e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, October 18, 2021
Home జిల్లాలు ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

  • మెదక్‌ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి
  • మీ కోసం.. కార్యక్రమానికి అనూహ్య స్పందన
  • బాధితులకు సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కుల అందజేత
  • ఎమ్మెల్యేను కలిసిన ఏఎంసీ చైర్మన్‌ జగపతి

మెదక్‌, సెప్టెంబర్‌ 16 : ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, నిరుపేదలకు తెలంగాణ ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. గురువారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ‘మీ కోసం.. నేనున్నా’ కార్యక్రమం నిర్వహించారు. ఇందు లో భాగంగా 167 మంది తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మెదక్‌ నియోజకవర్గంలోని ప్రజా సమస్యలను పరిష్కరించేందుకే ప్రతి నెలా 2, 16వ తేదీల్లో ‘మీ కోసం.. నేనున్నా’ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులకు సూచించారు.

రూ.57.21 లక్షల సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కుల అందజేత..

- Advertisement -

మెదక్‌ నియోజకవర్గంలోని వివిధ గ్రామాలకు చెందిన 163 మందికి మంజూరైన రూ.57,21,500 విలువైన సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి అందజేశారు. మెదక్‌ పట్టణానికి చెందిన రవి, ప్రశాంతికి రూ.60 వేల చొప్పున, మెదక్‌ మండలం జానకంపల్లికి చెందిన సత్యంకు రూ.60 వేలు, తిమ్మానగర్‌కు చెందిన పోచమ్మకు రూ.49 వేలు, హవేళీఘణపూర్‌ మండలం సర్ధనకు చెందిన భూపతి శంకరయ్యకు రూ.60 వేలు, నాగాపూర్‌కు చెందిన తులసీకి రూ.40 వేలు, రామాయంపేట పట్టణానికి చెందిన శోభారాణికి రూ.53 వేలు, రాయిలాపూర్‌కు చెందిన రఘుపతికి రూ.58 వేలు, నిజాంపేట మండలంలోని రాయిలాపూర్‌కు చెందిన బషీర్‌కు రూ.40 వేలు, పాపన్నపేట మండలం పాతలింగాయిపల్లికి చెందిన గోపాల్‌కు రూ.19 వేలు, గాజులగూడెంకు చెందిన గోవింద్‌కు రూ.39 వేలు, నాగ్సాన్‌పల్లికి చెందిన గంగారెడ్డికి రూ.60 వేలు, ముద్దాపూర్‌కు చెందిన పిట్ల రవికి రూ.32 వేలు, జంగరాయికి చెందిన శ్యామయ్యకు రూ.60 వేలు, శాలిపేట గ్రామానికి చెందిన సత్యనారాయణకు రూ.60 వేలు, మిర్జాపల్లికి చెందిన అనిల్‌కుమార్‌కు రూ.65 వేలు, గజగట్లపల్లికి చెందిన ఈశ్వరమ్మకు రూ.60 వేల చొప్పున చెక్కులను అందజేశారు.

ఎమ్మెల్యేను కలిసిన మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ జగపతి..

మెదక్‌ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌గా నూతనంగా ఎన్నికైన బట్టి జగపతి, డైరెక్టర్లు శంకర్‌, ఇందాద్‌అలీ, సాప సాయిలు తదితరులు గురువారం తన క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డిని కలిసి సన్మానించారు. ఈ సందర్భంగా ఏఎంసీ చైర్మన్‌ జగపతిని ఎమ్మెల్యే అభినందించారు. ఎమ్మెల్యేను కలిసినవారిలో జడ్పీ వైస్‌ చైర్మన్‌ లావణ్యరెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ చంద్రపాల్‌, మున్సిపల్‌ కమిషనర్‌ శ్రీహరి, కౌన్సిలర్లు శ్రీనివాస్‌, సమీయొద్దీన్‌, జయరాజ్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు రాగి అశోక్‌, లింగారెడ్డి, నర్సింహులు, ఉమర్‌, శంకర్‌, జడ్పీటీసీలు, ఎంపీపీలు, వైస్‌ ఎంపీపీలు, సర్పంచులు, ఎంపీటీసీలు ఉన్నారు.

పద్మక్క పాటల సీడీ ఆవిష్కరణ..

ప్రముఖ గాయకుడు నర్సింహులు రచించి పాడిన జనం గుండెలో నిలిచిన పద్మక్క పాటల సీడీని ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నర్సింహులు, కుమారుడు వంశీకృష్ణను ఎమ్మెల్యే అభినందించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ చంద్రపాల్‌, ఏఎంసీ చైర్మన్‌ బట్టి జగపతి, టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు శంకర్‌దయాల్‌చారి, ఉపాధ్యక్షుడు కామాటి కృష్ణ, నాయకులు అశోక్‌, ప్రకాశ్‌, రాము, రాజాగౌడ్‌, సిద్ధు, శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

పల్లెల్లో కరెంట్‌ సమస్య రానివ్వొద్దు

మెదక్‌, సెప్టెంబర్‌ 16 : పల్లెల్లో కరెంట్‌ సమస్య రానివ్వొద్దని, ఏమైనా సమస్యలుంటే వెంటనే పరిష్కరించాలని మెదక్‌ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి విద్యుత్‌శాఖ అధికారులకు సూచించారు. గురువారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పాపన్నపేట మండలంలో కరెంట్‌ సమస్యలపై విద్యుత్‌ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులతో ఆమె సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామాల్లో నెలకొన్న కరెంట్‌ సమస్యలను సర్పంచులు, ఎంపీటీసీలు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాల్లో ప్రమాదకరంగా ఉన్న స్తంభాలను వెంటనే తొలగించాలని, వేలాడుతున్న తీగలను గుర్తించి సరి చేయాలని ట్రాన్స్‌కో అధికారులకు సూచించారు. ప్రకృతి వనాలు, వైకుంఠధామాల్లో కూడా విద్యుత్‌ సౌకర్యం కల్పించాలన్నారు. గ్రామాల్లో పంట పొలాల వద్ద వేలాడుతున్న తీగలను ఫొటోలు తీసి వివరాలు రాసి అధికారుల దృష్టికి తీసుకురావాలని ఎమ్మెల్యే ప్రజాప్రతినిధులకు సూచించారు. సమావేశంలో ట్రాన్స్‌కో డీఈ కృష్ణారావు, ఏడీఈ దాలినాయుడు, ఏఈ శేఖర్‌, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు సోములు, మండల వైస్‌ ఎంపీపీ విష్ణువర్ధన్‌రెడ్డి, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement