e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, October 18, 2021
Home జిల్లాలు మత్స్యకారుల సంక్షేమానికి కృషి

మత్స్యకారుల సంక్షేమానికి కృషి

  • మల్‌చల్మాఈరన్నవాగు చెరువులో చేపపిల్లలను వదిలిన జహీరాబాద్‌ ఎంపీ బీబీ పాటిల్‌, ఎమ్మెల్యే మాణిక్‌రావు

జహీరాబాద్‌, సెప్టెంబర్‌ 20: మత్స్యకారుల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తున్నదని జహీరాబాద్‌ ఎంపీ బీబీ పాటిల్‌ అన్నారు. సోమవారం జహీరాబాద్‌ మండలంలోని ఈరన్నవాగు చెరువులో ఎమ్మెల్యే కొనింటి మాణిక్‌రావుతో కలిసి ఆయన చేపపిల్లలను వదిలారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. సంగారెడ్డి జిల్లాలో నీటివనరులపై ఆధారపడిన 189 సహకార సంఘాల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు. ఉచితంగా జిల్లాలోని 135 0 చెరువుల్లో 4.83 కోట్ల చేప పిల్లలను వదులుతున్నదన్నారు.

37.97 లక్షల చేపపిల్లల పెంపకం

- Advertisement -

మత్స్యకారుల సంక్షేమం కోసం జహీరాబాద్‌ నియోజకవర్గంలో ఉన్న 99 చెరువుల్లో 37.97 లక్షల చేపపిల్లల పెంపకం కోసం ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఎమ్మెల్యే కొనింటి మాణిక్‌రావు తెలిపారు. ప్రతి మత్స్యకారుడికి సహకార సంఘంలో సభ్యత్వం ఇచ్చి, ప్రభు త్వం అందించే సబ్సిడీ పథకాలు వర్తింపజేయాలన్నారు. గ్రామాల్లో మత్స్యకారుల సహకార సంఘాలకు సామూహిక భవనాలు మం జూరు చేసేందుకు ప్రభుత్వం కృషిచేస్తున్నదన్నారు. సంగారెడ్డి జిల్లా మత్స్యశాఖ ఏడీ సతీశ్‌, సహాయ అధికారి శ్రీశైలం, జహీరాబాద్‌ సీడీసీ చైర్మన్‌ ఉమాకాంత్‌ పాటిల్‌, ఆత్మకమిటీ చైర్మన్‌ విజయ్‌కుమార్‌, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు ఎంజీ. రాములు, టీఆర్‌ఎస్‌ నాయకులు జి. గుండప్ప, సుభాష్‌రెడ్డి, గోవర్ధన్‌రెడ్డి, ఎంపీడీవో రాములు పాల్గొన్నారు.

ప్రతి ఒక్కరూ అభివృద్ధి చెందాలి

కోహీర్‌, సెప్టెంబర్‌ 20: ప్రతి ఒక్కరూ అభివృద్ధి చెందాల ని ఎమ్మెల్యే కొనింటి మాణిక్‌రావు అన్నారు. సోమవారం మండలంలోని గొటిగార్‌పల్లి పెద్దవాగు ప్రాజెక్టులో 1.80లక్షల చేప పిల్లలను ఆయన వదిలారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మత్స్యకారుల అభివృద్ధికి ప్రభుత్వం ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేస్తున్నదని గుర్తు చేశారు. గ్రామ పంచాయతీ భవనం శిథిలావస్థకు చేరిందని కొత్త భవనాన్ని మంజూరు చేయాలని సర్పంచ్‌ అనుసూజమ్మ కోరారు. సెడెగుట్ట తండాకు ఎస్టీ కమ్యూనిటీ భవనాన్ని మంజూ రు చేయాలని విన్నవించారు. ఎంపీడీవో సుజాతనాయక్‌, ఉప సర్పంచ్‌ కమలాబాయి, కార్యదర్శి వనితారాణి, అధికారులు రవీందర్‌, సురేశ్‌, ప్రసాద్‌, టీఆర్‌ఎస్‌ నేతలు పాల్గొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement