ఉస్మానియా యూనివర్సిటీ : ఉస్మానియా యూనివర్సిటీ నేషనల్ సర్వీస్ స్కీమ్ (ఎన్ఎస్ఎస్) కోఆర్డినేటర్‌గా డాక్టర్ సవిన్ సౌడ నియమితులయ్యారు. ఈ మేరకు ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఇంగ్లీష్ విభాగానికి చెందిన ఆయన గతంలో ఓయూ యూత్ వెల్ఫేర్ ఆఫీసర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. ప్రస్తుతం ఓయూ ఇంజినీరింగ్ కళాశాల ఇంగ్లీష్ విభాగం హెడ్, సెంటర్ ఫర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ట్రైనింగ్ (సెల్ట్) డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఆయనను పలువురు విద్యార్థి నాయకులు, పరిశోధక విద్యార్థులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పరిశోధక విద్యార్థి లక్కాకుల ప్రేమ్‌కుమార్, హైకోర్టు న్యాయవాది డాక్టర్ నవీన్, వరంగల్ రవి, శెట్టి, సుదర్శన్, సూర్యం, అర్జున్, శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.