e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, September 28, 2021
Home జిల్లాలు కేంద్రం కంటే రాష్ట్ర నిధులే ఎక్కువ..

కేంద్రం కంటే రాష్ట్ర నిధులే ఎక్కువ..

  • పథకాలపై విస్తృతంగా ప్రచారం చేపట్టాలి
  • వర్షాలతో దెబ్బతిన్న రోడ్లు, బ్రిడ్జిల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేయాలి
  • చేవెళ్ల ఎంపీ డాక్టర్‌ రంజిత్‌రెడ్డి
  • మద్గుల్‌చిట్టెంపల్లిలోని డీపీఆర్‌సీ భవనంలో దిశ సమావేశం

పరిగి, సెప్టెంబర్‌15: వివిధ పథకాలకు కేంద్రం కంటే రాష్ట్రం అధి కంగా నిధులు ఖర్చు చేస్తున్నదని చేవెళ్ల పార్లమెంటు సభ్యులు డాక్టర్‌ రంజిత్‌రెడ్డి పేర్కొన్నారు. పథకాలను సమర్థవంతంగా అమలు చేయాలని ఆయన సూచించారు. బుధవారం మద్గుల్‌ చిట్టెం పల్లిలోని డీపీఆర్‌సీ భవనంలో జరిగిన ‘దిశ’ సమావేశంలో పాల్గొన్న ఎంపీ రంజిత్‌రెడ్డి మాట్లాడుతూ అధికారులు ఎంతో కష్ట పడుతున్నా, ప్రజా ప్రతినిధులు అంతకంటే అధికంగా కష్టపడు తున్నారని చెప్పారు. వివిధ పథకాలను కేంద్రం, రాష్ట్రం వేర్వేరు పేర్లతో అమలు చేస్తున్నా, కేంద్రం కంటే రాష్ట్రమే అధికంగా నిధు లు వెచ్చిస్తున్నదన్నారు. రా ష్ట్రం ద్వారా కేంద్రానికి పన్నుల రూ పంలో రూ.100 వెళ్తే, కేంద్రం తిరిగి రాష్ర్టానికి రూ.41 ఇస్తున్నద న్నారు. జిల్లాలో ఎక్కడెక్కడ వర్షాలతో రోడ్లు దెబ్బతిన్నాయి, బ్రిడ్జి ల నిర్మాణం ఎక్కడెక్కడ జరగాలన్నది ముందస్తుగానే ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. సాంకేతిక పరిజ్ఞానంతో వ్యవసాయ రంగంలో చక్కటి ఫలితాలు సాధించవచ్చని తెలిపారు. టీ హబ్‌లో ఒక కొత్త ఆవిష్కరణ చేపట్టారని, వ్యవసాయంలో ఆయా పంట లకు ఎంత మేరకు నీటి వినియోగం అవసరమనేది నిర్ణయించి వాడకం వల్ల నీరు ఆదా అవుతుందన్నారు. భూసార పరీక్షలు జరిపించిన రైతులకు అవసరమైన సూచనలు, సలహాలు ఇవ్వ డం ద్వారా దిగుబడులు పెంచుకోవచ్చని చెప్పారు. నియోజకవర్గంలో రోడ్లు ప్రతి పాదనలు స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీ సూచించినవే మం జూరయ్యేలా ముందస్తుగానే ప్రణా ళికాబద్దంగా చర్యలు చేపడదా మన్నారు. వివిధ అంశాలపై చర్చల సందర్భంగా ప్రజా ప్రతినిధులు లేవనెత్తిన అంశాలను వెంటనే పరిష్కరించాలని చెప్పారు.

అధికారుల గైర్హాజరుపై ఆగ్రహం…

- Advertisement -

దిశ సమావేశానికి పలువురు అధికారులు గైర్హాజరు కావడంపై ఎంపీ రంజిత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా స్థాయిలో నిర్వ హించే సమావేశానికి అధికారులు రాకపోవడం ఏమి టని ప్రశ్నిం చారు. రాబోయే సమావేశాలకు తప్పనిసరిగా 100 శాతం అధికా రులు హాజ రయ్యేలా చూడాలని, అధికారులు రానపుడు మీటింగ్‌ ఎందుకంటూ ఎంపీ అసహనం వ్యక్తం చేశారు. ఇలాంటిది మళ్లీ పునరావృతం కారాదని పేర్కొన్నారు.
గ్రామపంచాయతీ భవనాలు పూర్తి చేసేలా అవసరమైతే నిధులు కేటాయించాలని ఎమ్మెల్సీ పి.మహేందర్‌రెడ్డి సూచించారు. గతం లో గ్రామపంచాయతీ భవనాల నిర్మాణాలకు రూ.12లక్షలు మంజూరు చేయగా అవన్నీ అర్ధాంతరంగా నిలిచిపోయాయని వాటిని పూర్తి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకుగాను జిల్లా కలెక్టర్‌ ప్రత్యేక చొరవ తీసుకొని నిధుల కేటాయింపు జరిగేలా చూడాల్సిందిగా సూచించారు. వికారాబాద్‌ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌ మాట్లాడుతూ గ్రామాలలో వంద శాతం మరుగుదొడ్ల నిర్మా ణం చేపట్టినట్లుగా పేర్కొని ఓడీఎఫ్‌గా ప్రకటించినా, వాటిని ఉప యోగించడం లేదని పేర్కొన్నారు. అధికారులు ఈ అంశంపై ప్రత్యేక చర్యలు చేపట్టి మరుగుదొడ్లు ఉప యోగించేలా చైతన్యం తీసుకు రావాలని చెప్పారు. అన్ని పథకాల అమలుకు సంబంధించి స్థానిక ప్రజా ప్రతినిధుల దృష్టికి తీసుకువెళ్లాలని సూచించారు. పరిగి కొప్పుల మహేశ్‌రెడ్డి మాట్లాడుతూ పాఠశాలల్లో స్కావెంజర్స్‌ లేక అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ఏదోరకంగా స్కావెంజ ర్‌ల నియామకం జరిగేలా చూడాలని కోరగా ఇబ్బం ది తొలగిస్తా మని కలెక్టర్‌ నిఖిల తెలిపారు. ఉపాధిహామీ పథకం నిధులతో గ్రా మపంచాయతీ భవనాలు నిర్మాణం చేపట్టేలా చర్యలు తీసుకోవా లని ఎమ్మెల్యే సూచించారు. చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాద య్య మా ట్లాడుతూ సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేయా ల్సిందిగా పేర్కొన్నారు. పథకాల లక్ష్యాలు గొప్పవని, అమలు సరిగ్గా జరిగితే ప్రజలకు మేలు కలుగుతుందన్నారు. కొడంగల్‌ ఎమ్మెల్యే పి.నరేందర్‌రెడ్డి మాట్లాడుతూ పాఠశాలల ఆవరణలో మొక్కలు నాటేందుకు అవసరమైన స్థలాలు ఉన్నచోట్లు ఎంపిక చేసి వెంటనే కార్యక్రమం జరిగేలా చూడాలన్నారు. దీంతో ఆయా పాఠశాలల్లో చక్కటి వాతావరణం ఏర్పడు తుందని తెలిపారు.

నేటి నుంచి ఇంటింటికీ వ్యాక్సినేషన్‌

జీహెచ్‌ఎంసీలో అమలు చేసినట్లుగా జిల్లా పరిధిలోని ప్రతి ఇంటికీ వెళ్లి అర్హులైన వారందరికీ కొవిడ్‌ వ్యాక్సిన్‌ వేసే కార్యక్రమం గురు వారం నుంచి చేపట్టనున్నట్టు జిల్లా కలెక్టర్‌ నిఖిల పేర్కొన్నారు. వికారాబాద్‌ జిల్లా పరిధిలో 154 సబ్‌ సెంటర్లు, నాలుగు మున్సి పాలిటీలలో 97 వార్డులు ఉన్నాయని, ఈ మేరకు జిల్లా వ్యాప్తంగా 251 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి ఇంటింటికి వెళ్లి కొవిడ్‌ వ్యాక్సిన్‌ వేసే కార్యక్రమం చేపడుతున్నట్లు చెప్పారు. 18 సంవత్స రాలు పైబడిన వారందరికీ వ్యాక్సిన్‌ వేయాలన్నది ప్రభుత్వ ఉద్దేశ మన్నారు. ప్రజా ప్రతినిధులందరు సహకరించి వ్యాక్సినేషన్‌ కార్య క్రమం విజయవంతమయ్యేలా చూడాలని కలెక్టర్‌ కోరారు. కార్య క్రమంలో జిల్లా అదనపు కలెక్టర్‌ మోతిలాల్‌, డీఆర్‌డీవో కృష్ణన్‌, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు, ఎంపీపీలు పాల్గొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana