e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, June 14, 2021
Home జిల్లాలు పేట జిల్లాకు రెండు మొబైల్‌ ఫిష్‌ క్యాంటీన్లు

పేట జిల్లాకు రెండు మొబైల్‌ ఫిష్‌ క్యాంటీన్లు

పేట జిల్లాకు రెండు మొబైల్‌ ఫిష్‌ క్యాంటీన్లు

సంచార వాహనాల్లోనే చేపల విక్రయాలు
60 శాతం సబ్సిడీతో మత్స్యకారులకు అందజేత
మక్తల్‌ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి

మక్తల్‌ రూరల్‌, మార్చి 28 : ప్రభుత్వం మహిళా మత్స్యకారుల సంక్షేమం కోసం మొబైల్‌ ఫిష్‌ అవుట్‌లెట్‌ (సంచార చేపల అమ్మకం వాహనాలను) ప్రవేశపెట్టిందని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి అన్నారు. పైలెట్‌ ప్రాజెక్టు కింద నారాయణపేట జిల్లాకు రెండు మొబైల్‌ ఫిష్‌ క్యాంటీన్లు మంజూరైనట్లు తెలిపారు. ఆదివారం మక్తల్‌ పట్టణంలోని తన నివాసంలో మండలంలోని భూత్పూర్‌ బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ మహిళా మత్స్య పారిశ్రామిక సంఘం అధ్యక్షురాలు మణెమ్మ, సభ్యులు హరిత, అనంతమ్మకు ఫిష్‌ అవుట్‌లెట్‌ వాహనా తాళాల ను ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా మా ట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ మత్స్యకారుల అభ్యున్నతికి పెద్దపీట వేశారన్నారు. నియోజకవర్గంలోని సంగంబండ, భూత్పూర్‌ రిజర్వాయర్లలో ఈఏడాది 20 లక్షల చేప పిల్లలను విడుదల చేసి మత్స్యకారులకు ఉపాధి అవకాశాలు కల్పించినట్లు గుర్తు చేశారు. ప్రస్తుతం మహిళా మత్స్యకారులకు ఉపాధి కల్పన కోసం ప్రయోగాత్మకంగా మొబైల్‌ ఫిష్‌ అవుట్‌ లెట్‌ వాహనాలను 60 శాతం సబ్సిడీ ద్వారా సమకూర్చుతున్నట్లు చెప్పారు. మిగితా 40 శాతం నిధులు సొసైటీలు భరించాల్సి ఉంటుందన్నారు. మొదటగా మక్తల్‌ మండలం భూత్పూర్‌, నారాయణపేట మండలం భూనీడు ను పైలట్‌ ప్రాజెక్టుగా ఎంపిక చేశారని తెలిపారు. రాబోయే రోజుల్లో మరిన్ని మంజూరు చేయిస్తామన్నారు. అనంతరం ఎమ్మెల్యే చిట్టెంను సొసైటీ సభ్యులు సన్మానించారు. కార్యక్రమంలో మక్తల్‌, మాగనూరు మండలాధ్యక్షులు మహిపాల్‌రెడ్డి, ఎల్లారెడ్డి, నేరడిగం సర్పంచ్‌ అశోక్‌గౌడ్‌, భూత్పూర్‌ రిజర్వాయర్‌ మత్స్యపారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షుడు ఆనంద్‌శేఖర్‌, కార్యదర్శి అంజయ్య, డైరెక్టర్లు బాలయ్య, సాయిల్‌, బాల్‌రాజ్‌ పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

ఈ ల‌క్షణాలు మీలో ఉంటే.. మీరు ఉప్పు ఎక్కువ‌గా తింటున్నట్లే..!

కొత్తిమీర‌తో జీర్ణ సమస్యలకు చెక్‌..!

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
పేట జిల్లాకు రెండు మొబైల్‌ ఫిష్‌ క్యాంటీన్లు

ట్రెండింగ్‌

Advertisement