e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, June 15, 2021
Home జిల్లాలు రంగ్ దే..

రంగ్ దే..

రంగ్ దే..

వాడవాడలా కాముడి దహనం
అంబరాన్నంటిన హోలీ సంబురాలు
కేరింతలు కొట్టిన యువకులు, చిన్నారులు
తారతమ్యాలు లేకుండా వేడుకలు

ఊట్కూర్‌, మార్చి 28 : మండల కేంద్రమైన ఊట్కూర్‌తోపాటు తిప్రాస్‌పల్లి, పగిడిమర్రి, అమీన్‌పూర్‌, బిజ్వా రం, పులిమామిడి, అవుసలోనిపల్లి గ్రామాల్లో శనివారం రాత్రి కామదహనం వేడుకలు నిర్వహించి, ఆదివారం హో లీ సంబురాలను ప్రజలు ఘనంగా జరుపుకొన్నారు. అర్ధరాత్రి వరకు యువకుల కేరింతలతో పురవీధుల చుట్టూ డ ప్పులు వాయిస్తూ కాముడి శవయాత్ర నిర్వహించారు. స్థా నిక మేన్‌ బజార్‌, శివాజీనగర్‌, కార్గిల్‌ చౌరస్తా, శ్రీరాంనగర్‌ తదితర చౌరస్తాల్లో పిడకలు, కట్టెలను కుప్పలుగా పేర్చి భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించి కాముడి దహనం చేశా రు. ఉదయం నుంచే చిన్నా పెద్ద తేడా లేకుండా ఒకరిపై ఒ కరు రంగులు చల్లుకుని హోలీ సంబురాలు ఘనంగా నిర్వ హించారు. గ్రామాల్లో యువకులు డీజే సౌండ్‌ పాటలకు నృ త్యాలు చేశారు.
మరికల్‌ మండలంలో …
మరికల్‌, మార్చి 28 : ప్రభుత్వం కరోనా వైరస్‌ విజృభిస్తున్న దృష్ట్ట్యా హోలీ పండుగను జరుపుకోరాదని తెలుపడంతో హోలీ పండుగ కల తప్పింది. మండలంలోని కొన్ని గ్రామాల్లో యువకులు, చిన్నారులు, మహిళలు అక్కడక్కడ రంగులు చల్లుకొని పండుగను జరుపుకొన్నారు. మండలంలో కొంద మంది యువకులు రంగులు చల్లుకుంటూ హోలీ సంబురాలను నిర్వహించారు.
ధన్వాడ మండలంలో…
ధన్వాడ, మార్చి 28 : మండలంతోపాటుగా కిష్టాపూర్‌, రాంకిష్టయ్యపల్లి, గోటూర్‌, పాతపల్లి, కంసాన్‌పల్లి తదితర గ్రామాల్లో హోలీ పండుగను జరుపుకొన్నారు. యువతీ యువకులు, పిల్లలు రంగులను చల్లుకుని హోలీ శుభాకాంక్షలు తెలుపుకొన్నారు.

ఇవి కూడా చదవండి

ఆవాలతో అద్భుతమైన ప్రయోజనాలు..!

గర్భిణిలు చింతకాయలను ఎందుకు తినాలంటే..?

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
రంగ్ దే..

ట్రెండింగ్‌

Advertisement