e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, October 21, 2021
Home జిల్లాలు సైనికులకు సలాం

సైనికులకు సలాం

  • కంటికి రెప్పలా కాపాడుతున్న సైనికులు
  • వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
  • 1971 నాటి అమర వీరులను స్మరిస్తూ ‘భారత్‌ అమృత్‌ ఉత్సవ్‌’
  • 500 మంది చిన్నారులతో 450 మీటర్ల జాతీయ జెండాతో స్వాగతం
  • ఖిల్లా గట్టు నుంచి సైకిల్‌ యాత్ర ప్రారంభం

దేశ ప్రజలను రేయింబవళ్లు కంటికి రెప్పలా కాపాడుతున్న సైనికులకు సలాం అంటూ
వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి కొనియాడారు. 1971లో భారత్‌-పాకిస్తాన్‌ మధ్య జరిగిన యుద్ధంలో అమరులైన సైనికులను స్మరించుకుంటూ సికింద్రాబాద్‌ ఆర్మీకి చెందిన కెప్టెన్‌ కల్నల్‌ లక్ష్మణ్‌సింగ్‌ ఆధ్వర్యంలో భారత్‌ అమృత్‌ ఉత్సవ్‌ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఖిల్లా గట్టు నుంచి సైకిల్‌ యాత్రను ప్రారంభించేందుకు సోమవారం సికింద్రాబాద్‌ నుంచి వచ్చిన ఆర్మీ జవాన్లకు ఖిల్లాఘణపురం మండలకేంద్రంలో 450 మీటర్ల పొడవైన జాతీయ జెండాతో చిన్నారులు.. మంత్రి నిరంజన్‌రెడ్డి బైక్‌ ర్యాలీతో ఘన స్వాగతం పలికారు.

  • వనపర్తి, సెప్టెంబర్‌ 20

వనపర్తి, సెప్టెంబర్‌ 20 : దేశ ప్రజలను కంటికి రెప్పలా కాపాడుతున్న సైనికులకు సలాం అని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపారు. 1971లో భారత్‌-పాకిస్తాన్‌ మధ్య 13రోజులపాటు కొనసాగిన యుద్ధంలో.. చరిత్రలోనే అతి తక్కువ రోజుల్లో యుద్ధంలో అమరులైన భారత సైనికులను స్మరించుకుంటూ భారత్‌ అమృత్‌ ఉత్సవ్‌ (స్వర్ణ విజయ్‌ వర్ష విజయ్‌ యా త్ర) కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. యుద్ధం జరిగి 50 ఏండ్లు పూర్తి కావొస్తున్న సందర్భంగా సికింద్రాబాద్‌ ఆర్మీకి చెందిన కెప్టెన్‌ కల్నల్‌ లక్ష్మణ్‌సింగ్‌ ఆధ్వర్యంలో ఉమ్మడి రాష్ట్రవ్యాప్తంగా చా రిత్రాత్మక ప్రదేశాలను సందర్శించేందుకు 1,300 కిలోమీటర్ల మేర సైకిల్‌యాత్రకు పూనుకున్నారు. ఈ క్రమంలో సోమవారం సికింద్రాబాద్‌ నుంచి ప్రత్యేక వాహనాల ద్వారా వనపర్తి జిల్లా ఖిల్లాఘణపురం మండలకేంద్రంలోని ఖిల్లా గట్టుకు వచ్చి అక్కడి నుంచి సైకిల్‌యాత్ర ప్రారంభించారు.

- Advertisement -

జాతీయ పతాకంతో స్వాగతం

ఖిల్లాఘనపురం మండలకేంద్రానికి విచ్చేస్తు న్న ఆర్మీ బృందానికి కొత్తకోటకు చెందిన మహేశ్‌ తయారు చేసిన 450మీటర్ల జాతీయ పతాకంతో 500మంది చిన్నారులు ర్యాలీగా విచ్చేయగా.. మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, డీఎస్పీ కిరణ్‌కుమార్‌, స్థానిక పోలీసులు, నాయకులు బైక్‌ర్యాలీ నిర్వహించి సైనికులకు స్వాగతం పలికారు. అనంతరం మండలకేంద్రంలోని సరోజినీదేవి ఫంక్షన్‌హాల్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో చిన్నారుల నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్‌రెడ్డికి కెప్టెన్‌ కల్నల్‌ జ్ఞ్ఞాపికను అందజేశారు. అనంతరం మంత్రి మా ట్లాడుతూ ప్రతిఒక్కరిలో దేశభక్తి ఉండాలన్నారు. సైనికులను గౌరవించడమంటే దేశాన్ని గౌరవించడమేనని అన్నారు. దేశంలోని 132కోట్ల మంది ప్రజలు నిర్భయంగా జీవిస్తున్నారంటే సైనికులే కారణమని, దేశ సరిహద్దులను కాపాడుతూ 24గంటలు పనిచేస్తూ దేశానికి కాపాడుతున్నారని కొనియాడారు. పొరుగు దేశాలవల్ల మనకు ఎలాంటి హాని కలుగకుండా కంటికి రెప్పలా కా పాడుతున్న సైనికులకు అందరం అండగా నిలుద్దామని పిలుపునిచ్చారు.

ప్రేమ, ఆప్యాయత మరవలేనిది..

దేశ సరిహద్దులో మీ కోసం పనిచేస్తున్న మాపై నేడు చిన్నారులు, ప్రజాప్రతినిధులు, అధికారు లు చూపిన ప్రేమ, ఆప్యాయత కండ్లకు కట్టినట్లు ఉందని కెప్టెన్‌ కల్నల్‌ లక్ష్మణ్‌సింగ్‌ అన్నారు. దేశ రక్షణకు 24గంటలు అవిశ్రాతంగా పని చేయడానికి సిద్ధంగా ఉంటామన్నారు. యుద్ధంలో భారతమాతకు విజయానికి అందించేలా ప్రతిక్షణం పని చేస్తామన్నారు. కార్యక్రమంలో సీఐలు ప్రవీణ్‌కుమార్‌, సీతయ్య, మల్లికార్జున్‌రెడ్డి, డీఈవో ర వీందర్‌, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ లక్ష్మారెడ్డి, ఎం పీపీ కృష్ణానాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

గిడ్డంగులను అందుబాటులోకి తేవాలి

వనపర్తి, సెప్టెంబర్‌ 20 : యాసంగినాటికి గి డ్డంగులను వినియోగంలోకి తేవాలని వ్యవసా య శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. పెద్దమందడి మండలం వీరాయపల్లిలో గిడ్డంగుల పనులను సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 10వేల మెట్రిక్‌టన్నుల ధాన్యం నిల్వ చేసేందుకు రూ.9కోట్లతో గిడ్డంగుల నిర్మాణ పనులు చేపడుతున్నట్లు తెలిపారు. పనులు నాణ్యతగా చేపట్టాలని సూచించారు. అంతకుముందు జిల్లాకేంద్రంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ గట్టుయాదవ్‌ పాల్గొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement