e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, June 24, 2021
Home జిల్లాలు ప్రగతిపల్లె.. చిల్కేపల్లి

ప్రగతిపల్లె.. చిల్కేపల్లి

ప్రగతిపల్లె.. చిల్కేపల్లి

ప్రత్యేక ఆకర్షణగా పల్లె ప్రకృతి వనం
పారిశుధ్య నిర్వహణ భేష్‌
వందశాతం మరుగుదొడ్ల నిర్మాణం
పల్లెప్రగతితో మారిన గ్రామ రూపురేఖలు
ఝరాసంగం, మార్చి 26 : అది మారుమూల పల్లె. గతంలో అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంది. సౌకర్యాలు అంతంత మాత్రమే. కొన్నేండ్లుగా ఆ పల్లె వాసులు సమస్యలతో సతమతమవుతున్నారు. పట్టించుకునేవారు లేక నానా ఇబ్బందులు పడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతితో సౌకర్యాలు సమకూరుతున్నాయి. ఆహ్లాదాన్ని పంచేలా పల్లె ప్రకృతి వనం, పారిశుధ్య నిర్వహణతో ఆ గ్రామం స్వచ్ఛత దిశగా అడుగులు వేస్తున్నది. అంతే కాదు వంద శాతం మరుగుదొడ్లు పూర్తి చేసుకున్నది. ఆ గ్రామమే ఝరాసంగం మండలంలోని చిల్కేపల్లి.

రూపురేఖలు మార్చిన పల్లెప్రగతి
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పల్లె ప్రగతితో చిల్కేపల్లి రూపురేఖలు మారుతున్నాయి. గ్రామంలో ఏండ్ల తరబడి ఉన్న సమస్యలు పరిష్కారమవుతున్నాయి. గ్రామంలో రూ. 6 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనం గ్రామానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నది. చిన్న గ్రామమే అయినప్పటికీ ఖాళీ ప్రదేశాలు, రహదారుల పక్కన ఆహ్లాదకరంగా మొక్కలు కనిపిస్తున్నాయి. పంచాయతీ పాలక వర్గం ప్రత్యేక శ్రద్ధ్ద తీసుకుని వివిధ రకాల పూలు, పండ్ల మొక్కలను పెంచుతున్నారు. వైకుంఠధామం, డంపింగ్‌యార్డు నిర్మాణాలను పూర్తి చేశారు.

రూ. 8 లక్షలు మంజూరు
గ్రామంలో రోడ్ల పక్కన పెంట గుంతలు, మురికి కుంటలు పడావుబడ్డ బోరు బావులు, పాత మంచి నీటి బావులు, ఇండ్లు, కరెంటు స్తంభాలు 13, పల్లె ప్రకృతి వనం, ప్రమాదకరంగా ఉన్న గుంతల్లో మొరం పోశారు. వెయ్యి గుంతలు తీసి మొక్కలు నాటారు. రోడ్డు ఇరువైపులా 500 గుంతలు, 500 వందల మొక్కలు, కమ్యూనిటీ ద్వారా మొక్కలు నాటేందుకు నిధులను ఖర్చు చేశారు.

గ్రామం భౌగోళిక స్వరూపం….
గ్రామ జానాభా 1123 మంది. అందులో స్త్రీలు 572, పురుషులు 551 మంది ఉన్నారు. గ్రామంలో 879 మంది ఓట్లు ఉండగా, స్త్రీలు 449, పురుషులు 430 మంది ఉన్నారు.
పింఛన్‌ దారుల వివరాలు
వితంతువులు 91, దివ్యాంగులు 9, వృద్ధులు 35, ఒంటరి స్త్రీలు 2,మొత్తం 137 మంది పింఛన్‌ దారులు ఉన్నారు.
ఇతర వివరాలు
ఇండ్లు 233, మరుగుదొడ్లు 233, హ్యాండ్‌ బోర్లు 4, సింగిల్‌ ఫేస్‌ మోటర్లు 2, త్రిబుల్‌ ఫేస్‌ మోటర్లు 2, జాబ్‌కార్డులు 299, కూలీలు 297 మంది, శ్రమశక్తి సంఘాలు 17, సామాజిక ఇంకుడు గుంతలు 6, పశువుల తోట్లు 4, అంత్యోదయ కార్డులు 33, తెల్ల రేషన్‌ కార్డులు 306 ఉన్నాయి. ప్రాథమిక పాఠశాల 1, అంగన్‌వాడీ భవనం 1, మిషన్‌ భగీరథ ట్యాంక్‌ 1, పంచాయతీ కార్మికులు ఇద్దరు, రేషన్‌ దుకాణం 1 ఉంది. వ్యవసాయ సాగు భూమి 1971.25 ఎకరాలు, ప్రభుత్వ భూమి 93.7 ఎకరాల భూమి ఉంది. గ్రామంలో 24 మహిళా సంఘాలున్నాయి.
రీసైక్లింగ్‌తో మొక్కలకు ఎరువుగా..
ప్రభుత్వం అందించిన గ్రామ పంచాయతీ ట్రాక్టర్‌తో గ్రామంలోని పరిసరాల పరిశుభ్రత చేసి, చెత్తను డంపింగ్‌ యార్డుకి తరలిస్తున్నారు. రీసైక్లింగ్‌తో పల్లె ప్రకృతిలోని మొక్కలకు ఎరువుగా అందిస్తున్నారు. గ్రామంలో ఇంటింటికీ ఇంకుండు గుంతల నిర్మాణం చేపడుతున్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ప్రగతిపల్లె.. చిల్కేపల్లి

ట్రెండింగ్‌

Advertisement