e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, October 18, 2021
Home జిల్లాలు ఎమ్మెల్యే హామీతో దీక్ష విరమణ

ఎమ్మెల్యే హామీతో దీక్ష విరమణ

అబ్దుల్లాపూర్‌మెట్‌, సెప్టెంబర్‌ 28 : మైనింగ్‌ జోన్లో భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం ఇప్పిస్తానని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి హామీ ఇవ్వడంతో దీక్ష విరమిస్తున్నామని బండరావిరాల, చిన్నరావిరాల భూ నిర్వాసితుల కమిటీ సభ్యులు తెలిపారు. అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం బండరావిరాల, చిన్నరావిరాల సర్వేనం 268లో మైనింగ్‌ జోన్లో భూములు కోల్పోయిన 209 మంది రైతులు నష్టపరిహారం కోరుతూ 14 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నారు. రైతుల సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించానని, త్వరలోనే పరిహారం వస్తుందని ఎమ్మెల్యే రైతులకు వివరించడంతో మంగళవారం కమిటీ సభ్యులు దీక్షను విరమింపజేశారు. కార్యక్రమంలో భూ నిర్వాసితుల కమిటీ గౌరవాధ్యక్షుడు దానేశ్‌, అధ్యక్షుడు ఐలయ్య, ఉపాధ్యక్షులు జంగయ్య, నర్సిం హ, ప్రధాన కార్యదర్శులు శివశంకర్‌, మొలుగు అర్జున్‌, కోశాధికారులు యముల మల్లేష్‌, పల్లపు ఐలయ్య పాల్గొన్నారు.
బండరావిరాల బాధితులకు త్వరలో పరిహారం : ఎమ్మెల్యే మంచిరెడ్డి
ఇబ్రహీంపట్నం, సెప్టెంబర్‌ 28 : అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలంలోని బండరావిరాల, తదితర గ్రామాల్లో గత ప్రభుత్వం మైనింగ్‌జోన్‌ కోసం సేకరించి, నష్టపరిహారం చెల్లించలేదని ఆ బాధితులకు త్వరలోనే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పరిహారం ఇవ్వడానికి సానుకూలంగా స్పందించిందని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. సోమవారం బండరావిరాల అంశంపై ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అసెంబ్లీలో ప్రస్తావించటంతో మంగళవారం అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలానికి చెందిన పలువురు టీఆర్‌ఎస్‌ నేతలు ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సోమవారం అసెంబ్లీలో ప్రస్తావించగా ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని, త్వరలోనే పరిహారం ఇప్పిస్తానన్నారు. దీంతో రైతులు సంతోషం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేను కలిసిన వారిలో గడ్డిఅన్నారం మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ముత్యంరెడ్డి, అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలాధ్యక్షుడు కిషన్‌గౌడ్‌ పాల్గొన్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement