e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, May 12, 2021
Home జిల్లాలు నిర్మించారు.. వినియోగం మరిచారు..

నిర్మించారు.. వినియోగం మరిచారు..

నిర్మించారు.. వినియోగం మరిచారు..

షాపింగ్‌ కాంప్లెక్స్‌ అందుబాటులోకి వచ్చేది ఎప్పుడో?
రూ.15 లక్షలతో జడ్పీ నిధులతో నిర్మాణం
నెలలు గడుస్తున్నా ప్రారంభానికి నోచుకోని దుకాణాలు

పెద్దేముల్‌, మార్చి 28 : జిల్లాలోని అన్ని మండల పరిషత్‌ కార్యాలయాలు అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నాయి. ప్రభుత్వం మండలాలకు ఎక్కువ మొత్తంలో నిధులు మంజూరు చేయగా, మండలాలు, గ్రామాల అభివృద్ధి పనులు పరుగులు తీస్తున్నాయి. ఎన్‌ఆర్‌ఈజీఎస్‌, జడ్పీ నిధులు, డీఎంఎఫ్‌టీ, సీడీపీ, ఎంపీ లాడ్స్‌ నిధులను కేటాయిస్తున్నాయి. పెద్దేముల్‌ మండలానికి వికారాబాద్‌ జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ సునీతా మహేందర్‌రెడ్డి మొత్తం రూ.30 లక్షల జడ్పీ నిధులను మంజూరు చేశారు. నూతనంగా రూ.15 లక్షల జడ్పీ నిధులతో సుమారు 5 షెటర్లతో కూడిన షాపింగ్‌ కాంప్లెక్స్‌ నిర్మాణాన్ని పూర్తి చేశారు. ఈ దుకాణ సముదాయాలను త్వరగా ప్రారంభిస్తే కొంత మందికి ఉపాధి కల్పించినట్లు అవుతుందని పలువురు పేర్కొంటున్నారు.

ఐదు షెటర్లతో దుకాణ సముదాయం
పెద్దేముల్‌ మండల పరిషత్‌ కార్యాలయ ఆవరణలో రూ.15 లక్షల జడ్పీ నిధులతో నూతనంగా షాపింగ్‌ కాంప్లెక్స్‌ నిర్మాణ పనులు ప్రస్తుతం పూర్తయ్యాయి. మొత్తం 5 షెటర్లతో దుకాణా సముదాయాన్ని నిర్మించారు. మండల అధికారులు దుకాణా సముదాయాల కేటాయింపు కోసం పత్రికా ప్రకటనను ఇచ్చి, ఆశావహులకు రిజిస్ట్రేషన్‌ ఫీజు కేటాయించి, తదుపరి టెండర్‌ ప్రకారం కేటాయించాలా? లేక లాటరీ పద్ధతిలో కేటాయించాలా? అనేదానిపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. షాపింగ్‌ కాంప్లెక్స్‌ ప్రస్తుతం నిరుపయోగంగా పడి ఉండడంతో ప్రజలు ఒకింత అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు ఈ దుకాణాలను అందుబాటులోకి తీసుకు వచ్చేలా చర్యలు చేపట్టి ఉపాధి కల్పించే పనిలో చొరవ చూపాలని ప్రజలు కోరుతున్నారు.

త్వరగా అందుబాటులోకి తీసుకురావాలి
మండల పరిషత్‌ కార్యాలయ ఆవరణలో నిర్మించిన 5 షెటర్లతో కూడిన దుకాణ సముదాయాన్ని ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు త్వరగా చొరవ చూపి అందుబాటులోకి తీసుకువచ్చేలా చర్యలు చేపట్టాలి. నిర్మాణం పూర్తై నెలలు గడుస్తున్నా షాపింగ్‌ కాంప్లెక్స్‌ను ఇప్పటివరకు ప్రారంభించలేదు. షాపింగ్‌ కాంప్లెక్స్‌ను వీలైనంత త్వరగా ప్రారంభిస్తే పలువురికి ఉపాధి దొరికే అవకాశం ఉంటుంది.
-ధన్‌సింగ్‌, ఎంపీటీసీల ఫోరం

మండల అధ్యక్షుడు, పెద్దేముల్‌ మండలం
కాంప్లెక్స్‌ను ప్రారంభించేలా చర్యలు చేపడుతాం..
షాపింగ్‌ కాంప్లెక్స్‌ దుకాణ సముదాయాన్ని త్వరలో జిల్లా పరిషత్‌ సీఈవోతో మాట్లాడి అందుబాటులోకి తెచ్చేలా చర్యలు చేపడుతాం. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వారు నిర్దేశించిన నియమ నిబంధనల ప్రకారం వ్యాపారులకు దుకాణ సముదాయ షెటర్లను అప్పగిస్తాం. త్వరలో ఓ స్పష్టమైన నిర్ణయం తీసుకొని ప్రారంభించేలా చర్యలు చేపడుతాం.
-లక్ష్మప్ప, ఎంపీడీవో, పెద్దేముల్‌ మండలం

ఇవి కూడా చదవండి

కుంకుమ పువ్వు గ‌ర్భిణుల‌కేనా?

రోగ నిరోధ‌క శ‌క్తి పెంచే జ్యూస్‌లు ఇవే..

Advertisement
నిర్మించారు.. వినియోగం మరిచారు..
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement