e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, June 15, 2021
Home జిల్లాలు తెలంగాణలో కవులకు ఎనలేని గుర్తింపు

తెలంగాణలో కవులకు ఎనలేని గుర్తింపు

తెలంగాణలో కవులకు ఎనలేని గుర్తింపు

త్యాగాల ఫలితమే దేశానికి స్వాతంత్య్రం
వికారాబాద్‌ జిల్లా కలెక్టర్‌ పౌసుమి బసు

వికారాబాద్‌, ఏప్రిల్‌ 3 : కవులు, కళాకారుల త్యాగంతోనే స్వాతంత్య్రం సిద్ధించిందని కలెక్టర్‌ పౌసుమి బసు అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని అంబేద్కర్‌ భవనంలో కలెక్టర్‌ ఆధ్వర్యంలో 75 వసంతాల స్వాతంత్య్ర భారత అమృతోత్సవాల కవిసమ్మేళనం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, ఒక్కో కవి గొంతుకలో ఒక్కో ఉత్తేజితమైన స్వరాలు ఉంటాయని ఆమె కొనియాడారు. స్వాతంత్య్రం కోసం ఎందరో కవులు తమ స్వరాలతో పోరాటాం చేశారని గుర్తు చేశారు. కవి సమ్మేళనంలో పాల్గొని పాడుతున్న ప్రతి ఒక్కరి రచనలు, కవిత్వాలు, పద్యాలు, దేశభక్తి గీతాలు చాలా ఎంతో బాగున్నాయని మెచ్చుకున్నారు. మన ప్రాంతంలో కూడా పెద్ద ఎత్తున కవులు ఉండటం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. అనంతరం వికారాబాద్‌, చేవెళ్లె ఎమ్మెల్యేలు డాక్టర్‌ మెతుకు ఆనంద్‌, కాలె యాదయ్యలు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్టంలో కవులకు మంచి గుర్తింపు ఉందన్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్ని వర్గాల సంక్షేమానికి పాటుపడుతున్నారని స్పష్టం చేశారు. ప్రతి సంవత్సరం తెలుగుమహాసభల పేరుతో కవులకు అరుదైన గౌరవాన్ని ఇస్తున్నారని గుర్తు చేశారు. తెలంగాణలో కవులకు మంచి ప్రాధాన్యత ఉందని అన్నారు. కవుల్లో ఉన్న ఉత్తేజం, ఉత్సాహం చూస్తే చాలా ఆనందం కలుగుతుందని అన్నారు. ఒక్కో కవి దేశం కోసం పాటుపడిన ఘటనలను గుర్తు చేస్తూ పాడుతుంటే మనస్సు పులకించిపోతున్నదని చెప్పారు. కవులు బంగారు తెలంగాణ నిర్మాణానికి తమ వంతు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్‌ చంద్రయ్య, గిరిజన అభివృద్ది శాఖ అధికారి కోటాజీ, బీసీ సంక్షేమ శాఖ అధికారి పుష్పలత, జిల్లా క్రీడలశాఖ అధికారి హన్మంత్‌రావు, జిల్లా అటవీశాఖ అధికారి వేణుమాధవ్‌రావు,జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ మురళీకృష్ణగౌడ్‌, ఎంపీపీ చంద్రకళ, తాసిల్దార్‌ రవీందర్‌, కవులు రాజలింగం, ఉమాదేవి, శ్రీనివాస్‌, అంజయ్య, సత్తయ్య, రాపోలు శ్రీనివాస్‌ పాల్గొన్నారు.


రంగారెడ్డి కలెక్టరేట్‌లో..
ఎందరో స్వాతంత్య్ర సమరయోధుల ఫలితంగా స్వేచ్ఛా వాయువులను పీలుస్తున్నామని రంగారెడ్డి జిల్లా ఇన్‌చార్జి అదనపు కలెక్టర్‌ తిరుపతిరావు అన్నారు. జిల్లాలో స్వాతంత్య్ర భారత అమృత మహోత్సవంలో భాగంగా శనివారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో స్వాతంత్య్ర స్ఫూర్తి అనే అంశంపై కవి సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఆయన జిల్లా అధికారులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్య్ర సమరయోధుల వలన బానిసత్వం లేకుండా జీవిస్తున్నామని చెప్పారు. స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు అయినందున ప్రభుత్వం 75వారాల పాటు వేడుకలు నిర్వహించడానికి నిర్ణయించిందన్నారు. అందులో భాగంగా 2కె ఫ్రీడం రన్‌ నిర్వహించినట్లు తెలిపారు.

కవి సమ్మేళనంలో 12 మంది కవులు పాల్గొని స్వాతంత్య్ర స్ఫూర్తి అనే అంశంపై కవితలను వినిపించారు. అనంతరం కవులను పూలమాలలు, శాలువాలతో సన్మానించి రూ.1116 పారితోషికంతో పాటు ప్రశంసాపత్రాలను అందజేశారు. కవులు స్వాతంత్య్ర స్ఫూర్తి, మన ప్రస్థానం, జాతీయ స్ఫూర్తిలపై శీర్షిక గేయాలు అలపించారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి విజయకుమారి, జిల్లా పౌరసంబంధాల అధికారి పద్మశ్రీ, జిల్లా యువజన క్రీడల అధికారి వెంకటేశ్వర్‌రావు, కవులు శ్యామాచారి, చెన్నయ్య, శ్రీరామమూర్తి, కృష్ణగౌడ్‌, గాండ్ల వీరమణి, ఆకుల మల్లికార్జున్‌, భవాని, జగదీశ్వర్‌రెడ్డి, పరమేశ్వర్‌, మల్లేశ్‌, జహంగీర్‌, రామస్వామి, ఆశీర్వాదం పాల్గొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
తెలంగాణలో కవులకు ఎనలేని గుర్తింపు

ట్రెండింగ్‌

Advertisement