e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, October 26, 2021
Home జిల్లాలు బతుకమ్మకు ప్రపంచవ్యాప్త గుర్తింపు

బతుకమ్మకు ప్రపంచవ్యాప్త గుర్తింపు

  • పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి

పరిగి, అక్టోబర్‌14: బతుకమ్మ పండుగను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుండటంతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించిందని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి అన్నారు. గురువా రం ఆయన మండలంలోని సయ్యద్‌మల్కాపూ ర్‌, రాఘవాపూర్‌ గ్రామాల్లోని మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేసి మాట్లాడారు. అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా పండుగలు జరుపుకోవాలన్నదే సీఎం కేసీఆర్‌ ప్రభుత్వం ముఖ్య ఉద్దేశమన్నారు. 18 ఏండ్లు నిండి రేషన్‌ కార్డులో పేరున్న ప్రతి మహిళకూ బతుకమ్మ చీరను పంపిణీ చేస్తామన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభు త్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాల పండుగలను అధికారికంగా నిర్వహిస్తున్నదన్నారు. కార్యక్రమం లో ఎంపీపీ అరవిందరావు, జడ్పీటీసీ హరిప్రియ, మా ర్కెట్‌ కమిటీ చైర్మన్‌ సురేందర్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ శ్యాంసుందర్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు ఆంజనేయులు, సీనియర్‌ నాయకుడు ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, భాస్కర్‌, సర్పంచ్‌ జగన్‌, హన్మంత్‌రెడ్డి పాల్గొన్నారు.
బండవెల్కిచర్లలో..
కులకచర్ల, అక్టోబర్‌14: మహిళలకు దసరా పండుగ సందర్భంగా బతుకమ్మ చీరలకు ప్రభుత్వం కానుకగా అందజేస్తుందని బండవెల్కిచర్ల సర్పంచ్‌ శిరీషాలక్ష్మారెడ్డి, ఎంపీటీసీ జ్యోతీ శ్రీనివాస్‌గౌడ్‌, పాంబండ ఆలయ చైర్మన్‌ రాములు అన్నారు. గురువారం బండవెల్కిచర్ల గ్రామం లో బతుకమ్మ చీరలను వారు మహిళలకు అందజేశారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ నాయకులు బాల్‌రెడ్డి, గ్రామానికి చెందిన మహిళలు పాల్గొన్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement