e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, June 22, 2021
Home కామారెడ్డి ఉధృతంగా గోదారమ్మ ప్రవాహం

ఉధృతంగా గోదారమ్మ ప్రవాహం

ఉధృతంగా గోదారమ్మ ప్రవాహం

హల్దీవాగులో ఉధృతంగా ప్రవాహం..
4 చెరువులు,20 చెక్‌డ్యాములకు జలకళ
ఏడో రోజు 9 కి.మీ పరుగులు పెట్టిన గంగమ్మ
ఐదారు రోజుల్లోనే నిజాంసాగర్‌కు..
కాళేశ్వరం నీళ్లు తేవడం సీఎం కేసీఆర్‌తోనే సాధ్యం : మంత్రి వేముల
ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్ల పరిశీలన

తూప్రాన్‌ రూరల్‌, ఏప్రిల్‌ 12 : అన్నదాతలు సాగునీటికి ఇబ్బందులు పడకూడదనే సీఎం కేసీఆర్‌ ప్రాజెక్టులు కట్టారని, కాళేశ్వరం ప్రాజెక్ట్‌ నుంచి కొండపోచమ్మసాగర్‌, మల్లన్నసాగర్‌ల నుంచి హల్దీవాగులోకి సాగునీటిని అందించిన ఘనత ఒక్క సీఎం కేసీఆర్‌కే దక్కిందని రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ (ఎఫ్‌డీసీ) చైర్మన్‌ వంటేరు ప్రతాప్‌రెడ్డి, ఫుడ్‌ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ ఎలక్షన్‌రెడ్డి అన్నారు. మెదక్‌ జిల్లా తూప్రాన్‌ మండల రైతుల విన్నపాన్ని గుర్తించి రెండు రోజుల్లోనే హల్దీవాగులోకి సాగునీటిని సీఎం కేసీఆర్‌ విడుదల చేయడం చరిత్రలో మరువలేని ఘట్టమన్నా రు. తూప్రాన్‌ మండలంలోని కిష్టాపూర్‌, యావాపూర్‌ చెక్‌డ్యామ్‌ల నుంచి పొంగిపొర్లుతున్న నీటిని చూసి వారు మురిసిపోయారు. గోదావరి నుంచి 600 మీటర్ల లోతు నుంచి కొండపోచమ్మసాగర్‌కు, అటు నుంచి 100 మీటర్ల లోతు నుంచి హల్దీవాగులోకి సాగునీరందిస్తున్నారని తెలిపారు. హల్దీవాగులోకి నీటిని అందించి సీఎం కేసీఆర్‌ తన మాటను నిలబెట్టుకున్నారన్నారు. కోటి ఎకరాల మాగాణికి సాగునీటిని అందించి పంటపొలాలను సస్యశామలం చేయాలన్న సీఎం కేసీఆర్‌ లక్ష్యం నెరవేరిందన్నారు. హల్దీవాగులోని సాగునీటిని అందించడం ద్వారా సిద్దిపేట జిల్లాలోని దుబ్బాక, గజ్వేల్‌, వర్గల్‌, మర్కూక్‌, మెదక్‌ జిల్లాలోని తూప్రాన్‌, వెల్దుర్త్తి ,నర్సాపూర్‌ మండలాలతో పాటు సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాల రైతులకు మేలు జరుగుతుందని తెలిపారు. తూప్రాన్‌ మండలంలోని చెక్‌డ్యాంలు ఆదివారం నుంచే పొంగిపొర్లి ప్రవహిస్తున్నాయని, మంగళవారం నాటికి గోదావరి జలాలు వెల్దుర్తి మండలానికి ప్రవేశిస్తాయని వంటేరు ప్రతాప్‌రెడ్డి తెలిపారు.
ఐదారు రోజుల్లోనే నిజాంసాగర్‌కు
కొండపోచమ్మ సాగర్‌ నుంచి సంగారెడ్డి కెనాల్‌ ద్వారా గోదావరి జలాలు ఏడోరోజూ సోమవారం పరుగులు తీశాయి. ఈ ఏడు రోజుల్లో సిద్దిపేట జిల్లాలో తొమ్మిది చెక్‌డ్యామ్‌లు, నాలుగు చెరువులను, మెదక్‌ జిల్లాలో 11 చెక్‌డ్యామ్‌లను గంగమ్మ నింపింది. అపర భగీరథుడు, సీఎం కేసీఆర్‌ ఈనెల 6న సిద్దిపేట జిల్లా అవుసులపల్లి వద్ద సంగారెడ్డి అప్‌టెక్‌ తూం వద్ద గోదావరి జలాలను వదిలిన సంగతి తెలిసిందే. ఏడో రోజు గోదారమ్మ సోమవారం 9 కిలోమీటర్ల దూరం ప్రయాణించింది. సోమవారం రాత్రి మెదక్‌ జిల్లా వెల్దుర్తి మండలంలోకి గోదావరి జలాలు ప్రవేశించాయి. మరో ఐదారు రోజుల్లో నిజాంసాగర్‌ చేరే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి

ఎన్ఆర్‌సీ తెచ్చినా.. గోర్ఖాల‌ను వెళ్ల‌గొట్టం

2024 క‌ల్లా చంద్రుడిపైకి తొలి మ‌హిళ‌, శ్వేత జాతేత‌ర వ్య‌క్తి

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ఉధృతంగా గోదారమ్మ ప్రవాహం

ట్రెండింగ్‌

Advertisement