e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, June 18, 2021
Home జిల్లాలు గుట్టలపై గూఢచర్యం

గుట్టలపై గూఢచర్యం

గుట్టలపై గూఢచర్యం

వాటిపైనే కోనేర్లు, సమావేశ మందిరాలు
ఇప్పటికీ కనిపిస్తున్న మందుగుండు తయారీ రోళ్లు
రహస్యంగా చేరుకునేందుకు సొరంగమార్గం
రింగున్‌ గుట్టపై నాలుగెకరాల విస్తీర్ణంలో కోట నిర్మాణం
నాలుగు వైపులా రాతి ద్వారాలు, ప్రహరీ
మూడు గుట్టలపైనా చారిత్రక ఆనవాళ్లు
పర్యాటక ప్రాంతంగా మార్చాలని స్థానికుల విన్నపాలు

నర్సింహులపేట, ఏప్రిల్‌ 3: రాజ్యాలను కంటికి రెప్పలా కాపాడుకునేందుకు రాజులు అహర్నిశలూ పాటుపడేవారు. ఇందుకోసం సరిహద్దులు, గుట్టలు, కొండల్లో సైనిక, గూఢచార స్థావరాలు ఏర్పాటు చేసుకున్నారు. కాకతీయుల పాలనలోనూ ఇలాంటి నిర్మాణాలకు కొదువలేదు. వారి కాలంలో నర్సింహులపేట, కురవి తదితర ప్రాంతాలు ప్రధాన సైనిక స్థావరాలుగా ఉండేవని చరిత్ర చెబుతున్నది. ప్రస్తుతం నర్సింహులపేటలో నాలుగు అతిపెద్ద రాతి గుట్టలు ఉండగా ఒకదానిపై వేంకటేశ్వరస్వామి, మరో గుట్టపై లక్ష్మీనర్సింహస్వామి స్వయంభువుగా వెలిశారు. ఈ ఆలయాలకు వందల ఏళ్ల చరిత్ర ఉన్నది. ఈ రెండుగుట్టలను మినహాయిస్తే మరో మూడు అడ్డగుట్టలు, ఒక రింగున్‌ గుట్టపై కాకతీయుల గూఢచార వ్యవస్థ ఉండేదని తెలుస్తున్నది. ఈ గుట్టలపైకి వెళ్లేందుకు సామాన్యంగా ఎవరూ సాహసించరు. స్థానికుల సమాచారంతో ఈ నాలుగు గుట్టలపై ఉన్న చారిత్రక విశేషాలను ‘నమస్తే’ మీకందిస్తున్నది.
రింగున్‌ గుట్టపై కోట
ఇక్కడి రింగున్‌ గుట్టపై నాలుగెకరాల విస్తీర్ణంలో కోట నిర్మాణ ఆనవాళ్లున్నాయి. నాలుగు వైపులా ద్వారాలు, చుట్టూ ప్రహ రీ నిర్మాణం ఉన్నది. రెండు ద్వారాలు పూర్తిగా శిథిలమయ్యాయి. రింగున్‌గుట్టపైనా ఒక కోనేరు ఉంది. శిథిలావస్థలో ఉన్న శివాలయంలో వినాయకుడి విగ్ర హం, శిథిలమైన నంది విగ్రహం, రాతిపై అశోకచక్రం ఇప్పటికీ కనిపిస్తున్నాయి. వీటితో పాటు పెద్ద బావి, దానికి సమీపం లో రాతి స్తంభాలున్నాయి. మొత్తం మీద నర్సింహులపేట గుట్టలపై కాకతీయ రా జులు సేనలను ఉంచి, గూఢచార వ్యవస్థ నడిపేవారని తెలుస్తున్నది. గుట్టల కింది భాగంలో అప్పట్లో పెద్ద గ్రామం ఉండేదని, ఇప్పటికీ రైతులు వ్యవసాయ పను లు చేస్తున్నప్పుడు అప్పుడప్పుడు పెంకు లు, రాతి వస్తువులు బయటపడుతుంటాయని చెబుతున్నారు.
ఈ గుట్టలు చరిత్రకు సాక్ష్యాలు
వేంకటేశ్వర స్వామి, లక్ష్మీనర్సింహస్వామి కొలువైన గుట్టలతో పాటు, పక్కన ఉన్న అడ్డ గుట్టలు కాకతీయుల ఘన చరిత్రకు సాక్ష్యాలుగా ఉన్నాయి. ఒక గుట్టపై లక్ష్మీ నర్సింహస్వామి, ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి, మరో గుట్టపై వేంకటేశ్వరస్వామి అలివేలు మంగ కొలువై ఉన్నారు. ఈ రెండు గుట్టలకు అనుకుని మరో గుట్ట ఉంది. సుమారు 150 ఎకరాల్లో ఇవి విస్తరించి ఉన్నాయి. ఇక్కడి కపిళగిరి గుట్టపై లక్ష్మీనర్సింహస్వామి వెలిసినందునే నర్సింహులపేట అనే పేరు వచ్చిందని స్థానికులు చెబుతున్నారు. వేంకటేశ్వరస్వామికి ఏటా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు.
పర్యాటక కేంద్రంగా గుర్తించాలి
150 ఏకరాల్లో విస్తరించి ఉన్న ఈ గట్టలను కలిపి పర్యాటక కేంద్రంగా ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు. పురాతన విగ్రహాల్లో గుప్త నిధులు దొరుకుతాన్న అశతో కొందరు వాటిని ధ్వంసం చేశారు. సంబంధిత అధికారులు స్పందిం చి ఈ చారిత్రక ప్రదేశాన్ని కాపాడాలని స్థానికులు కోరతున్నారు. దేవస్థానం అభివృద్ధి కోసం డోర్నకల్‌ ఎమ్మెల్యే డీఎస్‌ రెడ్యానాయక్‌ చొరవతో రాష్ట్ర ప్రభు త్వం రూ.2 కోట్లు కేటాయించింది. ఈ నిధులతో భక్తు లు సేదతీరేందుకు, విడిది చేసేందుకు భవనం, షెడ్ల పనులు త్వరలోనే ప్రారం భం కానున్నాయి.

ఇవి కూడా చూడండి..

సాగర్‌ ఉపఎన్నికలో నా ఓటు నోముల భగత్‌కే : రాం గోపాల్‌ వర్మ

ఖ‌మ్మంలో ఐటీ హ‌బ్ -2 నిర్మాణానికి కేటీఆర్ శంకుస్థాప‌న‌

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
గుట్టలపై గూఢచర్యం

ట్రెండింగ్‌

Advertisement