సీఎం రిలీఫ్ ఫండ్‌తో పేదలకు ఆర్థిక అండ..
తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం అందచేస్తున్న సంక్షేమ పథకాలతో పేద ప్రజలు ఎంతో లబ్ధి పొందుతున్నారని కార్వాన్ నియోజకవర్గం ఎమ్మెల్యే కౌసర్‌మొహినుద్దీన్ అన్నారు. మంగళవారం టోలిఛౌకిలోని ఎమ్మెల్యే కార్యాలయంలో లబ్దిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే అందచేశారు.
చిన్నారులను క్రీడల్లో ప్రోత్సహించాలి
క్రీడల్లో చిన్నారులకు ప్రోత్సహించాలని నాంపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే జాఫర్మెరాజ్హు స్సేన్అన్నారు. మంగళవారం షార్ఫ్ మార్షల్ ఆర్ట్ అకాడమీకి చెందిన కోచ్ మల్లేష్ యాదవ్ తన అకాడమీలో శిక్షణ పొందుతున్న చిన్నారులతో వెళ్లి ఎమ్మెల్యే జాఫర్‌మెరాజ్ హుస్సేన్‌ను కలిశారు.
హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్‌ను కలిసిన రైల్వే పీఎసీ సభ్యురాలు
హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయను మంగళవారం రైల్వే పీఎసి సభ్యురాలుగా నియమితురాలైన కార్వాన్ నియోజకవర్గం లంగర్‌హౌస్ కు చెందిన సీనియర్ మహిళా నాయకురాలు జి. ఉమారాణి మర్యాదపూర్వకంగగా కలిశారు.