e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, October 18, 2021
Home జిల్లాలు సూర్యాపేటలో గంజాయి పట్టివేత

సూర్యాపేటలో గంజాయి పట్టివేత

  • సూర్యాపేటలో పట్టుకున్న పోలీసులు
  • ఇద్దరి అరెస్ట్‌, రెండు కార్లు సీజ్‌
  • 120 కిలోల గంజాయి స్వాధీనం

సూర్యాపేట సిటీ, సెప్టెంబర్‌ 28 : సూర్యాపేటలోని కొత్తబస్టాండ్‌ సమీపంలో రెండు కార్లల్లో తరలిస్తున్న 120 కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. ఆ వివరాలను డీఎస్పీ మోహన్‌కుమార్‌ మంగళవారం వెల్లడించారు. సోమవారం సాయంత్రం 5గంటల సమయంలో ఎస్పీ ఆదేశాలతో పట్టణంలోని కొత్తబస్టాండ్‌ వద్ద పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తున్నారు. రెండు కార్లను ఆపి విచారిస్తుండగా సరైన సమాధానం చెప్పకపోవడంతో వాటిని తనిఖీ చేశారు. మొదటి కారులో 30, రెండో కారులో 24 గంజాయి ప్యాకెట్లు దొరికాయి. నిర్మల్‌ జిల్లా మామడ మండలం కిషన్‌రావుపేటకు చెందిన జాదవ్‌ అశోక్‌, విశాఖపట్నం జిల్లా అనకాపల్లికి చెందిన బొడ్డెడ మల్లికార్జురావును అదుపులోకి తీసుకొని కార్లతోపాటు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గంజాయిని విశాఖపట్నం జిల్లా నుంచి తీసుకొచ్చి హైదరాబాద్‌, మహారాష్ట్రలో విక్రయిస్తున్నట్లు నిందితులు తెలిపారు. ఒక్కో ప్యాకెట్‌లో రెండు కిలోల చొప్పున గంజాయి ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా దాడి చేసి పట్టుకున్న సీసీఎస్‌ సీఐ ఎస్‌.రాఘవరావు, సూర్యాపేట ఇన్‌చార్జి సీఐ డి.రాజేశ్‌, నాగారం, సూర్యాపేట పట్టణ ఎస్‌ఐలు పి.శ్రీనివాస్‌, ఎం.బాసు, కె.నరేందర్‌రెడ్డి, సీసీఎస్‌ సిబ్బంది, హెడ్‌ కానిస్టేబుల్‌ సీహెచ్‌.వెంకన్న, కానిస్టేబుళ్లు సీహెచ్‌.శ్రీనివాస్‌. కె.నర్సింహారావు, కె.రమేశ్‌, హోంగార్డు సాయిని పోలీసు ఉన్నతాధికారులు అభినందించారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement