e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, October 19, 2021
Home జిల్లాలు టీఆర్‌ఎస్‌ పాలనలోనే సంక్షేమం

టీఆర్‌ఎస్‌ పాలనలోనే సంక్షేమం

  • గులాబీ జెండే శ్రీరామరక్ష
  • 2014కు ముందు, తర్వాతి మార్పును ప్రజలు గమనిస్తున్నరు
  • విపక్ష నేతలు మోకాలి యాత్రలు చేసినా ప్రయోజనం శూన్యం
  • తెలంగాణ సమాజం ఎప్పటికీ సీఎం కేసీఆర్‌ వెంటే..
  • బీజేపీ, కాంగ్రెస్‌ పాలిత రాష్ర్టాల్లో ఉచిత విద్యుత్‌ ఇస్తున్నారా?
  • రైతుబంధు, రైతు బీమా అక్కడెందుకు వర్తింప జేయడం లేదు
  • రాష్ట్ర విద్యుత్‌ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి

దేశానికే ఆదర్శంగా నిలుస్తున్న అనేక సంక్షేమ పథకాలు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆలోచనల్లో నుంచి పుట్టినవేనని రాష్ట్ర విద్యుత్‌ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. 2014 ఎన్నికల్లో గులాబీ జెండా విజయకేతనం ఎగురవేయడం వల్లే 24 గంటల ఉచిత విద్యుత్‌, రైతుబంధు, రైతు బీమా, దళిత బంధు, కల్యాణ లక్ష్మి, కేసీఆర్‌ కిట్‌ వంటి పథకాలు ఉద్భవించాయని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అధ్యక్షతన శనివారం సాయంత్రం జరిగిన టీఆర్‌ఎస్‌ రామన్నపేట మండల కమిటీ బాధ్యతల స్వీకారం కార్యక్రమానికి మంత్రి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2014కు ముందు ఆకలి చావులు, ఆత్మహత్యలు, రక్తపాతంతో అల్లాడిన తెలంగాణ నేడు అభివృద్ధి, సంక్షేమంలో ఎలా పరుగులు పెడుతున్నదో యావత్‌ దేశం గమనిస్తున్నదన్నారు. ఇటువంటి పాలనలో విపక్షాలు పాదయాత్రలు కాదు కదా, మోకాలి మీద యాత్రలు చేసినా ప్రజలు వారిని విశ్వసించరని గుర్తుంచుకోవాలని హితవు పలికారు. యావత్‌ తెలంగాణ సమాజం ఎప్పటికీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ వెంటే నడుస్తుందని పునరుద్ఘాటించారు.

రామన్నపేట, సెప్టెంబర్‌ 25 : అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో దేశంలో నంబర్‌ వన్‌గా తెలంగాణ నిలుస్తున్నదని, ప్రగతికి కేరాఫ్‌ అడ్రస్‌గా రాష్ర్టాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీర్చిదిద్దుతున్నారని విద్యుత్‌ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని మల్లికార్జున గార్డెన్స్‌ ఫంక్షన్‌హాలులో శనివారం జరిగిన టీఆర్‌ఎస్‌ మండల కమిటీ, అనుబంధ కమిటీల పరిచయ వేదిక, బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రతిపక్షాలు ముక్కు నేలకు రాసి మోకాళ్లపై యాత్రలు చేసినా వారి మాటలను ప్రజలు నమ్మరని ఆయన ఎద్దేవా చేశారు. మోడీ సొంత రాష్ట్రం గుజరాత్‌లో 24 గంటల ఉచిత విద్యుత్‌, రైతుబంధు, రైతు బీమా, ఆసరా పింఛన్‌ పథకాలు అమలవుతున్నాయా..? అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలకంటే ఎక్కువగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని, హైదరాబాద్‌ నీడలో బతికేందుకు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం నుంచి వేలాదిగా వలస వస్తున్నారని పేర్కొన్నారు. కేసీఆర్‌ కాలి గోటికి కూడా సరిపోని ప్రతిపక్ష నాయకులు అవాకులు, చవాకులు పేలుతుంటే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మాట్లాడుతూ ప్రతి కార్యకర్తనూ కంటికి రెప్పలా కాపాడుకుంటామని అన్నారు. పార్టీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి తకెళ్లపల్లి రవీందర్‌రావు మాట్లాడుతతూ పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేస్తూ ప్రతి సంక్షేమ పథకాన్నీ ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలో ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య టీఆర్‌ఎస్‌ పార్టీ జెండాను ఎగురవేసి కార్యకర్తలు నిర్వహించిన బైక్‌ ర్యాలీలో పాల్గొన్నారు. నూతన అధ్యక్షుడు మందడి ఉదయ్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి పోచబోయిన మల్లేశ్‌ను గజమాలతో సన్మానించారు. నంద్యాల భిక్షంరెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్‌, ఎంపీపీ కన్నెబోయిన జ్యోతీబలరాం, జడ్పీటీసీ పున్న లక్ష్మీ జగన్‌ మోహన్‌, నాయకులు గంగుల కృష్ణారెడ్డి, మందడి రవీందర్‌రెడ్డి, కన్నెబోయిన అయిలయ్య, గుత్తా నర్సిరెడ్డి, తిమ్మాపురం మహేందర్‌రెడ్డి, బందెల రాములు, కమ్మంపాటి శ్రీనివాస్‌, అంతటి రమేశ్‌, మందడి శ్రీధర్‌రెడ్డి, పోతరాజు సాయి కుమార్‌, సర్పంచులు ఎడ్ల మహేందర్‌రెడ్డి, అప్పం లక్ష్మీనర్సు, రేఖ యాదయ్య, మెట్టు మహేందర్‌రెడ్డి, పిట్ట కృష్ణారెడ్డి, కోళ్ల స్వామి, చెరుకు సోమయ్య, ముత్యాల సుజాత, బందెల యాదయ్య, కడమంచి సంధ్య, ఎంపీటీసీలు గొరిగె నర్సింహ, ఎండీ రేహాన్‌, గాదె పారిజాత, దోమల సతీశ్‌, ఎండీ ఆమేర్‌ పాల్గొన్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement