e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, October 21, 2021
Home జిల్లాలు భక్తులతో కిటకిటలాడిన చర్చి

భక్తులతో కిటకిటలాడిన చర్చి

మెదక్‌ మున్సిపాలిటీ, సెప్టెంబర్‌ 26 : మెదక్‌ చర్చి ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు జరిగిన ప్రార్థనలో భక్తులు పాల్గొన్నారు. చర్చి గురువులు భక్తులను ఉద్దేశించి దైవ సందేశం చేశారు. ఏసయ్య దీవెనలు, ఆశీస్సులు అందరికీ ఉండాలని ప్రార్థనలు చేశారు. ఏసయ్య సర్వజనానికి దేవుడని అన్నారు. ప్రార్థనల అనంతరం భక్తు లు చర్చి ప్రాంగణంలో చెట్లకింద వంటావార్పు చేసుకున్నారు. కార్యక్రమంలో చర్చి గురువులు రాజశేఖర్‌, దయానంద్‌, ఐవన్‌ అనుగ్రహ, జైపాల్‌, ప్రేమ్‌కుమార్‌ చర్చి కమిటీ సభ్యులు రోలాండ్‌పాల్‌, గెలన్‌, సంసాన్‌ సందీప్‌, జయరాజ్‌, శాంతికుమార్‌, సువన్‌డగ్లస్‌, జాయిముర్రే పాల్గొన్నారు.

  • నేడు సీఎస్‌ఐ ఆవిర్భావ దినోత్సవం
  • తరలి రానున్న భక్తులు
  • ప్రపంచంలోనే అతి పెద్ద ఐక్య సంఘం సీఎస్‌ఐ

ప్రపంచంలోనే అతి పెద్ద ఐక్య సంఘంగా చర్చి ఆఫ్‌ సౌత్‌ ఇండియా (సీఎస్‌ఐ) కొనసాగుతున్నది. ఈ సంఘం ఆవిర్భావ వేడుకలు ఏటా సెప్టెంబర్‌ 27న నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నది. 74వ ఆవిర్భావ వేడుకలు జరుపుకోనున్నారు. ప్రపంచంలోనే ప్రఖ్యాతి గాంచిన మెదక్‌ చర్చి నిర్మాణం 1914లో ప్రారంభమై, 1924లో పూర్తయిం ది. 18 ఏండ్ల తర్వాత 1947 సెప్టెంబర్‌ 27చర్చి ఆఫ్‌ సౌత్‌ ఇండియా ఆవిర్భవించింది. దీంతోపాటు ఇదే రోజున స్త్రీల మైత్రీ సంఘం ఏర్పడింది. ఈ సంఘంలో (సీఎస్‌ఐ) దక్షిణ భారత దేశంలోని కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌, కేరళ, ఉత్తర శ్రీలంకలతోపాటు తదితర రాష్ర్టాలకు చెం దిన 22 అధ్యక్ష మండలిలు (డయాసిస్‌లు) ఉన్నా యి. మెదక్‌ డయాసిస్‌ ఆధీనంలో సుమారు 880 చర్చిలు ఉన్నాయి. ఆవిర్భవానికి మెదక్‌ అధ్యక్ష మండలి పరిధిలోని ఉమ్మడి మెదక్‌, రంగారెడ్డి, హైదరాబాద్‌, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌ జిల్లాలోని నుంచి కాకుం డా రాష్ట్రంలోని పలు ప్రాంతాలతోపాటు కర్ణాటక, మహారాష్ట్ర నుంచి వేలాదిమంది భక్తులు తరలివస్తారు. ఇందులో స్త్రీ మైత్రీ సంఘం మహిళా భక్తులు పెద్దఎత్తున తరలివస్తుంటారు. ప్రత్యేక ప్రార్థనలనంతరం పట్టణంలో పెద్దఎత్తున మైత్రీ సంఘాల మహిళల ఆధ్వర్యం లో ఏసయ్య భక్తి గీతాలు ఆలపిస్తూ ర్యాలీ తీస్తారు. ర్యాలీలో బిషప్‌తోపాటు స్త్రీ మైత్రీ సంఘం అధ్యక్షురాలు పాల్గొంటారు. వేడుకల్లో బిషప్‌ రెవరెండ్‌ సాలోమాన్‌రాజ్‌తో పాటు సీఎస్‌ఐ కమిటీ సభ్యులు పాటు డయాసిస్‌ పరిధిలోని పాస్టర్లు పాల్గొనున్నారు. కరోనా నేపథ్యంలో గతేడాది పెద్దఎత్తున వేడుకలు నిర్వహించలేదు. ఈసారి నిరాడంబరంగా నిర్వహించనున్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement