e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, October 18, 2021
Home జిల్లాలు పప్పు పంటలకే ప్రాధాన్యం!

పప్పు పంటలకే ప్రాధాన్యం!

  • వరికి ప్రత్యామ్నాయంగా ప్రభుత్వ ప్రోత్సాహం
  • నూనెగింజలు, పప్పు దినుసులతో లాభాలు
  • రేపటి నుంచి వారంపాటు సదస్సులు
  • క్లస్టర్ల వారీగా అవగాహన కల్పించనున్న అధికారులు
  • యాసంగి నుంచి సాగుకు చర్యలు

పప్పు పంటలే సాగు చేద్దాం.. లాభాలు సాధిద్దామంటూ వ్యవసాయ శాఖ రైతుల ముందుకు వెళ్లనున్నది. కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లు నిలిపివేస్తుండటంతో రాష్ట్ర ప్రభుత్వం యాసంగి నుంచి పప్పు పంటల సాగు వైపు కర్షకులను ప్రోత్సహించాలని నిర్ణయించింది. ఈ క్రమంలో రైతులందరికీ వరికి ప్రత్యామ్నాయ పంటలు, సాగు, మార్కెటింగ్‌, లాభాలపై అవగాహన కల్పించేందుకు చర్యలు చేపడుతున్నది. నాలుగేండ్లలో చేతికొచ్చే ఆయిల్‌ పాంలో అంతర పంటగా వేరుశనగ, కందులు, మొక్కలు, పెసర్లు సాగు చేసుకోవచ్చని వివరించనున్నది. సులభ యాజమాన్యం, అధిక డిమాండ్‌ ఉన్న ప్రత్యామ్నాయ పంటలతో రైతులు ఆర్థికంగానూ లబ్ధి పొందే అవకాశం ఉన్నది. శుక్రవారం నుంచి
30వ తేదీ వరకు వ్యవసాయ క్లస్టర్ల వారీగా అధికారులు సదస్సులు నిర్వహించనున్నారు. నూనెగింజలు, పప్పు దినుసులతో లాభాలు వస్తాయని పూర్తి

స్థాయిలో అవగాహన కల్పించనున్నారు.

- Advertisement -

నాగర్‌కర్నూల్‌, సెప్టెంబర్‌ 22 (నమస్తే తెలంగాణ) : రా నున్న రోజుల్లో వరి సాగుకు గడ్డుకాలం ఏర్పడనున్నది. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఎఫ్‌సీఐ.. ధాన్యం కొనుగోలును నిలిపివేయనున్నది. దీంతో వరినే నమ్ముకున్న రైతులు నష్టపోయే పరిస్థితులు ఏర్పడనున్నాయి. ముందు జాగ్రత్తగా సీఎం కేసీఆర్‌ ప్రత్యామ్నాయ పంటల సాగు చేపట్టేలా రైతులను ప్రోత్సహించాలని వ్యవసాయ శాఖను ఆదేశించారు. దీంతో రానున్న యాసంగి సీజన్‌లో వరికి ప్రత్యామ్నాయంగా పప్పు ధాన్యం పంటలను సాగు చేసేలా రైతులకు అవగాహన కల్పించనున్నా రు. శుక్రవారం నుంచి వ్యవసాయ క్లస్టర్ల వారీగా సమావే శాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రైతు వేదిక లే ఈ సమావేశాలకు నిలయంగా మారుతున్నాయి. ప్రస్తుతం వరి పంటలు పండించిన రైతులకు మార్కెటింగ్‌తోపాటు కొ నుగోళ్లకు ఎదురయ్యే ఇబ్బందులను ఏఈవోలు వివరించనున్నారు. వచ్చే సీజన్‌లోనూ వరి సాగు చేస్తే కలిగే నష్టాలపై అవగాహన కల్పిస్తారు. వరి సాగు చేసేందుకు నాలుగైదు నెలల స మయం పడుతుంది. రైతులు పొలం చదును చేయడంతో ప్రా రంభించి నేలను దమ్ము చేయడం, నారు పెంచడం, నాట్లు వే యడం, కలుపు తీయడం, నీళ్లు అందించడం, పురుగు మం దులు, పంట కోత, నూర్పిళ్లు చేయడం, తూర్పార పట్టడం, వడ్లు ఆరబెట్టడం తర్వాత చివరగా మార్కెట్‌కు తీసుకెళ్లి కొనుగోళ్లు చేయాల్సి ఉంటుంది. దీర్ఘకాలిక వరి 150 రోజుల్లో, మ ధ్యకాలిక వరి 135 రోజుల్లో, స్వల్ప కాలిక వరి 120 రోజుల్లో దిగుబడి వస్తుంది. ఇలా వరి పండించేందుకు నెలల తరబడి కాలం కావడంతోపాటు సాగునీళ్లు అధికం అవుతాయి. సకాలంలో వర్షాలు కురవకపోతే, అధిక వర్షాలు కురిస్తే, నార్లు ఆలస్యమైతే పంట సాగు, దిగుబడి కష్టం అవుతుంది. ఇక కొ నుగోళ్లు కూడా వచ్చే సీజన్‌ నుంచి నిలిపివేయనుండడంతో పప్పు పంటలే ప్రత్యామ్నాయమని వ్యవసాయ అధికారులు తేల్చి చెబుతున్నారు. అదే నూనె గింజలు సాగుతో రైతులకు తక్కువ సమయంలో అధిక లాభాలు ఆర్జించే అవకాశాలు ఉ న్నాయి. ఇందులో కంది, పెసర్లు, మినుములు, ఆముదం, పొద్దుతిరుగుడు, వేరుశనగ, పప్పు శనగ, నువ్వులు, జొన్న, రాగులు, మొక్కజొన్న, కుసుమ, పామాయిల్‌ వంటి పంటలను సాగు చేయాలని సూచిస్తున్నది. ప్రస్తుతం మార్కెట్‌లో ఈ పంటలకు అధికంగా డిమాండ్‌ ఉంది. విదేశాల నుంచి ఈ పంటల ఉత్పత్తులు దిగుమతులు చేసుకునే పరిస్థితులు ఉన్నా యి. ఈ పంటలను అంతర పంటలుగానూ వర్షాధారంగానే కాకుండా నీటి పారుదల కింద కూడా సాగు చేయొచ్చు. భూ ములు నిస్సారం కాకుండా కాపాడుతుంది. పప్పు ధాన్యాపు పంటల వేర్ల ద్వారా హెక్టారు నేలకు వాతావరణంలో నుంచి గ్రహించిన 40-50 కిలోల నత్రజనిని అందిస్తాయి. ప శువులకు మేతగా ఉపయోగపడుతుంది. కలుపు ఉధృ తి తగ్గిస్తుంది. నేల కోతలు తగ్గుతాయి. నాలుగేండ్లలో చేతికి వచ్చే ఆయిల్‌పామ్‌లో అంతర పంటగా వేరుశనగ, కందులు, మొక్కలు, పెసర్లు సాగు చేసుకోవ చ్చు. ఇలా సులభ యాజమాన్యం, అధిక డిమాండ్‌ ఉన్న ప్రత్యామ్నాయ పంటలతో రైతులు ఆర్థికంగా నూ లబ్ధి పొందొచ్చు. రైతు వేదికల్లో ఈ నెల 30 వరకు వ్యవసాయ శాఖ ద్వారా ఏఈవోలు రైతులకు అవగాహన కల్పించనున్నారు. వారం రోజులపాటు నాగర్‌కర్నూల్‌ జిల్లాలోని 143 వ్యవసాయ క్లస్టర్ల పరిధిలో రైతులకు ప్రత్యామ్నాయ పంటల సాగుపై అవగాహన సదస్సు నిర్వహించనున్నట్లు డీఏవో వెంకటేశ్వర్లు చెప్పారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement