e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, June 21, 2021
Home జిల్లాలు మున్సిపాలిటీ అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ

మున్సిపాలిటీ అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ

మున్సిపాలిటీ అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ

ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్
ఆమనగల్లు, ఏప్రిల్‌ 3 : మున్సిపాలిటీ అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌ పేర్కొన్నారు. శనివారం మున్సిపాలిటీతో పాటు పట్టణంలో కూరగాయల మార్కెట్‌, వృథాగా ఉన్న ప్రభుత్వ భవనాలను మున్సిపల్‌ కమిషనర్‌ శ్యామ్‌సుందర్‌తో కలిసి పరిశీలించారు. మున్సిపాలిటీలో జరుగుతున్న అభివృద్ధి, నిధులకు సంబంధించిన రికార్డులను ఎమ్మెల్యే పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో ఉన్న మున్సిపాలిటీలు, మండలాల్లో సమీకృత అభివృద్ధి జరిగేలా నోడల్‌ ఏజెన్సీ ఏర్పాటు చేయనున్నట్లు సీఎం కేసీఆర్‌ వివరించారన్నారు. ఈ విషయంపై సీఎం కేసీఆర్‌ అధికారులు, ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించారన్నారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ నాయకులు తోట గిరి, ఖలీల్‌, జయరాం పాల్గొన్నారు.
సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శం
కడ్తాల్‌, ఏప్రిల్‌ 3 : రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌ అన్నారు. మండల పరిధిలోని టాక్‌రాజ్‌గూడ తండాకు చెందిన గోరికి రూ.56వేలు, బుజ్జికి రూ.20వేలు మంజూరైన చెక్కులను హైదరాబాద్‌లోని ఎమ్మెల్యే నివాసంలో సర్పంచ్‌ హరిచంద్‌నాయక్‌తో కలిసి లబ్ధిదారులకు ఎమ్మెల్యే అందజేశారు. కార్యక్రమంలో ఎంపీటీసీ జైపాల్‌రెడ్డి, ఉప సర్పంచ్‌లు పాల్గొన్నారు.


సంక్షేమ పథకాలు అందరికీ అందాలి
తలకొండపల్లి, ఏప్రిల్‌ 3 : మండలాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని, సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికీ అందేలా అధికారులు ముందుకు సాగాలని ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌ అన్నారు. మండల పరిషత్‌ కార్యాలయంలో ఎంపీపీ నిర్మల అధ్యక్షతన సర్వసభ్య సమావేశం జరిగింది, సమావేశానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌ హాజరై మాట్లాడారు. మండలంలో మిషన్‌ భగీరథ పనులు పూర్తి చేయాలన్నారు. చింపునుంతల అమ్రవాయి చెరువు భూమి ఆక్రమణకు గురవుతున్నదని దానిని కాపాడాలని రెవెన్యూ అధికారులకు సూచించారు. ఖానాపూర్‌ శివారులోని 42 ఎకరాల ప్రభుత్వ భూమిలో జూనియర్‌ కళాశాల, మినీ మార్కెట్‌ యార్డు, కేంద్రీయ విద్యాలయం, గురుకుల పాఠశాల ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేసేందుకు మండల సభ తీర్మానం చేశారు. కొత్త రేషన్‌ కార్డులు, పింఛన్ల ప్రక్రియ నెల రోజుల్లో పూర్తవుతుందని ఎమ్మెల్యే తెలిపారు.


ప్రతీ ఎకరాకు నీరందిస్తాం..
రెండేండ్లలో పాలమూరు-రంగారెడ్డి, కల్వకుర్తి ఎత్తిపోతల పథకాలతో నియోజకవర్గంలోని ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తామని ఎమ్మెల్యే అన్నారు. కార్యక్రమంలో సర్పంచులు లలిత, చంద్రయ్య, రమేశ్‌యాదవ్‌, స్వప్నభాస్కర్‌రెడ్డి, లక్ష్మణ్‌నాయక్‌, ఎంపీటీసీలు సుధాకర్‌రెడ్డి, హేమ, సోని, గోపాలకృష్ణ, అధికారులు పాల్గొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
మున్సిపాలిటీ అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ

ట్రెండింగ్‌

Advertisement