e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, September 27, 2021
Home జిల్లాలు పథకాల అమలును పర్యవేక్షించాలి

పథకాల అమలును పర్యవేక్షించాలి

  • అటవీ భూములు అన్యాక్రాంతం కాకుండా చూడాలి
  • సబ్సిడీ గొర్రెలను లబ్ధిదారులకు అందించాలి
  • మెదక్‌ జడ్పీ స్థాయీ సంఘం సమావేశంలో నారాయణ్‌ఖేడ్‌ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి

మెదక్‌ మున్సిపాలిటీ, సెప్టెంబర్‌ 14 : తెలంగాణ ప్రభుత్వ పథకాల అమలును జిల్లా అధికారులు పర్యవేక్షించాలని నారాయణ్‌ఖేడ్‌ ఎమ్మె ల్యే భూపాల్‌రెడ్డి సూచించారు. మంగళవారం మెదక్‌ జిల్లా ప్రజా పరిషత్‌ మూడో స్థాయీ సంఘం సమావేశం జడ్పీ కార్యాలయంలో జడ్పీ వైస్‌ చైర్‌పర్సన్‌ లావణ్యరెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరై వ్యవసాయం, పశుపోషణ, పాడి పరిశ్రమ, అటవీశాఖ, మత్స్యశాఖ, ఉద్యానవనం, పౌర సరఫరాలు, మార్కెటింగ్‌, భూ గర్భ శాఖల వారీగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సమీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారన్నారు. పచ్చదనాన్ని పెం చుతూ అటవీ భూములు అన్యాక్రాంతం కాకుం డా చూడాలని అటవీ శాఖాధికారులకు సూచించారు. ప్రజాప్రయోజనాల కోసం చేపట్టే పనులకు అటవీ అధికారులు సహకరించాలన్నారు. తెలంగాణలో 33 శాతం పచ్చదనాన్ని పెంచాలనే ఉద్దేశంతోనే ప్రభు త్వం హరితహారాన్ని చేపట్టిందన్నారు. అటవీ సంపదలో ఒక్క చెట్టు నేలకోరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అటవీ స్థలాలను ఎవరైనా ఆక్రమిస్తే కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. రైతులకు ఎరువుల విషయంలో ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అందజేయాలని సూచించారు. రెండో విడుత గొర్రెల పంపిణీ ఎంతవరకు వచ్చింది.. తొందరగా లబ్ధిదారులుకు పంపిణీ చేయాలన్నారు. రెండో విడుతలో జిల్లాలో 653 మంది లబ్ధిదారులు డీడీలు కట్టారని, వారికి త్వరలోనే 75 శాతం సబ్సిడీతో పంపిణీ చేయనున్నట్టు వివరించారు. ఈ సందర్భంగా ఆయా శాఖాలధికారులు తమ తమ శాఖల నివేదికలను చదివి వినిపించారు. అనంతరం మధ్యాహ్నం జరిగిన 5వ జడ్పీ స్థాయీ సంఘం సమావేశం కోల్చారం జడ్పీటీసీ మేఘమాల అధ్యక్షతన జరిగింది. స్త్రీ, సంక్షేమం ఇతర అంశాలపై చర్చించారు. 6వ స్థాయీ సంఘం సమావేశం రామాయంపేట జడ్పీటీసీ సంధ్య అధ్యక్షతన నిర్వహించారు. షెడ్యూల్డ్‌ తెగల, కులాల సం క్షేమం, అభివృద్ధి, వెనుకబడిన తరగతులు సంక్షేమం, అల్పసంఖ్యాకవర్గాల సంక్షేమం, ఇతర అంశాలపై చ ర్చించారు. సమావేశాలలో జడ్పీ సీఈవో శైలేశ్‌, జడ్పీటీసీలు సరోజ, కవిత, కో-ఆప్షన్‌ సభ్యుడు మన్సూర్‌ అహ్మద్‌ తదితర అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana