e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, June 13, 2021
Home జిల్లాలు ఇక మండలాల్లో ఉన్నత విద్య

ఇక మండలాల్లో ఉన్నత విద్య

ఇక మండలాల్లో ఉన్నత విద్య

కొందుర్గు, జిల్లెడు చౌదరిగూడ మండల కేంద్రాల్లో కాలేజీల ఏర్పాటుకు సన్నాహాలు
కొందుర్గు, మార్చి 28: రాష్ర్టాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పర్చి బంగారు తెలంగాణగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ముఖ్య మంత్రి కేసీఆర్‌ ఎంతో కృషి చేస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం నిధులను ప్రభుత్వం సమ కూరుస్తున్నది. ఇందులో భాగంగానే మండల కేంద్రాల్లో నూ తనంగా ప్రభుత్వ కళాశాలలను ఏర్పాటు చేసేందుకు ప్రభు త్వం సన్నాహాలు చేస్తున్నది. షాద్‌నగర్‌ నియోజకవర్గ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్‌ కొందుర్గు, జిల్లెడు చౌదరిగూడ మండల కేంద్రాల్లో నూతన ప్రభుత్వ కళాశాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి నివేదికలు అందజేశారు. అంతేకాకుండా ఇటీవలి అసెంబ్లీలో చర్చించారు. దీనికి స్పందించిన విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి మండలాల్లో తప్పని సరిగా కళాశాలలు ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు. దీంతో మం డలంలోని ఆయా గ్రామాల విద్యార్థులు ఉన్నత చదు వుల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం ఉండదని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కొందుర్గు మండలంలో మొత్తం 22గ్రామ పంచాయతీలు, జిల్లెడు చౌదరిగూడ మండలంలో మొత్తం 24గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ప్రస్తుతం పదో తరగతి చదువుతున్న విద్యార్థులు కొందుర్గు మండలంలో 356 మంది ఉన్నారు. జిల్లెడు చౌదరిగూడ మండలంలో 282 మంది ఉన్నట్లు అధికారులు తెలిపారు.

సద్వినియోగం చేసుకోవాలి
మండల కేంద్రాల్లో నూత నంగా కాలేజీలు ఏర్పా టు చేయడంతో విద్యార్థులకు దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. ప్రభుత్వం కల్పిస్తున్న ఈ అవకాశాన్ని విద్యార్థులు ఉప యోగించుకోవాలి.
-మీదిగడ్డ బాబురావు, సర్పంచ్‌ల సంఘం మం డల అధ్యక్షుడు జిల్లెడు చౌదరిగూడ మండలం
విద్యార్థులకు ఎంతో సౌకర్యం
ఉన్నత విద్యను అభ్యసి స్తు న్న విద్యార్థులకు మండల కేంద్రాల్లో కాలేజీలు ఏర్పా టు చేస్తే ఎంతో సౌక ర్యంగా ఉంటుంది. ఎమ్మెల్యే చొరువ తీసుకుని ప్రభుత్వ కళాశాలల ఏర్పా టుకు కృషి చేయడం ఎంతో అభినందనీయం.
-రావుల బాల్‌రాజు, మత్స్యసహకార సంఘం జిల్లా మాజీ అధ్యక్షుడు, పెద్ద ఎల్కిచర్ల గ్రామం

ఇవి కూడా చదవండి

నిమ్మ‌కాయ తొక్కు ఆరోగ్యానికి మంచిదేనా?

కూర‌లో ఉప్పు ఎక్కువైతే ఏం చేయాలి

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ఇక మండలాల్లో ఉన్నత విద్య

ట్రెండింగ్‌

Advertisement