నర్సంపేట రూరల్, ఏప్రిల్ 5 : మత్స్యకారులకు ఫిష్పాండ్ నిర్మాణాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని దాసరిపల్లి సర్పంచ్ పెండ్యా ల శ్రీనివాస్, కమ్మపల్లి ఎంపీటీసీ వల్గుబెల్లి విజయాప్రతాప్రెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని దాసరిపల్లి గ్రామంలో ఫిష్పాండ్ నిర్మాణ పనులను వారు ప్రారంభించి మాట్లాడారు. ఫిష్పాండ్ నిర్మాణాలను మత్స్యకారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. పంచాయతీ కార్యదర్శి షేక్ సుల్తానా, కారోబార్ వల్లాల అంకూస్, టీఏ భద్రు, వెంకటేశ్వర్లు, వార్డు సభ్యులు పాల్గొన్నారు. అలాగే మండలంలోని జీజీఆర్పల్లిలో ఉపాధి కూలీలకు టీఏ ఉపేందర్, పంచాయతీ కార్యదర్శి ఊరటి సుమలత అవగాహన కల్పించారు. ఉపాధి హామీ కూలీలు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
తమిళనాడులో 428 కోట్ల విలువైన నగదు, బంగారం సీజ్
ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి మహిళను అమ్మేసిన దుర్మార్గుడు