e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, October 20, 2021
Home జిల్లాలు ఆడబిడ్డల పూలకింత

ఆడబిడ్డల పూలకింత

తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకైన బతుకమ్మ సంబురాలు ఉమ్మడి మెదక్‌ జిల్లావ్యాప్తంగా తొమ్మిది రోజుల పాటు అట్టహాసంగా కొనసాగాయి. ఆడబిడ్డలు తీరొక్క పువ్వులతో బతుకమ్మలను పేర్చగా.. ఊరూవాడ పూలవనాలుగా మారాయి. గురువారం సద్దుల బతుకమ్మ సంబురాలు అంబరాన్నంటాయి. రంగురంగుల పూలతో బతుకమ్మాలను పేర్చి, అందంగా తయారై.. కూడళ్లు, చెరువులు, ఆలయాల వద్ద మహిళలు ఆడిపాడి సందడి చేశారు. అనంతరం నైవేద్యాలు సమర్పించి, వాయినాలు ఇచ్చిపుచ్చుకొని బతుకమ్మలను చెరువులు, కొలనుల్లో నిమజ్జనం చేశారు. ఈ ఉత్సవాలతో ఊరూవాడ సందడిగా మారింది. ఆడబిడ్డలతో ఇండ్లన్నీ కళకళలాడాయి.

  • ఉమ్మడి మెదక్‌ జిల్లా నెట్‌వర్క్‌, అక్టోబర్‌ 14 తీరొక్కపూలను ఒక్కదగ్గర చేర్చి.. పేర్చిన బతుకమ్మలు పూలసింగిడిని పూయించాయి. మహిళలు ఆడిపాడగా.. ఉమ్మడి మెదక్‌ జిల్లాలోని పల్లెలు, పట్టణాల్లో సద్దుల బతుకమ్మ సంబురాలు అంబరాన్నంటాయి. గౌరమ్మను గంగమ్మ చెంతకు చేర్చిన మహిళలు వచ్చే ఏడాది మళ్లీ రావాలంటూ కోరుకున్నారు. మంత్రి హరీశ్‌ రావు దంపతులు సిద్దిపేటలో జరిగిన బతుకమ్మ సంబురాల్లో పాల్గొన్నారు. బతుకమ్మ నిమజ్జనంతో కొమటి చెరువు సందడిగా మారంది.
- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement