ఇందూరు, సెప్టెంబర్ 13: నిజామాబాద్ నగరంలోని గంగస్థాన్లో నివాసముండే రాజమణి, ప్రకాశ్ దంపతుల కూతురు లోరా మాడిసన్. తండ్రి మున్సిపల్ కార్పొరేషన్లో ఉద్యోగి కాగా, తల్లి కోర్టు ఉద్యోగిని. నగరంలోని రాఘవ పబ్లిక్ స్కూల్లో ప్రాథమిక విద్యనభ్యసించి, ఇంటర్ కాకతీయ కళాశాలలో, ఇంజినీరింగ్ హైదరాబాద్‌లోని మల్లారెడ్డి కళాశాలలో పూర్తి చేసింది. నటపై ఆసక్తితో సహోదరులు ప్రవీణ్, ప్రశాంత్‌ల సహకారంతో షార్ట్ ఫిల్మ్ రంగంలో అడుగు పెట్టింది. అనతి కాలంలోనే చక్కనైన అందం, అభినయం, నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నది. ఎలాంటి పాత్రనైనా చేయగల ప్రతిభఉన్న అ మ్మాయిగా, తెలుగు చిత్ర పరిశ్రమలో రాణిస్తున్నది. మోడలింగ్, ర్యాంప్ వాక్, బ్యూటీ కాంటెస్ట్‌లో పాల్గొన్న లోరా పలు మోడలింగ్ షోలకు గెస్ట్‌గా హాజరయ్యారు. వేదిక్ హైర్ యాడ్స్ చేశారు. అద్భుతమైన నటనతో పలు అవార్డులు సైతం అందుకున్నారు. ఒకవైపు నటిస్తూనే మరోవైపు విద్యార్థులకు గణితం, ఆంగ్లం బోధిస్తున్నది. నిజామాబాద్‌లో ప్రభు త్వ సహకారంతో డ్వాక్రా మహిళలకు టైలరింగ్‌లో శిక్షణ సైతం కల్పిస్తున్నది. లోరా డిజైనర్ ఇన్స్టిట్యూట్ను ప్రారంభించి సుమారు 3వేల మందికి ఫ్యాషన్ డిజైనింగ్‌లో శిక్షణ ఇచ్చారు.
చక్కని అందం, అభినయంతో ప్రేక్షకులను
ఆకట్టుకుంటున్నదీ సుందరి. షార్ట్ ఫిల్మ్ ద్వారా నటనలో అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ సినిమా రంగంలో రాణిస్తున్నది. నటనలో ప్రావీణ్యంతోపాటు విద్యార్థులకు పలు సబ్జెక్టుల్లో బోధిస్తూ ఆదర్శంగా
నిలుస్తున్నది నిజామాబాద్‌కు చెందిన నటి లోరా మాడిసన్.
నటించిన సినిమాలు.
నారీ ,
వోడ్కా వాయిస్ ఆఫ్ గర్ల్,
గువ్వ గోరింకతో,
బంగారు తెలంగాణ,
ఓటరు (మంచు విష్ణు),
మేళా ,
సైరా నర్సింహారెడ్డి ,
బజార్ రౌడీ ,
ఎక్స్పైరీ డేట్(వెబ్ సిరీస్),
ఒక అమ్మాయి ఇద్దరు అబ్బాయిలు.
లేడీ ఓరియంటెడ్
సినిమాలు చేయాలని ఉంది..
పూర్తిస్థాయి లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేయాలని ఉంది. విజయశాంతి చేసిన ఒసేయ్ రాములమ్మ, వెంకటేశ్ నటించిన గురు లాంటి సినిమాల్లో నటించాలని ఉంది. సినీ ఇండస్ట్రీలో నిజామాబాద్ అమ్మాయిగా రాణించడం సంతోషంగా ఉంది. ఎలాంటి రోల్ అయినా చేసే టాలెంట్ ఉంది. బజార్‌రౌడీ సినిమాలో నాకు మంచి పేరు వచ్చింది. కొన్ని సినిమాలకు సైన్ చేశాను. త్వరలోనే స్క్రీన్ మీద ఇందూరు విజయశాంతిని చూస్తారు.
షార్ట్ ఫిల్మ్ ద్వారా ప్రవేశం..
లోరా నారీ అనే షార్ట్ ఫిల్మ్ ద్వారా నటన వైపు అడుగులు వేసింది. 2017లో గువ్వ గోరింకతో సినిమా ద్వారా తెలుగు సినీ రంగంలో అడుగుపెట్టింది. సహోదరులు ప్రవీణ్, ప్రశాంత్ సహకారంతో 2017లో సొంత బ్యానర్ ఎల్7 ఆర్ట్స్ క్రియేషన్‌లో వోడ్కా(వాయిస్ ఆఫ్ గర్ల్) సినిమాను నిర్మించారు.
అవార్డులు బెస్ట్ ఫిమేల్ సపోర్టింగ్ లీడ్ అవార్డు బెస్ట్ సింగిల్ టెక్ ఆర్టిస్ట్ సామాజిక సేవలో.. మహిళా స్వశక్తి కోసం చేసిన సేవకు స్త్రీ హస్తిన మహిళా మండలి వారు నారీ అవార్డుతో సత్కరించారు.
కొవిడ్ విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు చేసిన సేవను గుర్తించి శ్రీసాయి శాంతి సహాయ సేవా సమితి అవార్డును ప్రదానం చేశారు.