ఉమ్మడి జిల్లాలో ‘రంగు’రించిన ఆనందం
నిరాడంబరంగా హోలీ వేడుకలు
రంగుల సింగిడిగా మారిన నేలతల్లి
చిన్నా పెద్ద తేడా లేకుండా సంబురాలు
నమస్తే తెలంగాణ, నెట్వర్క్:ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో యువత హోలీ వేడుకలను ఆదివారం ఉత్సాహంగా జరుపుకొన్నారు. విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో శనివారం రాత్రి కాముడి దహనం చేశారు. ఉదయం ఆయా ప్రాంతాల్లోని ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం చిన్నాపెద్ద తేడా లేకుండా రంగులు చల్లుకుంటూ నృత్యాలు చేశారు. ఒకరికొకరు హోలీ శుభాకాంక్షలు తెలుపుకొన్నారు. పాలమూరు జిల్లా కేంద్రంలోని ఏనుగొండలో వశిష్టాస్ తత్వ గ్రూప్ ఆఫ్ ఈవెంట్ మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో హోలీ వేడుకలు ఘనంగా నిర్వహించారు.
కరోనా కారణంగా రంగుల పండుగకు దూరంగా ఉండాలని ప్రభుత్వ ఆదేశాలమేరకు పూర్తి స్థాయిలో రంగుల పండుగను జరుపుకోలేకపోయారు. అయితే కొందరు యువకులు తమ ఆనందానికి, సంతోషానికి కరోనా కాదు కదా మరేది ఆపాలేదంటూ హోలీ పండుగను జిల్లా వ్యాపంగా ఘనంగా నిర్వహించుకున్నారు. ఆదివారం వసంత ఋతువు ఆగమనాన్ని స్వాగతిస్తూ పిల్లలు, యువకులు, ఆనందోత్సవాల మధ్య రంగులు చల్లుకుంటూ ఉత్సాహంగా హోలీని నిర్వహించుకున్నారు. సోమవారం కూడా పండుగను ఘనంగా నిర్వహించేందుకు యువకులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేపట్టారు.
వేడుకగా కామదహన ఉత్సవాలు
యువకులంతా కాలనీల్లో తిరుగుతూ కట్టెలు, పాత వస్తువులు సేకరించి శనివారం అర్ధరాత్రి వాడవాడలా కామ దహనాన్ని చేశారు. అంతకుముందు కాముడి చిత్రపటాన్ని ఊరేగించారు. కామదహనాన్ని సాంప్రదాయ బద్ధంగా పూజలు నిర్వహించి దహనం చేసి ఉత్సవాలు నిర్వహించారు.
రంగుల్లో మునిగి తేలిన యువత
అయిజ, మార్చి 28 : మున్సిపాలిటీతోపాటు మండలంలోని పలు గ్రామాల్లో ప్రజలు ఆదివారం హోలీ సంబురాల్లో మునిగి తేలారు. ఉదయం నుంచే పిల్లలు, పెద్దలు, మహిళలు అనే బేధం లేకుండా రంగులను చేత బూని మిత్రులు, స్నేహితులతో కలిసి హోలీ సంబురాలు నిర్వహించుకున్నారు. పాఠశాలలు, ఉదయం నుంచే పట్టణంలో ప్రధాన రహదారులపై పిల్లలు, పెద్దలు రంగులు, కోడి గుడ్లు, టమోటోలు ఒకరిపై ఒకరు వేసుకుని హోలీ పండుగను సంతోషంగా జరుపుకొన్నారు. శనివారం రాత్రి కాముని దహనం చేశారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, విద్యార్థు లు, పిల్లలు, పెద్దలు, మహిళలు పాల్గొన్నారు.
ఉల్లాసంగా.. ఉత్సాహంగా
మల్దకల్, మార్చి 28 : మండల కేంద్రంతోపాటు మండలంలోని అన్ని గ్రామాల్లో ఆదివారం హోలీ పండుగను సందర్భంగా చిన్నారులు, యువకులు, పెద్దలు ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా హోలీ వేడుకలను ఘనంగా జరుపుకొన్నారు. మండల కేంద్రంలో ఉదయం నుంచే యువకులు రంగులు చల్లుతూ నృత్యాలు చేస్తూ ఎంతో హుషారుగా గడిపారు. మరికొందరు యువకులు బైక్‌లపై వీధుల్లో తిరుగుతూ రంగులు చల్లుతూ ర్యాలీ నిర్వహించారు.
ధరూర్ మండలంలో..
ధరూర్, మార్చి 28: మండల కేంద్రంతోపాటు మండలంలోని అన్ని గ్రామాల్లో చిన్నా, పెద్ద తేడా లేకుండా అందరూ ఎంతో ఉల్లాసంగా హోలీ వేడుకలను నిర్వహించుకున్నారు. నెట్టెంపాడు, ర్యాలంపాడ్ గ్రామా ల్లో యువకులు విధుల్లో తిరుగుతూ హోలీ సంబురాలు నిర్వహించారు.
ఘనంగా హోలీ సంబురాలు
ఎర్రవల్లిచౌరస్తా, మార్చి 28 : ఇటిక్యాల మండలంలోని ఎర్రవల్లి చౌరస్తా తిమ్మాపూర్, బీచుపల్లి, యాక్తాపురం, కొండపేటగ్రామాలతోపాటు వివిధ గ్రామాల్లో హోలీ సంబురాలు ఘనంగా నిర్వహించారు. ఎర్రవల్లి చౌరస్తాలోని పదో పటాలం సిబ్బంది చిన్నారులు కరోనావైరస్ ప్రభావం కారణంగా సహజ రంగులువాడి హోలీ సంబురాలు నిర్వహించారు. రంగుల పండుగను ప్రజలందరూ సంతోషంగా నిర్వహించుకో వాలని, ప్రజల జీవితాలు రంగులమయం కావాలని పదో పటాలం కమాండెంట్ జమీల్‌పాషా, సంక్షేమఅధికారి రాజేశ్, సర్పంచ్వ్రి అకాంక్షించారు .
కేటీదొడ్డి మండలంలో..
కేటీదొడ్డి, మార్చి 28 : మండలకేంద్రంతోపాటు మండలంలోని అన్ని గ్రామాల్లో ఆదివారం చిన్నారులు, యువకులు, పెద్దలు ఘనంగా హోలీ వేడుకలను జరుపుకొన్నారు. ఈ సందర్భంగా గ్రామాల్లోని వీధుల్లో కేరింతలు కొడుతూ, తిరుగుతూ రంగులు చల్లుతూ ఎంతో ఆనందంతో రంగులతో మునిగితెలారు. కొందరు యువకులు బైకు ర్యాలీలు నిర్వహించారు.
ఇవి కూడా చదవండి
ఆకలి బాగా పెరగాలంటే.. ఇలా చేయాలి..!
చేపలను తరచూ తింటే కలిగే అద్భుత ప్రయోజనాలివే..!