఇంటిగ్రేటెడ్‌ వె జ్‌-నాన్‌వెజ్‌ మార్కెట్ల పనులకు శంకుస్థాపన చేయడంతో పాటు కూరగాయల వ్యాపారులను ఆప్యాయంగా పలకరించారు. మా ర్కెట్లలో కూరగాయలు అమ్మేవారితో కరచాలనం చేసుకుంటూ బాగోగులు తెలుసుకున్నారు. అంతకుముందు గరీబ్‌నగర్‌లో పేదలకు ఇండ్ల స్థలాల పట్టాలు ప్రదానం చేశారు. ఎస్‌ఆర్‌నగర్‌ లో డబుల్‌ బెడ్‌రూం ఇండ్లను పేదలకు అప్పగించారు. చింతగ ట్టు, వంగపహాడ్‌, హసన్‌పర్తి, తిమ్మాపూర్‌, కాజీపేటలో డబుల్‌ బెడ్‌రూం ఇండ్లకు, తూర్పు నియోజకవర్గం దేశాయిపేటలో జర్నలిస్టుల కోసం చేపట్టిన డబుల్‌ బెడ్‌ రూం ఇండ్ల సముదాయానికి, ఎల్బీనగర్‌లో షాదీఖానా, మండిబజార్‌లో హజ్‌హౌస్‌ పనులకు శంకుస్థాపన చేశారు. సాయంత్రం న్యూ శాయంపేట జంక్షన్‌లో బహిరంగ సభ తర్వాత 9గంటల వరకు వివిధ కార్యక్రమాల్లో పాల్గొని హైదరాబాద్‌ తిరుగుపయనమయ్యారు.

ఇవి కూడా చదవండి

కొత్త లంబోర్గిని కారులో ప్ర‌భాస్ సోద‌రి షికారు.. వీడియో వైరల్

మాజీ ఎమ్మెల్యే కుంజా బొజ్జి మృతికి సీఎం సంతాపం

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
అలుపెరుగని రామన్న

ట్రెండింగ్‌

Advertisement